Kitchen Hacks | ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు మీ స్టౌవ్ మెరవడానికి..-follow these simple tips to clean gas stove and burner heads ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow These Simple Tips To Clean Gas Stove And Burner Heads

Kitchen Hacks | ఈ చిట్కాలు ఫాలో అయితే చాలు మీ స్టౌవ్ మెరవడానికి..

HT Telugu Desk HT Telugu
Jun 01, 2022 02:37 PM IST

వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడం పెద్ద పని. కొన్ని రోజులు సరిగ్గా శుభ్రం చేయకపోతే.. అది మన మాట వినదు. బయటి నుంచి ఎవరినైనా పిలిపించి శుభ్రం చేయించుకోవాల్సిందే. వారు గ్యాస్ శుభ్రం చేసి.. మంచి ధరను కూడా వసూలు చేస్తారు. ఈ సమస్యను తప్పించుకోవాలంటే మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ శుభ్రం చేయాలంటే ఇవి ఫాలో అయిపోండి..
గ్యాస్ శుభ్రం చేయాలంటే ఇవి ఫాలో అయిపోండి..

Kitchen Hacks | వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా చిమ్మింది అంటే.. ఇంక స్టౌవ్​ అంతా కరాబ్ అయినట్టే. దీనివల్లే స్టవ్ పైభాగం, బర్నర్స్ కూడా పాడవుతాయి. అప్పుడు దానిని క్లీన్​ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే ఈ చిట్కాలు మిమ్మల్ని ఈ క్లీనింగ్ కష్టాల నుంచి గట్టెక్కిస్తాయి. గ్యాస్ శుభ్రం చేసేప్పుడు మీరు కూడా చిట్కాలను ఫాలో అయిపోండి.

చింతపండుతో..

గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడానికి.. చింతపండును వేడి నీటిలో గంటసేపు నానబెట్టండి. దానికి కొద్దిగా డిటర్జెంట్ జోడించండి. గ్యాస్ బర్నర్‌ను తీసివేసి.. ఈ నీటిలో సుమారు 2 నుంచి 3 గంటలు నానబెట్టండి. తర్వాత బ్రష్ చేసి కడగాలి. అవి మునుపటిలా మెరవడాన్ని మీరే చూస్తారు.

ఇనో, నిమ్మరసం..

వేడి నీటిలో ఇనో, నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఆ నీటిలో కాటన్ క్లాత్‌ని ముంచి మొత్తం స్టౌవ్​ని తుడవండి. ఎక్కడైనా మురికి ఉంటే మీరు పాత బ్రష్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా వారానికోసారి చేస్తే గ్యాస్ క్లీన్ చేసేందుకు బయటి వారిని పిలవాల్సిన అవసరం ఉండదు.

సర్ఫ్‌ వాటర్‌తో

రోజూ వంట చేసిన తర్వాత.. సర్ఫ్‌ వాటర్‌తో తుడిచినా మురికి పేరుకుపోయే సమస్య ఉండదు. నూనె చిక్కదనాన్ని తగ్గించడానికి మీరు ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలపవచ్చు. దీనివల్ల చెడువాసనలు కూడా ఉండవు.

హార్పిక్‌తో..

గ్యాస్ బర్నర్‌లను హార్పిక్‌తో శుభ్రం చేయవచ్చు. ఒక గిన్నెలో రెండు గ్యాస్ బర్నర్లను తీసుకుని.. ఆ రెండు బర్నర్లపై హార్పిక్ వేయండి. అప్పుడు బ్రష్‌తో కొద్దిగా రుద్దడం వల్ల బర్నర్ లేదా బర్నర్ పక్కన ఉన్న స్టీల్ ప్లేట్ శుభ్రం అవుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం