Makhana vs Popcorn: ఫూల్ మఖానా vs పాప్‌కార్న్... పిల్లలకు ఏది ఎక్కువ ఆరోగ్యకరమైనది?
Makhana vs Popcorn: పిల్లలు క్రిస్పీగా ఉండే ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. పాప్ కార్న్ తర్వాత ఇప్పుడు ఫూల్ మఖానా కూడా ఎక్కువ మంది పిల్లలకి నచ్చుతోంది. ఈ రెండింటిలో ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకుందాం.
Makhana vs Popcorn: పాప్‌కార్న్ పిల్లల ఆల్ టైం ఫేవరెట్ స్నాక్. ఇప్పుడు పూల్ మఖానా కూడా ఎక్కువ మంది పిల్లలకు నచ్చుతోంది. ఎందుకంటే ఇది కూడా క్రంచీగానే ఉంటుంది. అయితే పాప్ కార్న్, ఫూల్ మఖానాలలో ఏది పిల్లల ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

ఫుల్ మఖానాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇవి తింటే అలెర్జీలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. ఇక పాప్ కార్న్ విషయానికి వస్తే దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే శక్తిని పెంచే కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువ. ఈ రెండిట్లో ఏది మీ పిల్లలకి తినిపించాలి అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి.
ఫూల్ మఖానా
ఫూల్ మఖానా అంటే తామర గింజలు. ఇవి చిరుతిండిగా ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. దీన్ని పోషకాల పవర్ హౌస్‌గా చెప్పుకుంటారు. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ దీనిలో అధికంగా ఉంటాయి. ఫూల్ మఖానా తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కండరాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది గ్లూటెన్ ఫ్రీ ఆహారం. ఎవరు తిన్నా కూడా దీనివల్ల ఎలాంటి అలెర్జీలు రావు. పూల్ మఖానా పడకపోవడం అనేది ఉండదు.
పూల్ మఖానాలో ఆయుర్వేద లక్షణాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో మఖానా తినమని సిఫారసు చేస్తున్నారు. ఇది శరీరానికి చలువు చేసే లక్షణాలను కలిగి ఉంటుంది.
పాప్‌కార్న్
ఇక పాప్‌కార్న్ విషయానికి వస్తే ఇది రుచికరమైన చిరుతండి. ముఖ్యంగా పిల్లలకు చాలా నచ్చుతుంది. పాప్‌కార్న్ మొక్కజొన్నతో తయారుచేస్తారు. మొక్కజొన్నలు కూడా ధాన్యం జాతికి చెందినవే. దీనిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. మన గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. జీర్ణక్రియకు కూడా ఎంతో సహాయపడతాయి.
పాప్‌కార్న్‌లో జీర్ణం అయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి తిన్న వెంటనే శక్తిని అందిస్తాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియకు ఫైబర్ చాలా అవసరం. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. బరువు కూడా పెరగకుండా అదుపులో ఉంచుతుంది.
రెండింటిలో ఏది బెటర్?
పాప్ కార్న్, ఫూల్ మఖానాల వల్ల కలిగే ప్రయోజనాలను పైన చెప్పాము. వీటిని చదువుకున్నాక మీ పిల్లలకు ఏమి తినిపించాలి అనుకుంటున్నారో అంతా మీ ఇష్టం. ఒకరోజు పూల్ మఖానా పెట్టి మరొక రోజు పాప్‌కార్న్ పెడితే ఇంకా మంచిది. ఈ రెండూ కూడా ఈ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసేవే. పూల్ మఖానా, పాప్ కార్న్... ఈ రెండూ కూడా మొక్కల ఆధారిత ఆహారాలే.