Telangana Special Menu Review : స్పైసీ.. స్పైసీగా తెలంగాణ స్పెషల్ మెనూ.. రుచి సూపర్-food review on telangana special menu kodi vepudu green chicken bone nalli ghosh biryani ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Telangana Special Menu Review : స్పైసీ.. స్పైసీగా తెలంగాణ స్పెషల్ మెనూ.. రుచి సూపర్

Telangana Special Menu Review : స్పైసీ.. స్పైసీగా తెలంగాణ స్పెషల్ మెనూ.. రుచి సూపర్

Anand Sai HT Telugu
Mar 12, 2024 07:30 PM IST

Telangana Special Menu Food Review : తెలంగాణ అని చెప్పగానే కాస్త స్పైసీ ఫుడ్ గుర్తుకు వస్తుంది. అలాంటి స్పైసీ ఫుడ్స్ కలిపి స్పెషల్ మెనూగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా. అలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం..

తెలంగాణ స్పెషల్ మెనూ
తెలంగాణ స్పెషల్ మెనూ

తెలంగాణలో జనాలు కాస్త కారం ఎక్కువగానే తింటారు. స్పైసీ ఫుడ్ ఇష్టపడతారు. ఇక నాన్ వెజ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే స్పైసీ ఫుడ్స్ అన్ని కలిపి ట్రైన్ రెస్టారెంట్ ప్లాట్ ఫామ్ 65 తెలంగాణ స్పెషల్ మెనూగా అందిస్తుంది. ఈ ఫుడ్ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ స్పెషల్ మెనూలో ఏమేం ఫుడ్స్ ఉన్నాయి? రుచి గురించి తెలుసుకుందాం..

తెలంగాణ స్పెషల్ మెనూలో ప్రత్యేకంగా ధమ్ కా మూర్గ్, మూర్గ్ ధనియా శోర్భా, నల్లిఘోష్ బిర్యానీ, తెలంగాణ కోడి వేపుడు బోన్, గ్రీన్ చికెన్ విత్ బోన్, మటన్ పాయా శోర్భా, ఆకు కూర మటన్ కర్రీ విత్ బోన్, తెలంగాణ కోడి వేపుడు బోన్ లేస్ ఉన్నాయి.

ఈ స్పెషల్ మెనులో చికెన్ నుంచి మటన్ వరకు అందిస్తున్నారు. అంతేకాదు పాయ అంటే ఇష్టపడేవారు కూడా ఈ మెనులో చూడవచ్చు. కస్టమర్లు కూడా ఈ ఫుడ్ మెనుపై ఆసక్తి చూపిస్తున్నారు. ధమ్ కా మూర్గ్ రుచి అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా తినాలి అనుకునేవారు దీనిని టేస్ట్ చేయవచ్చు. ఇందులో మరో స్పెషల్ డిష్ మూర్గ్ ధనియా శోర్భా.. చికెన్ గ్రేవీలాగే ఉంటుంది. అయితే ఇది నాన్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది.

'ఇతర రెస్టారెంట్లలో చాలా రకాల ఆహారాలు తిన్నాం. ఇక్కడ మాత్రం తెలంగాణ స్పెషల్ మెనూ అని డిజైన్ చేసి అందిస్తున్నారు. కారంగా తినాలి అనుకువేవారు ఇక్కడకు రావొచ్చు. నాన్ వెజ్ ప్రియులు ఎంజాయ్ చేస్తూ తింటారు. స్పైసీ.. స్పైసీగా ఫుడ్ ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. మేం ఈ మెనూ తినడం రెండోసారి. తెలంగాణ వాళ్లు అయితే ఈ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు.' అని సంతోష్ అనే వ్యక్తి చెప్పుకొచ్చారు.

ఈ మెనూలోని కోడి వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. డిప్ ఫ్రై చేసి తీసుకొచ్చిన ఈ రెసిపీ మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఇక కాస్త వెరైటీగా గ్రీన్ చికెన్ విత్ బోన్ కూడా టేస్ట్ చేయవచ్చు. ఇది పచ్చిమిర్చి గ్రేవీతో చేసిన వంటకం. మీరు ఎప్పుడు తినని విధంగా ఆకు కూర మటన్ కూడా మంచి రుచిని ఇస్తుంది. ఈ రెసిపీ చేసేందుకు కొన్ని రకాల ఆకుకూరలను కూడా కలుపుతారు. వాటితో గ్రేవీగా చేసి ఈ రెసిపీని అందిస్తారు. నాన్‌లో కలిపి తినేందుకు ఈ రెసిపీ బాగుంటుంది.

ఇక చివరగా తినాల్సిన ఫుడ్ నల్లిఘోష్ బిర్యానీ. మటన్ నల్లిబొక్కను మాత్రమే ఈ బిర్యానీలో పెడతారు. సాధారణంగా తినే బిర్యానీకి భిన్నంగా ఇది ఉంటుంది. వెరైటీ బిర్యానీ టేస్ట్ చూడాలి అనుకుంటే నల్లిఘోష్ బిర్యానీ ట్రై చేయవచ్చు. ఈ రెస్టారెంట్ అందిస్తున్న తెలంగాణ స్పెషల్ మెనూ.. స్పైసీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది.

'మేం మా కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తెలంగాణ స్పెషల్ మెనూ డిజైన్ చేశాం. చాలా రుచితో కూడిన ఫుడ్ అందిస్తున్నాం. ప్రత్యేకంగా తెలంగాణ స్టైల్‌లో నాన్ వెజ్ తినాలనుకునేవారు ఈ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తారు. స్పైసీగా, రుచిగా ఫుడ్ ఉంటుంది.' అని ప్లాట్ ఫామ్ 65 ఎగ్జిక్యూటివ్ చెఫ్ వీహెచ్ సురేశ్ చెప్పుకొచ్చారు.