Heartburn: వేయించిన ఆహారాలు తిన్నాక గుండెల్లో మంట, పుల్లని తేనుపులు రాకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి-follow these 5 tips to avoid heartburn and acid reflux after eating fried foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heartburn: వేయించిన ఆహారాలు తిన్నాక గుండెల్లో మంట, పుల్లని తేనుపులు రాకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి

Heartburn: వేయించిన ఆహారాలు తిన్నాక గుండెల్లో మంట, పుల్లని తేనుపులు రాకుండా ఉండాలంటే ఈ 5 చిట్కాలు పాటించండి

Haritha Chappa HT Telugu
Published Mar 13, 2025 04:30 PM IST

Heartburn: హోలీ వంటి పండుగ రోజున రకరకాల స్వీట్లు, పిండి వంటలు, విందులు తింటారు. నూనెలో వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత పుల్లని తేనుపులు, గుండెల్లో మంట వంటివి వచ్చేస్తాయి. అలాంటప్పుడు వెంటనే ఈ 5 హోం రెమెడీస్ ప్రయత్నించండి. ఇవి ఆహారం జీర్ణం కావడానికి సహాయపడతాయి.

గుండెల్లో మంట తగ్గించుకోవడం ఎలా?
గుండెల్లో మంట తగ్గించుకోవడం ఎలా? (shutterstock)

హోలీ పండుగ అంటే రంగులు చల్లకోవడమే కాదు, రకారకాల స్వీట్లు, ఆహారాలు కూడా ఉంటాయి. హోలీ ప్రత్యేకంగా గుజియా, జిలేబీ, బిర్యానీలు ఇలా ఎన్నో వంటకాలను ప్రతి ఇంట్లో తయారు చేస్తారు. వాటిని అధికంగా తిన్న తరువాత ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. కొందరికి తిన్న తర్వాత గుండెల్లో మంట, పుల్లని తేనుపులు వంటివి వస్తూ ఉంటాయి. అజీర్ణం, ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు రాగానే చాలా మంది ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతూ ఉంటారు. అతిగా తినడం వల్ల మీకు గుండెల్లో మంట, పుల్లని తేనుపులు వస్తుంటే, ఈ అయిదు హోం రెమెడీస్ ప్రయత్నించండి.

ఆవాలు నీరు

అతిగా తినడం వల్ల పుల్లగా ఉండి పొట్టలో బరువుగా ఉన్న భావన కలుగుతుంది. గ్యాస్ తెరుచుకోకపోతే అర గ్లాసు నీటిలో మంచి నాణ్యమైన ఆవాలు, నల్ల ఉప్పు కరిగించి వేడి చేయాలి. తర్వాత ఈ నీటిని తాగండి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగితే ఉపశమనం లభిస్తుంది. వారికి వెంటనే ఆవాలు నీటిని తాగితే పొట్ట ఉపశమనం కలుగుతుంది.

నిమ్మరసం

గుండెల్లో మంట సమస్య ఉంటే తిన్న తర్వాత వేడినీటిలో నిమ్మరసం పిండుకుని తాగాలి. దీనివల్ల గుండెల్లో మంట సమస్యలు రావు. ఇంట్లో కచ్చితంగా నిమ్మ కాయలు ఉంచుకోవడం మంచిది. నిమ్మరసం అనేక రకాలుగా మనకు మేలు చేస్తుంది.

యాలకులు, సోంపు టీ త్రాగాలి

ఒక చెంచా సోంపు, యాలకులు వేసి నీటిలో మరిగించి తిన్న తర్వాత త్రాగాలి. ఇది పుల్లని తేనుపుల సమస్యను తగ్గించడానికి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాశం ఉంది.

శొంఠి పొడి నీళ్లు

రాత్రి పడుకునేటప్పుడు పొడి అల్లం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల ఉదయాన్నే కడుపు శుభ్రపడి మలబద్ధకం తొలగిపోతుంది. అలాగే గుండెల్లో మంట, ఎసిడిటీ కూడా తగ్గుతాయి.

పుదీనా రసం

పుదీనా రసం ఎక్కువగా తినడం వల్ల కడుపులో అజీర్తి ఉంటే పుదీనా ఆకుల రసాన్ని తాగాలి. లేదా పుదీనా టీ తయారు చేసుకుని తాగాలి. ఇది కడుపులోని అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం