Thyroid food: థైరాయిడ్‌ ఉన్నవారు తప్పక తినాల్సినవి, తినకూడనివి ఇవే!-food thyroid patients should eat and should not eat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid Food: థైరాయిడ్‌ ఉన్నవారు తప్పక తినాల్సినవి, తినకూడనివి ఇవే!

Thyroid food: థైరాయిడ్‌ ఉన్నవారు తప్పక తినాల్సినవి, తినకూడనివి ఇవే!

HT Telugu Desk HT Telugu
Aug 30, 2023 03:56 PM IST

Thyroid food: థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారం, తీసుకోకూడని ఆహారం గురించి వివరంగా తెలుసుకోండి.

థైరాయిడ్ డైట్
థైరాయిడ్ డైట్ (pexels)

మారుతున్న జీవన శైలి, బిజీ బిజీగా మారిన లైఫ్‌ స్టైల్‌, ఒత్తిడి లాంటి కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్‌ సమస్యలతో బాధ పడుతున్నారు. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్‌... అయితే ఎక్కువగా ఉత్పత్తి చేయడమో, లేకపోతే అస్సలు ఉత్పత్తి చేయకపోవడమో జరగడం వల్ల ఇబ్బంది మొదలవుతుంది.

ఒక అంచనా ప్రకారం భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్‌ మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవ క్రియ సజావుగా సాగాలన్నా, శరీరంలో ఉత్పత్తి అయ్యే కణాలు ఎప్పటికప్పుడు రిపేర్‌ కావాలన్నా ఇది సహకరిస్తుంది. సమతుల ఆహారాన్ని తీసుకోకపోవడమూ ఈ హార్మోన్‌ విడుదలలో హెచ్చు తగ్గులు రావడానికి కారణంగా చెబుతున్నారు. ఇలా థైరాయిడ్‌ సమస్య ఉన్న వారు ఆహారంలో ఏం మార్పులు చేసుకోవాలి? అసలు ఏం తినాలి? ఏం తినకూడదు? అనే విషయాలపై మాత్రం కచ్చితమైన అవగాహనతో ఉండాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

హైపో థైరాయిడిజం ఉన్నవారు ఏం తినాలి ? ఏం తినకూడదు? :

  • థైరాయిడ్ గ్రంథి విడుదల చేయాల్సినదానికంటే తక్కువ హార్మోన్‌ని విడుదల చేస్తుంటే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ముఖ్యంగా చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆహారాన్ని క్రమబద్ధంగా తినాలి. ఒకసారి తినడం, ఒకసారి తినకపోవడం చేయకూడదు. అలాగే వీరు ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తినేందుకు ప్రయత్నించాలి. ఉసిరికాయలో చాలా ఎక్కువగా సీ విటమిన్‌ ఉంటుంది. దీన్ని తీసుకోవడం మంచిది. ఎర్రగా ఉండే చేపలు, నట్స్‌, తాజా కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
  • ఈ సమస్య వున్నవాళ్లు క్యాబేజీ, క్యాలీ ఫ్లవర్‌, సోయ, పాలకూరలను తినకూడదు. వీటిలో ఉండే గోయిట్రోజెన్‌ సమస్యను మరింత పెంచుతుంది. అలాగే చిలకడ దుంపలు, స్ట్రాబెరీలు, పీచ్‌లు, వేరుశెనగలు, కొలస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే రెడ్‌ మీట్‌ తినకూడదు.

హైపర్‌ థైరాయిడ్ ఉన్నవాళ్లు ఏం తినాలి? ఏం తినకూడదు? :

  • థైరాయిడ్ గ్రంథి అవసరం అయిన దానికంటే ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంటే దాన్ని హైపర్‌ థైరాయిడిజం అని పిలుస్తుంటారు. వీరు ఎక్కువగా నీటిని తాగుతూ శరీరం డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలి. నాన్‌ అయోడైజ్డ్‌ ఉప్పును మాత్రమే వాడాలి. తాజా పళ్లు, ఎగ్‌ వైట్స్‌ తినొచ్చు.
  • వీరు చాలా ముఖ్యంగా ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తగ్గించాలి. అయోడైజ్డ్‌ ఉప్పు తినడం మానేయాలి. నువ్వుల పొడిని తినకూడదు. హై కేలరీలు ఉండే స్వీట్లను తినకూడదు. పాలు, చీజ్‌, ఐస్‌ క్రీమ్‌లు, పెరుగు లాంటివి తినకూడదు. రైస్‌ కూడా తగ్గించాలి. ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ని తగ్గించాలి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. కెఫీన్‌ ఉండే పదార్థాలు తీసుకోకూడదు. చేపలు, గుడ్డులో పచ్చసొన తినకూడదు.