Friday Motivation: ఈ 8 విషయాలను దాచడం మొదలు పెట్టావంటే నువ్వు సక్సెస్‌కి దగ్గరలో ఉన్నావని అర్థం!-friday motivation if you start hiding these 8 things it means you are close to success ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation: ఈ 8 విషయాలను దాచడం మొదలు పెట్టావంటే నువ్వు సక్సెస్‌కి దగ్గరలో ఉన్నావని అర్థం!

Friday Motivation: ఈ 8 విషయాలను దాచడం మొదలు పెట్టావంటే నువ్వు సక్సెస్‌కి దగ్గరలో ఉన్నావని అర్థం!

Ramya Sri Marka HT Telugu

Friday Motivation: కష్టపడితే విజయం తప్పక దక్కుతుంది నిజమే. కానీ సక్సెస్ దక్కాలంటే కేవలం శారీరకంగా శ్రమిస్తే చాలనుకుంటే పొరపాటు. మానసికంగా ఎంతో బలంగా ఉంటేనే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తేనే, కొన్నింటిని దాచడం మొదలుపెడితేనే విజయం సాధించగలుగుతావు.

కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తేనే విజయం సాధించగలుగుతారు

ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నా అయినా కానీ జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నాను అని బాధపడేవారు చాలా మంది ఉంటారు. నిజానికి జీవితంలో సక్సెస్ అవడం అంత సులభం కాదు. కష్టపడాలి ఏళ్ల తరబడి కష్టపడాలి అప్పుడే విజయం దక్కుతుంది. అలాగని శారీరకంగా శ్రమిస్తే చాలనుకుంటే పొరపాటు. మానసికంగా చాలా రకాలుగా శ్రమించాలి, చాలా బలంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది.

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మనం విజయం దక్కించుకోవడానికి మనం ఎంత కష్టపడ్డా మన చుట్టు పక్కల వాళ్లు మనల్ని గెలవనివ్వరు. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళుతున్న ప్రతిసారి వెనక్కి లాగేస్తుంటారు. అది మీ స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కూడా అయి ఉండచ్చు. కనుక వారి దగ్గర మీరు కొన్నివిషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. లేదంటే మీరు జీవితంలో ఎప్పుడూ ఓడిపోతూనే ఉండాల్సి వస్తుంది. అవేంటంటే..

1. పర్సనల్ లైఫ్ డిటైల్స్:

మీరు లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే, పర్సనల్ వివరాలు ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి. రిలేషన్‌షిప్‌, కుటుంబ వ్యవహారాలు వంటి వ్యక్తిగత అంశాల గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఎదుటివారితో మీకు ఎంత చనువు ఏర్పడినప్పటికీ మీరు మీ పర్సనల్ విషయాలను ఎప్పుడూ గోప్యంగానే ఉంచాలి.

2. ఫ్యూచర్ గోల్స్:

సక్సెస్‌ఫుల్‌గా నిలవాలంటే, మీ గోల్స్, లక్ష్యాలను సాధించేంత వరకూ ఎవ్వరితోనూ చర్చించకండి. సూటిగా చెప్పాలంటే అసలు వాటి ప్రస్తావనే తీసుకురాకండి. ఒకవేళ మీ లక్ష్యాల గురించి వారికి తెలిస్తే, మీపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కనిపించొచ్చు. లేదంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే వరకూ వారు మిమ్మల్ని చులకన చేసి, ఎగతాలి చేస్తూ మాట్లాడచ్చు. కొన్ని సమయాల్లో ఎదుటి వారి ప్రవర్తనకు మీలో నిరుత్సాహం కూడా పెరగొచ్చు. ఇది మీ ఓటిమికి ముఖ్యకారణంగా నిలిచే అంశమని గుర్తుంచుకోండి.

3. ఆర్థిక వ్యవహారాలు:

మీరు సంపన్నులైనా లేదా ఆర్థిక వ్యవహారాల్లో సతమతమవుతున్నా ఇతరుల దగ్గర ఈ విషయాలను ప్రస్తావించకండి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే మీ సంపాదన గురించి తెలియనివ్వండి. మీ పెట్టుబడులైనా, అప్పులు వంటి ఆర్థిక సమస్యలైన ఎవరికీ తెలియనంత వరకూ మీకు ప్రశాంతత. వీటిని గోప్యంగా ఉంచడం వల్ల పోల్చుకోవడం, ఈర్ష్య చూపించడం వంటివి జరుగుతుంటాయి.

4. ఛారిటీ గురించి ప్రచారం:

మీరు చేసే ఛారిటీని కూడా గోప్యంగా ఉంచండి. సహాయం అనేది పొగడ్తల కోసం కాకుండా, మీలో మానవత్వాన్ని వ్యక్తీకరించేదిగా మాత్రమే ఉండాలి. అప్పుడే మీరు ఉన్నత స్థాయి గల వ్యక్తిగా నిలుస్తారు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.

5. వ్యక్తిగత ఇబ్బందులు:

కెరీర్‌లో విజయవంతం కావాలంటే మీ బలహీనతలను పదేపదే తల్చుకోకండి. మీ సమస్యను బహిరంగంగా చెప్పడం పూర్తిగా మానేయండి. మీ కష్టాలను ఇతరులు తీర్చలేరు పైగా మీ ఇబ్బందిని, మీ సమస్యను వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ సమస్యను ముందు మీరే గమనించి మిమ్మల్ని మరే పర్సనల్‌గా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్రయత్నించండి. కావాలంటే మీ భాగస్వామి సహాయం తీసుకోండి.

6. మీలోని ప్రత్యేకతలు:

మీలో ఉండే ప్రత్యేకమైన శైలి లేదా కళతో విజయం సాధించాలని మీరు అనుకుంటే, మీ టాలెంట్‌ను అంత సులువుగా ఎవరి ముందు బయటపెట్టకండి. మీ టాలెంట్ బయటపెట్టి దానిపై ఇతరుల అభిప్రాయం తెలుసుకోవాలని అనుకోకండి. అది మీకు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. చూపించాల్సిన చోట చూపిస్తేనే దేనికైనా విలువ, ప్రత్యేకత దక్కుతాయి.

7. ద్వేషాలు, కోపాలు:

మీరు ఎల్లప్పుడూ ఇతరులపై మీకున్న ద్వేషం, కోపం వంటి అంశాలను బహిరంగంగా బయటపెట్టకండి. ఈ విషయాల్లో కాస్త ప్రొఫెషనల్‌గా వ్యవహరించండి. అంటే ఆచి తూచీ అదను చూసి దెబ్బతియండి. అనవసర డ్రామాను పక్కకు పెట్టండి. అందరిలోనూ హుందాగా ఉండండి.

8. ఓటమి బాధలు:

విజయం ప్రతిసారి వెంటనే దక్కాలని లేదు. కనుక సక్సెస్ అవలేదనే బాధని పక్కకుపెట్టి ఓటములను పాఠాలుగా మార్చుకోండి. ఒకవేళ ఓడిపోయినా సరే, ఆ విషయాన్ని బహిరంగంగా వ్యక్తీకరించకండి. ఆ ఓటమి నుంచి నేర్చుకోండి. విజయవంతంగా ఆ పరిస్థితిని దాటేందుకు మాత్రమే ప్రయత్నించండి. అప్పుడే మీరు అన్నింటిలోనూ ముందుంటారు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం