Mint Lemon Tea : పుదీనా, నిమ్మ టీ.. తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా-fresh mint and lemon tea for good health add sabja seeds to this herbal drink ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mint Lemon Tea : పుదీనా, నిమ్మ టీ.. తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా

Mint Lemon Tea : పుదీనా, నిమ్మ టీ.. తయారీ ఇలా.. ఆరోగ్య ప్రయోజనాలు చాలా

Anand Sai HT Telugu
Mar 25, 2024 05:00 PM IST

Mint Lemon Tea Benefits : భారతదేశంలో టీ అంటే చాలా మందికి ఇష్టం. అయితే టీని ఎక్కువ తాగినా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ కొన్ని రకాల టీలు తయారుచేసుకుని తాగితే శరీరానికి మంచి జరుగుతుంది. అందులో పుదీనా, నిమ్మ టీ ఒకటి ఇందులో సబ్జా గింజలు వేసుకుంటే ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి.

పుదీనా నిమ్మ టీ
పుదీనా నిమ్మ టీ (Unsplash)

టీలో చాలా రకాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత హెర్బల్ టీలకు డిమాండ్ పెరిగింది. పాలు, టీ పౌడర్ తో చేసే టీలకంటే ఇతర వాటిపైనే ఎక్కువగా శ్రద్ధ చెబుతున్నారు జనాలు. శరీరానికి కూడా హెర్బల్ టీ మంచిది. అయితే పుదీనా, లెమన్ టీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిని ఎలా తయారు చేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

yearly horoscope entry point

పుదీనా, లెమన్ టీ తయారు చేసేందుకు పుదీనా ఆకులు కొన్ని, నిమ్మకాయ ఒకటి, రెండు కప్పులు నీరు తీసుకోండి. మెుదట ఒక గిన్నెలో నీరు పోసి పొయ్యి మీద పెట్టండి. తర్వాత దానిలో పుదీనా ఆకులు వేయండి. ఇప్పుడు నిమ్మరసం పిండండి. కాసేపు దీనిని మరగనివ్వాలి. అయితే కొందరు ఇందులో చక్కెర వేసుకుంటారు. వేయకుండా తాగితేనే ఆరోగ్యానికి ఇంకా మంచిది. పుదీనా, నిమ్మరసం టీ మీకు రిఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

బరువు తగ్గడం, గుండె జబ్బులు, మధుమేహం ఉన్నవారికి ఈ టీ సరైనది. PCOS ఉన్న మహిళలు బరువు తగ్గేందుకు ఈ పుదీనా నిమ్మ టీని అల్పాహారం సమయంలో హెర్బల్ డ్రింక్‌గా తాగవచ్చు. పుదీనా, నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సాయపడుతుంది. వేడి నీరు కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది.

హెర్బల్ టీ అసిడిటీని తగ్గిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ ను తగ్గిస్తుంది. చాలా మంది ఈ సమస్యలతో టీ తాగాలా వద్దా అని ఆలోచిస్తారు. అటువంటి వారు ఈ హెర్బల్ టీని తాగవచ్చు. అసిడిటీ ఉన్న వ్యక్తులు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదు. ఉదయం మరియు సాయంత్రంపూట ఈ టీని హాయిగా సేవించవచ్చు.

పుదీనా, నిమ్మరసంతో చేసిన టీ హెల్తీ డ్రింక్. మీ మెుత్తం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆల్కలీన్, గొంతులో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనాలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను చూపుతుంది. ఈ డిటాక్స్ నిమ్మకాయ పుదీనా ఆరోగ్యానికి బూస్టర్‌లాగా పని చేస్తుంది.

జీవక్రియ పెంచడానికి, ఆరోగ్య ప్రయోజనాలు పెంచేందుకు ఉదయంపూట పుదీనా నిమ్మ టీ తాగితే చాలా మంచిది. గర్భిణులు, తరచుగా వికారం ఉన్నవారు, కీమోథెరపీ ఉన్న క్యాన్సర్ రోగులు ఈ టీని చాలా ప్రయోజనాలు దొరుకుతాయి. ఈ టీ తాగిన తర్వాత పుదీనా ఆకులను పారేయకండి. దానికి బదులుగా నమలండి. దీనితో అనేక ఉపయోగాలు మీకు దక్కుతాయి.

కావాలనుకుంటే ఈ టీలో సబ్జా గింజలు వేసుకోవచ్చు. అయితే దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలోని వేడిని తరిమికొట్టేందుకు ఈ సీడ్స్ ఉపయోగపడతాయి. మీరు తయారు చేసిన టీకి సబ్జా గింజలు కలిపి మరింత రుచిగా తయారుచేసుకోవచ్చు.

Whats_app_banner