దీపావళి రోజున ఇళ్లంతా దీపాలు వెలిగించాల్సిందే. వెలుగులతో నింపాల్సిందే. అక్కడక్కడా దీపాలతో పాటూ కొన్ని చోట్ల కొవ్వొత్తులు కూడా వెలిగిస్తుంటాం. అందుకే మార్కెట్లోకి వివిధ రకాల కొవ్వొత్తులు వస్తున్నాయి. సాధారణ కొవ్వొత్తులే కాకుండా సువాసనలు వెదజల్లే సెంటెడ్ అరోమా కొవ్వొత్తులు, జెల్ కొవ్వొత్తులు, సోయా క్యాండిళ్లు కూడా లభిస్తున్నాయి. కానీ అంత ఖరీదు పెట్టి కొన్న కొవ్వొత్తి వెలిగించిన కొద్దిసేపటికే కరిగిపోతుంది. ఆ బాధ లేకుండా కొన్ని ట్రిక్స్ తెలుసుకుంటే మాత్రం క్యాండిల్ గంటల తరబడి వెలుగుతూ ఉంటుంది. తొందరగా కరిగిపోదు. అవేంటో చూడండి.
కొవ్వొత్తులు చిన్నగా ఉన్నా, పెద్దవి అయినా సరే వాటిని వెలిగించే కన్నా రెండు నుండి నాలుగు గంటల ముందు ఫ్రీజర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కొవ్వొత్తులు మరింత గడ్డకట్టి ఎక్కువ సేపు మండుతూనే ఉంటాయి. కొవ్వొత్తి చాలా పెద్ద సైజులో, కాస్త లావుగా మందంగా ఉంటే అలంటి వాటిని కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు ఫ్రీజర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల కొవ్వొత్తులు ఎక్కువ సేపు మండుతాయి.
వెలిగించేటప్పుడు కొవ్వొత్తి పైన వత్తిని చిన్నగా ఉంచండి. పెద్దగా వత్తి ఉంచితే మొదట్లో బాగనిపిస్తుంది. కానీ కాసేపటికే కొవ్వొత్తి కరిగిపోతుంది. పెద్ద వత్తి ఉంటే కత్తెరతో కాస్త కట్ చేయండి.
ఇంటి లోపల కొవ్వొత్తిని ఉంచుతున్నట్లయితే, నేరుగా గాలి రాని చోట ఉంచండి. నేరుగా గాలి వీస్తే కొవ్వొత్తి మరింత వేగంగా మండుతుంది. వేగంగా కరిగిపోతుంది.
కొవ్వొత్తి కొద్దిగా కరిగిన తర్వాత దానిపై చిటికెడు ఉప్పు వేయాలి. ఇలా చేయడం వల్ల కొవ్వొత్తులు ఎక్కువ సేపు మండుతాయి. సులభంగా కరిగిపోవు.
సాధారణంగా సెంటెడ్ కొవ్వొత్తులు బయట సన్నని పాలిథిలిన్ పొరతో వస్తాయి. ఉంటాయి. దాన్ని తీసేయకుండా అలాగే ఉంచంది. ఈ పొర కొవ్వొత్తులు వేగంగా కరగకుండా చేస్తాయి.
టాపిక్