Vitamin D foods: విటమిన్‌ డీ లోపమా? ఇవి తినండి చాలు..-food to eat for vitamin d deficiency on regular basis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin D Foods: విటమిన్‌ డీ లోపమా? ఇవి తినండి చాలు..

Vitamin D foods: విటమిన్‌ డీ లోపమా? ఇవి తినండి చాలు..

HT Telugu Desk HT Telugu
Sep 11, 2023 06:36 PM IST

Vitamin D foods: విటమిన్ డి లోపం రాకుండా కొన్ని ఆహారాలను రోజూవారీ ఆహారంలో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకోండి. మీ డైట్ కూడా మార్చేయండి.

విటమన్ డి లభించే ఆహారాలు
విటమన్ డి లభించే ఆహారాలు (pexels)

మన శరీరానికి అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్‌ డీ ఒకటి. ఇది శరీరం కాల్షియం, ఫాస్పరస్‌లను శోషించుకునేలా చేస్తుంది. ఎముకల నిర్మాణంలో, కండరాలను దృఢంగా ఉంచడంలో చాలా కీలకంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. శరీరంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, వాపుల్ని నియంత్రిస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ.. డీ విటమిన్‌ మనకు వేటి నుంచి లభిస్తుందో తెలుసుకుందాం. వాటిని తినడం ద్వారా విటమిన్‌ డీ లోపం రాకుండా చూసుకుందాం.

గుడ్డులో పచ్చసొన:

కోడి గుడ్డులో ఉండే పసుపచ్చటి సొనలో డీ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజూ ఓ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. మనకు అందే ప్రొటీన్‌, కొవ్వులు తెల్ల సొనలో ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు పచ్చ సొనలో లభ్యం అవుతాయి.

పుట్ట గొడుగులు:

జంతు రహిత ఆహారాల్లో ఒక్క పుట్ట గొడుగుల్లో మాత్రమే విటమిన్‌ డీ సమృద్ధిగా ఉంటుంది. పుట్టగొడుగులు కూడా అచ్చంగా మనుషుల్లాగే ఎండ సమక్షంలో డీ విటమిన్‌ని తయారు చేసుకుంటాయి. జంతువులన్నీ విటమిన్‌ డీ3ని తయారు చేసుకుంటే ఇవి మాత్రం విటమిన్‌ డీ2ని తయారు చేస్తాయి. ఇది మన శరీరం బాగా రక్తం పట్టేందుకు సహకరిస్తుంది.

ఆవు పాలు:

భారతీయులు వారి రోజువారీ ఆహారంలో ఆవు పాలను ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో విటమిన్‌లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్‌, రైబో ఫ్లోవిన్‌లు దొరుకుతాయి. దీనిలో నేరుగా విటమిన్‌ డీ ఉండదు. అయితే కొన్ని కంపెనీలు పాల ప్యాకెట్లను చేసేప్పుడు వారు అందులో విటమిన్‌ డీని కలిపి అమ్ముతారు. ఇలా కలిపి అమ్మే సోయా పాలు, కమలా పండు రసాలు తదితరాల్లోనూ ఇది దొరుకుతుంది.

కొవ్వు చేపలు:

మొక్కల ఆధారితంగా కంటే జంతువుల నుంచి విటమిన్‌ డీ తేలికగా దొరుకుతుంది. ట్యూనా, కాడ్‌, హెర్రింగ్‌, సార్డినస్‌, సాల్మన్‌.. లాంటి చేపల నుంచి ఇది ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. వీటి లివర్‌ నుంచి తీసే నూనెల్లోనూ ఇది సమృద్ధిగా ఉంటుంది. పండించిన చేపల్లో కంటే సహజంగా సముద్రాల్లో, నదుల్లో దొరికే చేపల్లోనే ఇది ఎక్కువగా ఉంటుందని యునైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నివేదికలు చెబుతున్నాయి.

ఎండలో ఉంటే చాలు:

మనం ఎలాంటి ఆహారాలూ తీసుకోకుండా ఎండలో ఉంటే చాలు. మనకు సరిపడా డీ విటమిన్‌ లభిస్తుంది. వారానికి రెండు, మూడు రోజులు 15 నుంచి 20 నిమిషాల పాటు మన శరీరానికి ఎండను తగలనివ్వడం వల్ల ఇది మనకు తగినంతగా లభిస్తుంది.