Friday Motivation : వందమంది అవసరం లేదు.. నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలు..-friday motivation on as we grow up we realize it becomes less important to have a ton of friends ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Friday Motivation On As We Grow Up We Realize It Becomes Less Important To Have A Ton Of Friends

Friday Motivation : వందమంది అవసరం లేదు.. నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలు..

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 30, 2022 06:24 AM IST

Friday Motivation : మన వయసు, అనుభవం పెరిగే కొద్ది మనం ఏమి రియలైజ్ అవుతామంటే.. వందల మంది ఫ్రెండ్స్ మనకు అవసరం లేదని. ముఖ్యమైన, నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలని. అలాంటి ఫ్రెండ్ మీ జీవితంలో ఉంటే వారిని ఎప్పటికీ వదులుకోకండి.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Friday Motivation : చిన్నప్పటి నుంచి మనం ఎవరితో మాట్లాడితే వాళ్లే మన ఫ్రెండ్స్ అనుకుంటాం. అలా మనకి క్లాస్​ నిండా ఫ్రెండ్సే ఉంటారు. అయితే కొందరిని మనం ఫ్రెండ్స్ అనుకుంటాం. కానీ వాళ్ల మనల్ని ఫ్రెండ్స్ అనుకోకపోవచ్చు. అయితే చిన్నప్పుడు ఉన్నంత మంది ఫ్రెండ్స్ లిస్ట్ పెద్దయ్యాక ఉండదు. ఎందుకంటే మనం కొన్ని విషయాలు రియలైజ్ అవుతాం. హాయ్, బాయ్ అనే చెప్పే వందల ఫ్రెండ్స్ కన్నా.. ముఖ్యమైన, నిజమైన స్నేహితుడు ఒక్కడున్నా చాలు అనుకుంటాం కాబట్టి.

నిజానికి అందరూ ఫ్రెండ్స్.. ఫ్రెండ్స్ కానవసరం లేదు. మన పరిచయస్థులను కూడా ఫ్రెండ్స్ అనే అనుకుంటాం కాబట్టి. కానీ నిజమైన ఫ్రెండ్​తో రోజూ మాట్లాడాల్సిన అవసరం లేదు. రోజూ బయట తిరగాల్సిన అవసరం లేదు. కానీ మనకి కష్టమొస్తే.. మన పక్కన మనతో ఉండే ఓ భుజం ఫ్రెండ్. సంతోషంలో మన పక్కన లేకపోవచ్చు కానీ.. కష్టంలో తోడుండే ఫ్రెండ్స్​ని ఎప్పటికీ వదులుకోకండి.

అలాంటి ఫ్రెండ్ దగ్గర మాత్రమే మనం మన రియాలిటీని చూపిస్తాము. మనకి నచ్చినట్టు ఉంటాము. వాళ్ల దగ్గర మనం తెలియకుండానే సంతోషంగా సమయం గడిపేస్తాము. ఎందుకంటే వాళ్లు మనల్ని జడ్జ్ చేయరు. మన తప్పులను మనకు అర్థమయ్యేలా చెప్తారు. మన పరిస్థితులను అర్థం చేసుకుంటారు. దానికి వారు ఏమైనా చేయగలిగితే చేస్తారు. లేదంటే ఏమి చేస్తే బాగుంటుందో సలహా ఇస్తారు. అంతేకానీ.. మీ క్యారెక్టర్​ని జడ్జ్ చేయరు. అలాంటి నిజమైన స్నేహితులు.. మిమ్మల్ని మీలా యాక్సెప్ట్ చేసే వారు మీ లైఫ్​లో ఉన్నారంటే.. మీరు నిజంగా లక్కీ పర్సన్ అనే చెప్పాలి.

ఎంతమంది స్నేహితులు ఉండి ఏం లాభం. సంక్షోభ సమయంలో మీ అవసరానికి అందరూ మీ దగ్గరకు రారు. ఎవరో పెట్టిన స్టేటస్​ చూసి.. మీకు బర్త్​డే శుభాకాంక్షలు చెప్పే ఫ్రెండ్స్ చాలా మందే ఉంటారు. కానీ మీ కష్టంలో తోడుండే వారే నిజమైన ఫ్రెండ్. ఏ మనిషికైనా సంతోషంలో తోడు లేకపోయినా పర్లేదు. కానీ బాధలో ఒకరు కచ్చితంగా తోడు ఉండాలి. వారు ఏమి చేయకపోయినా.. తమ పక్కన ఒకరున్నారనే ధైర్యం ఉంటుంది. సమస్య ఇది అని చెప్పినప్పుడు అర్థం చేసుకునే వారే కరువైపోయారు ఈ లోకంలో. కానీ మీరు సమస్యను అర్థం చేసుకుని.. మీకు తోడుగా ఉంటూ.. మిమల్ని సంతోషంగా చూసుకునేవారిని ఎప్పుడూ వదులుకోకండి. జీవితంలో మనకు నిజమైన వ్యక్తులు కావాలి. మనల్ని అర్థం చేసుకునే స్నేహితుడు కచ్చితంగా ఉండాలి. మన సంతోషాన్ని, బాధను పంచుకోవడానికి ఒక ఆప్త మిత్రుడు కావాలి. మన పరిస్థితిని అర్థం చేసుకుని.. మన తలవాల్చి.. బాధను దిగమింగి.. ముందుకు నడవడానికి ఓ ఫ్రెండ్ చాలు.

WhatsApp channel

సంబంధిత కథనం