కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఆ నొప్పిని భరించలేకపోతుంటారు. రాళ్ల నొప్పి అకస్మాత్తుగా పుడుతుంది. కాసేపు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంజక్షన్ తీసుకున్న తర్వాతే ఆ నొప్పి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ నొప్పి రావడం వల్ల ఆ వ్యక్తి కూర్చోలేక, నిల్చోలేక తన రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొంతమంది శస్త్ర చికిత్సల ద్వారా రాళ్ళను తీయించుకుంటారు. అయితే ఆయుర్వేద నివారణల ద్వారా రాళ్లను వాటికవే బయటికి వచ్చేలా చేయవచ్చు.
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఆపరేషన్ చేయించుకుని కిడ్నీలో రాళ్లను తీయించుకున్న తర్వాత కూడా అవి ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి రాళ్లను ఏర్పడకుండా ముందే జాగ్రత్త పడడం అవసరం. లేదా మూతపిండాల్లో రాళ్ళను తొలగించడానికి ఆయుర్వేద నివారణను పాటిస్తే మంచిది. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ఈ రాళ్లు బయటికి వచ్చేస్తాయి.
మూత్రపిండాల రాళ్లు సమస్యతో బాధపడుతున్న వారు తరచూ ఉలవలతో చేసిన ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించండి. ఈ ఉలవలను వారానికి రెండు మూడుసార్లు ఆహారంగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం ఉలవల్లో క్యాల్షియం ఆక్సలైట్ ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది. అలాగే ఈ ఉలవలు ఇన్ఫ్మమేషన్ తగ్గిస్తాయి. మూత్ర ప్రవాహాన్ని పెంచుతాయి. శరీరంలో పేరుకుపోయిన విషాలను, వ్యర్ధాలను తొలగించేందుకు సహాయపడతాయి. క్రమం తప్పకుండా ఉలవలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి.
బార్లీ గింజలను తెలుగు ఇళ్లల్లో అధికంగానే వాడుతారు. ముఖ్యంగా ఉపవాసాల సమయంలో శరీరానికి చలువ కావాల్సిన సమయంలో బార్లీ నీళ్లను తాగుతూ ఉంటారు. ఇవి చేసే మేలు కూడా ఎక్కువే అయితే కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారు కూడా బార్లీ నీళ్లను తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇది కిడ్నీలో వల్ల వచ్చే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మూత్ర విసర్జన లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. కాబట్టి ఆ రాళ్లు కూడా మూత్ర విసర్జన లోనే బయటికి పోయేలా చేస్తుంది. మన శరీరం నుండి విషాలను తొలగించడానికి సహాయపడుతుంది. మూత్ర నాళాన్ని శుభ్రపరిచి అక్కడ ఉన్న రాళ్లను కూడా బయటికి పంపించేలా చేస్తుంది. ఒక గ్లాసు నీటిని గిన్నెలో వేసి అందులో గుప్పెడు బార్లీ గింజలను కలపండి. తర్వాత దాన్ని బాగా మరిగించి ఫిల్టర్ చేయండి. ఆ నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా తాగుతూ ఉండండి. క్రమం తప్పకుండా అలా ప్రతిరోజు తాగడం వల్ల కిడ్నీలో ఉన్న సూక్ష్మమైన రాళ్లు వాటికవే మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి.
కొన్ని రాళ్లు పెద్దవిగా ఉంటాయి. అలాంటివి మూత్ర నాళం ద్వారా ప్రయాణించలేవు. అలాంటి వాటికి మాత్రం శస్త్ర చికిత్స అవసరం పడుతుంది. అలా కాకుండా మూత్రనాళం ద్వారా ప్రయాణించే పరిమాణంలో ఉన్నవి మాత్రం ఇలాంటి ఆయుర్వేద చిట్కాలు ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం