Ayurvedam: దుమ్ము వల్ల అలెర్జీలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ ఆయుర్వేద చిట్కాను పాటించండి-follow this ayurvedic tip daily to avoid dust allergies ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedam: దుమ్ము వల్ల అలెర్జీలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ ఆయుర్వేద చిట్కాను పాటించండి

Ayurvedam: దుమ్ము వల్ల అలెర్జీలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ ఆయుర్వేద చిట్కాను పాటించండి

Haritha Chappa HT Telugu
Oct 21, 2024 09:31 AM IST

Ayurvedam: మారుతున్న సీజన్ లో దుమ్ము, కొన్ని వాసనల కొందరిలో అలెర్జీలు వస్తాయి. అంటే దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం, జలుబు వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వారు ఈ ఆయుర్వేద పానీయాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఆయుర్వేదం టిప్స్
ఆయుర్వేదం టిప్స్ (shutterstock)

వాతావరణం మారడంతో బయటి గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం కూడా పెరుగుతుంది. దీపావళి పండుగ సమీపిస్తున్న కొద్దీ గాలి నాణ్యతలో కాలుష్యం పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో చాలా మంది అలెర్జీలతో ఇబ్బంది పడుతుంటారు. దీనివల్ల దగ్గు, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు మొదలవుతాయి. ఇంట్లో క్లీనింగ్ పనులు జరుగుతున్నా ఈ సమస్య తలెత్తుతుంది. గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ సీజన్ లో ఆయుర్వేద నిపుణులు చెప్పిన పానీయాన్ని తాగండి. ఇది గొంతు, ముక్కులో అలెర్జీల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

కలబంద జ్యూస్

కలబంద జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల గొంతులో వాపు సమస్యను తొలగిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దుమ్ము లేదా పుప్పొడి వల్ల కలిగే గొంతు నొప్పి విషయంలో కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.

తులసి రసం

అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడే సమ్మేళనాలను తులసి రసం కలుగుతుంది. తులసి సారాన్ని తాగడం వల్ల గొంతు నొప్పి, బ్రోన్కైటిస్, బ్రోన్కియల్, ఆస్తమా సంబంధిత శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తేలికపాటి దగ్గు, జలుబు ఉంటే తులసి రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

ఆయుర్వేద పానీయం ఇలా చేయండి

10 మిల్లీలీటర్ల అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో ఐదు నుంచి ఏడు చుక్కల తులసి రసం మిక్స్ చేసి ఒక గ్లాస్ నీటిలో కరిగించాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే గొంతు అలెర్జీ, దగ్గు, తుమ్ములు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కలబంద జెల్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కలబంద్ జెల్ ను కాలిన గాయాలకు, దద్దుర్లకు అప్లై చేస్తే ఆ గాయాలు నయం అయిపోతాయి. దురద కూడా కూడా తగ్గిపోతుంది. ఆయుర్వేదం ప్రకారం కలబంద డ్రింక్ తాగడం వల్ల వాత పిత్త కఫ దోషాలు సమతుల్యంగా ఉంటాయి. మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా కలబంద జెల్ తగ్గిస్తుంది. మొటిమలు వస్తున్న చోట ప్రతిరోజూ కలబంద జెల్ రాస్తూ ఉండండి. మీరే ఉత్తమ ఫలితాలను గమనిస్తారు.

తులసి హిందువుల ఇళ్లల్లో చాలా పవిత్రంగా చూస్తారు. దీనిలో యాంటీ అలెర్జిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు నుంచి తగిన రక్షణ కల్పిస్తాయి. ప్రతిరోజూ తులసి రసం తాగడం వల్ల అనేక రోగాలు రాకుండా ఉంటాయి.

(గమనిక: ఈ వ్యాసం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏ మందులను లేదా ఆహారాలను తినే ముందు వైద్యుల సలహా తీసుకోగలరు)

Whats_app_banner