Gut Health: ఈ ఆహారాలతో మీ పేగులు శుభ్రం, భద్రం !
Gut Health: పేగు ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే శరీర పనితీరు బాగుంటుంది. చాలా రకాల ఆరోగ్య సమస్యలు పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటాయి. పేగును ఆరోగ్యంగా ఉంచే ఆహారాలేంటో తెలుసుకోండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన పేగులు ఆరోగ్యంగా ఉండాలి. అవి శుభ్రంగా వాటి పనులను అవి చక్కగా నిర్వర్తించుకుంటుంటే ఆ ప్రభావం మొత్తం శరీరంపై ఉంటుంది. అదే గనుక పేగులు అనారోగ్యంగా ఉండి మల విసర్జన సరిగ్గా జరగకపోతే రక్తంలో మలినాలు ఎక్కువవుతాయి. ఫలితంగా మొత్తం శరీరంలోని అన్ని అవయవాలూ ప్రభావితం అవుతాయి. మరి మన పేగులు ఆరోగ్యంగా ఉండి మల విసర్జన సరిగ్గా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ కొన్ని ఆహారాలను తప్పకుండా తినాలి. అవేంటంటే..
ట్రెండింగ్ వార్తలు
పెరుగు:
దీనిలో సమృద్ధిగా ప్రో బయాటిక్స్ ఉంటాయి. అవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. అందువల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది.
ఆకు కూరలు:
పాలకూర, బచ్చలికూర, బ్రోకలీ లాంటి వాటిలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. వీటిలో ఉండే మెగ్నీషియం వల్ల మలవిసర్జన సజావుగా జరుగుతుంది.
అవిసె గింజలు :
వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అవి పేగులను శుభ్రం చేయడంలో , మల విసర్జన సజావుగా జరగడంలో సహకరిస్తాయి.
అల్లం :
దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సజావుగా పని చేయడానికి ఉపకరిస్తాయి. పేగుల కదలికను మెరుగు పరిచి వ్యర్థాల్ని సక్రమంగా విసర్జించేందుకు తోర్పడతాయి.
చియా సీడ్స్ :
వీటిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కేవలం 28 గ్రాముల చియా సీడ్స్‌లో 9.75 గ్రాముల ఫైబర్ ఉంటుంది. నీటిలో తడిచే సరికి ఇవి ఉబ్బినట్లై జెల్ మాదిరిగా తయారవుతాయి. ఇది పేగుల్ని శుభ్రం చేసేందుకు ఎంతగానో తోర్పడతాయి.
యాపిల్ :
దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్థం బవెల్ మూమెంట్‌ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియ సజావుగా జరిగేందుకు సహకరిస్తుంది.
బీన్స్:
వీటిలో సోల్యుబుల్, ఇన్‌సోల్యుబుల్ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
చిలగడ దుంపలు :
ఉడికించిన చిలగడ దుంపల్ని తినడం వల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. దీనిలో ఎక్కువగా ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను పరిష్కరిస్తుంది. పేగులు మెరుగ్గా శుభ్రం కావడానికి సహకరిస్తుంది.
అవకాడో :
ఒక కప్పుడు అవకాడో ముక్కల్లో 9.78 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. కడుపులో వచ్చే వాపుల్ని తగ్గించడంలో ఉపకరిస్తుంది. కొలస్ట్రాల్ స్థాయిలు తగినంతగా ఉండేలా చూస్తుంది.
టాపిక్