Vitamin E। నిగనిగలాడే నల్లని కురులు, మెరిసే చర్మం కోసం 'విటమిన్ ఇ' ని ఇలా వాడండి!
Vitamin E for Hair and Skin: విటమిన్ ఇ క్యాప్సూల్స్ సహాయంతో జుట్టుకు అనేక విధాల మేలు చేకూర్చవచ్చు. మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు.
Vitamin E for Hair and Skin: అనేక జుట్టు సమస్యలకు కొబ్బరినూనెతో తలకు మసాజ్ చేయడం ద్వారా చక్కని పరిష్కారం లభిస్తుంది. అయితే జుట్టు సంరక్షణకు సంబంధించి ఈ ఆయిల్ మసాజ్ ఒక్కటే సరిపోదు. జుట్టుకు అవసరమైన పోషకాలు అందేలా చూడటం కూడా ముఖ్యమే. విటమిన్ ఇ క్యాప్సూల్స్ సహాయంతో జుట్టుకు అనేక విధాల మేలు చేకూర్చవచ్చు. జుట్టు పోషణకు విటమిన్ ఇ చాలా ముఖ్యం. ఇది వెంట్రుకలను దృఢంగా మార్చడమే కాకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది, మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా చుండ్రును నిర్మూలించడం, తెల్ల వెంట్రుకలు రాకుండా నివారిస్తుంది. అయితే విటమిన్ ఇ క్యాప్సూల్‌ను మీ జుట్టుకు ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇక్కడ కొన్ని పద్దతులు తెలుసుకోండి.

బాదంనూనె- విటమిన్ ఇ థెరపీ
మీ జుట్టు తెల్లబడుతుంటే విటమిన్ ఇ కలిపిన బాదాం నూనెను వారానికి రెండుసార్లు మీ తలకు మసాజ్ చేయండి. క్యాప్సూల్‌ని పగలగొట్టి, లోపల ఉన్న జెల్‌ని గోరువెచ్చని బాదం నూనెతో కలపండి. ఆ తర్వాత ఈ నూనెను జుట్టుకు పట్టించాలి. ఇలా కొన్నాళ్ల పాటు క్రమం తప్పకుండా జుట్టుకు ఈ చికిత్స చేయడం వల్ల జుట్టు తెల్లబడటం ఆగిపోతుంది.
కొబ్బరినూనె- విటమిన్ ఇ థెరపీ
జుట్టు చిట్లడం, జుట్టు రాలడం వంటి సమస్యల గురించి మీరు ఆందోళన చెందుతుంటే, కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడిచేసి, అందులో విటమిన్ ఇ క్యాప్సూల్ మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రెండు గంటల పాటు ఉంచుకొని ఆ తర్వాత నీటితో కడిగేయాలి. తేలికపాటి షాంపూ మాత్రమే ఉపయోగించండి. ఇది మీ జుట్టు రాలకుండా కాపాడుతుంది.
ఉల్లిపాయ రసం- విటమిన్ ఇ థెరపీ
జుట్టు పెరుగుదల కోసం ఉల్లిపాయ రసం- విటమిన్ ఇ కలిపి ఉపయోగించవచ్చు. ఉల్లిపాయ రసంలో విటమిన్ ఇ క్యాప్సూల్ మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి కడిగేసుకోవాలి. ఇది జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యమైన చర్మం కోసం విటమిన్ ఇ
'విటమిన్ ఇ' కేవలం మీ జుట్టుకోసం మాత్రమే కాదు, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు.
విటమిన్ E పొడి చర్మాన్ని తేమగా మారుస్తుంది, చర్మానికి మంచి జీవకళను అందిస్తుంది. ముఖంపై నల్ల మచ్చలను తొలగించడంలోనూ కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను చర్మంపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల హైపర్‌పిగ్మెంటేషన్ సమస్యను సులభంగా నివారించవచ్చు, చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.
మన చర్మం కింద పొరల్లో హైలురోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ దాని ఉత్పత్తిని పెంచుతుంది. విటమిన్ ఇ, కలబందను మిక్స్ చేసి వారానికి ఒకటి లేదా రెండు సార్లు చర్మానికి అప్లై చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు.
గమనిక: ఇక్కడ అందించిన చిట్కాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం నుండి సేకరించినవి. కాబట్టి ఈ చిట్కాలుపాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
సంబంధిత కథనం