చెడ్డ పనులు చెడు ఫలితాలను తెస్తాయి మంచి పనులు మంచి ఫిలితాలనిస్తాయి అంటారు. కానీ కొన్నిసార్లు మంచి పనులు చేసినా చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సందర్భారల్లో మన ఉద్దేశం సరైనదే అయినా దాని పరిణామాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఎదుటి వారికి సహాయం చేద్దాం, వారిని సమస్యల నుంచి తప్పించుకునేలా చేద్దాం అనే ఉద్దేశంతో చాలా మంది అడగకపోయిన ఇతరులకు సలహా ఇస్తుంటారు. తెగ తపన పడి సహాయం చేస్తుంటారు.
దీని వెనక మీ ఆలోచన మంచిదే అయినప్పటికీ కొందరి విషయంలో ఇది చాలా పొరపాటు అవుతుంది. ఇది వారి సమస్యలను తీర్చడానికి బదులుగా మీకు కొత్త కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే ఎప్పుడైనా ఇతరులకు మన సలహా అవసరమైతేనే అంటే అవసరమని ఎదుటివారి ఫీలైతేనే, వారు మిమ్మల్ని అడిగితేనే సలహాలు ఇవ్వండి. ముఖ్యంగా ఈ 5 రకాల వ్యక్తులకు అయితే ఎప్పటికీ సలహాలు, సూచనలు ఇవ్వకండి. సమస్యల్లో పడకండి.
చాలా మంది పెద్దలు, నిపుణులు చెప్పే మాటేంటంటే.. ముర్ఖులకు సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే ముర్ఖులు మీ మాటల్లోని లోతునీ, అర్థాన్నీ, వాటి వెనకున్న మీ మంచితనాన్నీ అర్థం చేసుకోలేరు. సమయం వచ్చినప్పుడు, వారు తమ మూర్ఖత్వం వల్ల మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తారు. కాబట్టి, అలాంటి వారికి సలహాలు ఇవ్వకండి. వారి కోసం మీ అమూల్యమైన సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి.
భార్య-భర్తల జీవితం రెండు చక్రాలతో నడిచే రథం లాంటిది. వారు ఎల్లప్పుడూ కలిసి నడవాల్సి ఉంటుంది. చిన్న చిన్న స్పర్థలు వచ్చినప్పటికీ చివరికి వారిద్దరూ ఒకటే అని గుర్తుంచుకోండి. అందుకే భర్త, భార్య కలిసి పనిచేసేటప్పుడు, వాదనలు పెట్టుకున్నప్పుడు వారి మధ్యలో ఎటువంటి జోక్యం చేసుకోకూడదు. వారికి ఎటువంటి సలహాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే సలహాలు ఇచ్చే వ్యక్తి వారికి శత్రువు అవుతాడు. వారు క్రమంగా సలహాలు ఇచ్చిన వారి నుండి విషయాలను దాచడం ప్రారంభిస్తారు, దూరంగా ఉండటం మొదలు పెడతారు.
అహంకారులకు ఎప్పటికీ సలహాలు ఇవ్వకూడదు. ఎందుకంటే వారు ఇతరుల సలహాలు వినకుండా తమ అభిప్రాయాలను మాత్రమే వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. అలాంటి వారు ఎల్లప్పుడూ ఇతరులను తమకంటే తక్కువగా చూస్తారు. అహంకారులకు ఎల్లప్పుడూ ఇతరుల మాటలు నిష్ప్రయోజనంగా అనిపిస్తాయి. మీరు అలాంటి వారికి సలహాలు ఇస్తే, వారు అహంకారంగా ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు సలహాలను అవి ఇచ్చిన వారినీ అవమానిస్తారు.
లోభులకు సలహాలు ఇవ్వడం ఎన్నటికైనా ప్రమాదకరమే. అలాంటి వారు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని వారి లోభానికి ఉపయోగించుకోవడానికి వెనుకాడరు. మీ సలహాలను వారికి ప్రయోజనం చేకూరే వరకు మాత్రమే పాటిస్తారు. ఆ తర్వాత, మిమ్మల్ని గుర్తుంచుకోరు కూడా. కాబట్టి లోభులకు సలహాలు ఇవ్వకూడదు.
చెడు అలవాట్లున్న వారికి ఎప్పటికీ సలహాలు ఇవ్వకూడదు. అలాంటి వారు ఎప్పటికీ మంచి వారితో స్నేహం చేయరు. మీరు వారికి మంచి సలహాలు ఇచ్చినా, వారు మిమ్మల్ని వెక్కిరిస్తారు లేదా మీ సలహాలను తీసుకుని మీకే హాని చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారి నుండి దూరంగా ఉండటం చాలా చాలా మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం