Pomegranate Juice Benefits । జలుబైనా, నరాల బలహీనతకైనా దానిమ్మ జ్యూస్ తాగితే ఎంతో మేలు!
Pomegranate Juice Benefits: దానిమ్మ రసంలో ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలు ఉన్నాయి. నరాల బలహీనతను తొలగించడం, కండరాలను బలోపేతం చేయడంలోనూ దానిమ్మలోని పోషకాలు సమర్థవంతంగా పని చేస్తాయి.

Pomegranate Juice Benefits: వేసవిలో అలసట తీవ్రంగా ఉంటుంది, శరీరం నీటిని కోల్పోయినపుడు నీరసం పెరుగుతుంది. ముఖ్యంగా వేసవిలో ఇది ఎక్కువగా జరుగుతుంది. అయితే వేసవిలో కొన్నిసార్లు అకాల వర్షాల కారణంగా, వేడి -చల్లని వాతావరణ పరిస్థితుల ప్రభావం చేత డీహైడ్రేషన్ తో పాటు, వైరల్ ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది. దీని వలన తమ పనులు కూడా సొంతగా చేసుకోలేని బలహీనంగా తయారవుతారు. జలుబు ఉన్నప్పుడు చాలా శక్తిహీనంగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్కువగా ఆరోగ్యకరమైన ద్రవాలు, పండ్ల రసాలు తాగాలి.
మీకు శక్తిహీనంగా అనిపించినపుడు దానిమ్మ రసం తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలో ఐరన్, మెగ్నీషియం సహా విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తాజాగా తీసిన దానిమ్మ రసం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కనబరుస్తుంది. ఇది ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వైరస్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడానికి దానిమ్మ జ్యూస్ ఎంతో ఆరోగ్యకరమైనది. ఇది జలుబును 40% వరకు తగ్గించగలదు. మీరు ప్రతిరోజూ తాజా దానిమ్మ రసాన్ని త్రాగవచ్చు లేదా దానిమ్మ గింజలను స్మూతీస్ లేదా హెర్బల్ టీలో చల్లుకొని తీసుకోవచ్చు.
దానిమ్మ రసంలో ఆరోగ్య పరంగా అనేక విధాలుగా ప్రయోజనం చేకూర్చే అనేక అంశాలు ఉన్నాయి. నరాల బలహీనతను తొలగించడం, కండరాలను బలోపేతం చేయడంలోనూ దానిమ్మలోని పోషకాలు సమర్థవంతంగా పని చేస్తాయి.
దానిమ్మ రసం నరాలకు మేలు చేస్తుంది?
దానిమ్మపండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి శరీరంలో వాపు, మంటను తగ్గిస్తాయి. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి,. ఇందులోని మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజూ దానిమ్మ రసం తాగటం వలన నరాల బలహీనతను తగ్గించవచ్చు.
అదనంగా దానిమ్మ శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గిస్తుంది, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది, కండరాలలో బలాన్ని పెంచుతుంది, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాకుండా, దీనిలోని ఇనుము పోషకం శరీరంలో రక్తహీనతను తొలగిస్తుంది.
దానిమ్మ రసం ఎలా తీసుకోవాలి?
మీరు కనీసం రోజుకు ఒక్కసారైనా దానిమ్మ రసం తాగాలి. తాజాగా రసం తీసిన దానిమ్మ జ్యూస్ లో ఏమీ కలపకుండా స్వచ్ఛంగా త్రాగడానికి ప్రయత్నించండి. ఈ జ్యూస్ మీ ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుంది.
సంబంధిత కథనం