Healthy Foods for Heart : మీ హృదయం పదిలంగా ఉండాలంటే ఇవి తినేయండి..
ప్రస్తుతం చాలామంది గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆకస్మిక హృదయరుగ్మతలతో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ క్రమంలో గుండెను పదిలంగా కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. పలు ఆహారాలను తీసుకోవడం వల్ల హృదయం పదిలంగా ఉంటుంది అంటున్నారు.
Healthy Heart : గుండె జబ్బులు, హృదయ రుగ్మతల సంఖ్య పెరుగుతున్నందున.. మన జీవనశైలిని మెరుగుపరచడం చాలా ముఖ్యం. మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను మన డైట్లో చేర్చుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఆరోగ్యకరమైన గుండె కోసం తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
బెర్రీలు
బెర్రీలు మీ నోటికి ఎంత రుచిగా ఉంటాయో.. అవి మీ హృదయానికి అంతే మేలు చేస్తాయి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ మొదలైన ఈ వైబ్రంట్ కలర్ బెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులకు దారితీసే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. బెర్రీలను అనేక విధాలుగా తీసుకోవచ్చు. మీరు వాటిని పచ్చిగా తీసుకోవచ్చు. మీ అల్పాహారంతో కలిపి తినవచ్చు. లేదా వాటితో స్మూతీని కూడా తయారు చేసుకోవచ్చు.
వాల్‌నట్‌లు
వాల్‌నట్‌లు మీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అనామ్లజనకాలు సమృద్ధిగా ఉండటమే కాకుండా, వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల పవర్‌హౌస్‌గా ఉంటాయి. ఇవి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉంటాయి. ఇది మనల్ని ఎక్కువసేపు కడుపు నిండేలా చేస్తుంది. మీరు సలాడ్ డ్రెస్సింగ్ కోసం వాల్నట్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.
చిక్కుళ్లు
వివిధ రకాల చిక్కుళ్లు ఏ భారతీయ వంటగదిలోనైనా సులభంగా దొరుకుతాయి. వాటిని మంచి వంటకంగా తయారుచేయడం కూడా చాలా సులభం. ఇవి ఎక్కువసేపు మీ కడుపుని నిండుగా ఉంచుతాయి. ఇవి పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. చిక్కుళ్లు ప్రొటీన్లు, ఖనిజాలు, పీచుతో కూడిన ప్యాక్ డి. అవి సంతృప్త కొవ్వులను కలిగి ఉండవు. మీ రక్త కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి వీటిని రోటీ, అన్నంతో కలిపి తీసుకోవచ్చు. అందుకే మీ రోజువారీ ఆహారంలో బీన్స్, చిక్కుళ్లు చేర్చుకోండి.
ఆలివ్ ఆయిల్
నూనెలు గుండె ఆరోగ్యానికి మంచివి కావు అంటారు. కానీ ఆలివ్ ఆయిల్ విషయంలో అలా కాదు. ప్రతి రోజు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తినే వారికి ఏ రకమైన కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ప్రమాదం 15% తక్కువగా ఉంటుందని, కొరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 21% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉన్నట్లు తెలిసింది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
చేపలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ గుండె జబ్బులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుందని తెలిసిన విషయమే. ఇప్పుడు చేపలు ఒమేగా -3కి గొప్ప మూలం. సాల్మన్, ట్యూనా, సార్డినెస్, మాకర్ ఎల్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3తో నిండి ఉంటాయి. అవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చేప నూనెతో తయారు చేసిన అనేక క్యాప్సూల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి గుండె ఆరోగ్యానికి మంచి సప్లిమెంట్లుగా చెప్పవచ్చు.
సంబంధిత కథనం