Friday Motivation : ఏదో తలవడం.. వేరే జరగడం.. సర్లే అనడమే వేదాంతం-friday motivation on two mental actions can change your life forgive yourself move on ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Motivation On Two Mental Actions Can Change Your Life. Forgive Yourself. Move On.

Friday Motivation : ఏదో తలవడం.. వేరే జరగడం.. సర్లే అనడమే వేదాంతం

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 23, 2022 06:49 AM IST

Friday Motivation : మన ఆలోచనలే అన్ని సమస్యలకు ప్రధాన కారణం. అవి కంట్రోల్​లో లేకనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వాటిని అదుపులో పెట్టుకోండి. అది కంట్రోల్​ ఉంటే అన్ని సమస్యలు దూరం కాకపోయినా.. సమస్యలు అంత పెద్దవి కాను అనేది తెలుస్తుంది. ఒకవేళ మీరు గతంలో చేసిన వాటి గురించి ఇప్పుడు ఇంకా ఆలోచిస్తూ ఉంటే.. వాటిని బ్రేక్ చేసి.. మిమ్మల్ని మీరు క్షమించుకుని.. మూవ్ ఆన్ అవ్వండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : మన లైఫ్​ని మార్చే రెండు మానసిక చర్యలున్నాయి. అవేంటో తెలుసా? మొదటిది మన తప్పుల్ని మనం ముందు క్షమించుకోగలగడం. రెండవది ముందుకు సాగడం. ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. అది ఆవేశంలోనో.. కోపంలోనో.. మరి ఇంకేదైనా రీజన్ కావొచ్చు. ఇలా చాలా తప్పులకు పాల్పడుతూ ఉంటారు. అది తప్పు అని తెలియక కూడా చేసేస్తారు. తరువాత జరిగే పర్యావసనాలతో అర్థమవుతుంది. మనం తప్పు చేశామని. కానీ ఆ తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీరు మెంటల్​గా డిస్టర్బ్ అవుతారు. తెలిసిందేగా.. మెంటల్​గా ఫిట్​ లేకుంటే ఫిజికల్ డ్యామేజ్​కి సిద్ధంగా ఉండాల్సిందే. కాబట్టి మెంటల్​గా, ఫిజికల్​గా ఫిట్​గా ఉండాలంటే మీ ఆలోచనలకు బ్రేక్ ఇవ్వండి.

థింకింగ్ ఉండొచ్చు కానీ.. ఓవర్ థింకింగ్ ఎప్పటికైనా డేంజరే. ఎందుకంటే అవి ఓ విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలనే ఆత్రం కలిగిస్తాయి. కానీ తీరా చూస్తే.. అవి అర్థం కాకపోగా.. అపార్థాలకు దారి తీస్తాయి. గతంలో ఎదుటివారు చేసినవి అయినా.. మనం చేసిన తప్పుల గురించైనా.. ఎక్కువగా ఆలోచించేసి.. ప్రతిరోజూ దాని గురించి ఆలోచిస్తాము. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఆలోచించినంత మాత్రనా ఏ సమస్య పరిష్కారం కాదు. ఏ మనిషి మన దగ్గరికి రాడు. మీరు వాటిని కంట్రోల్ చేసుకోనంత వరకు ఏ సమస్య అయినా ఎక్కువ అవుతుందే తప్పా.. పరిష్కారం కాదు. అది విచారాన్ని, ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది.

మీ చేతుల్లో లేని వాటి గురించి ఆలోచించి.. మిమ్మల్ని మీరు ఇంకా బాధించుకోకండి. గతం మార్చలేము కాబట్టి.. వాటిని ఎలాగైనా ఎదుర్కోవాల్సిందే. వేరే మార్గం లేదు. కాబట్టి మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే.. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని క్షమించడం కన్నా.. మిమ్మల్ని మీరు క్షమించుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. మీరు అదే బాధతో.. ఆలోచనలతో ఉండిపోతే.. మీరు అక్కడే ఆగిపోతారు.

మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడే.. మీ పనులపై మీరు ఏకాగ్రత వహిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ పనులపై దృష్టి పెట్టాలంటే మీ ఆలోచనలకు కళ్లెం వేయాల్సిందే. అప్పుడే మీరు మీకు నచ్చిన జీవితంలో ముందుకు సాగుతారు. కొన్నిసార్లు మీ గతాన్ని ఏదో ఒక విధంగా వదిలించుకోవడమే మనకి మంచిది. అరె ఆ రోజు అలా వెళ్లకుండా ఉండాల్సిందే. అనకుండా ఉండాల్సిందే అని బాధపడుతూ ఎన్నిరోజులు కూర్చుంటాము చెప్పండి. అయ్యిందేదో అయ్యింది.. ఇప్పుడేమి చేయాలి అని ఆలోచిస్తే.. మెరుగైన ఫలితాలు పొందవచ్చు. వాస్తవాలను అంగీకరించాలి. రాబోయే పరిస్థితులను ఎదుర్కొనేందుకు మీ మనసును సిద్ధం చేసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్