వేసవిలో ఇంట్లో ఈగలు రావడం మొదలైపోతుంది, ఈ ఇంటి చిట్కాలతో వాటిని వదిలించుకోండి
వేసవి వస్తే ఈగల బెడద పెరిగిపోతుంది. ఇంట్లో తిరిగే ఈ ఈగలతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే ఈ సులభమైన హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇవి పాటించడం చాలా సులువు. పైగా ఖర్చు కూడా చాలా తక్కువే.

ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఇంట్లో ఈగల బెడద కూడా పెరుగుతుంది. ఈ ఈగలు ప్రశాంతంగా వ్యక్తులను కూర్చోనివ్వవు. వంటగదిలో ఉంచిన ఆహారాలను కలుషితం చేస్తాయి. ఇవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. అందుకే ఈగలను త్వరగా వదిలించుకోవడం చాలా అవసరం. మీరు కూడా ఇంట్లో తిరిగే ఈగలతో ఇబ్బంది పడుతుంటే, కలత చెందకుండా, ఈ సులభమైన హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఈ హోం రెమెడీస్ ప్రయత్నించడం చాలా సులభం మాత్రమే కాదు, మీ సమస్యను తొలగించడంలో కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వ్యాధిని వ్యాప్తి చేసే ఈగల నుండి మీ ఇంటిని దూరంగా ఉంచడానికి మీరు ఏ చిట్కాలను ప్రయత్నించాలో తెలుసుకుందాం.
బిర్యానీ ఆకులు
ఈగలు, దోమలు, పండ్లపై వాలే ఫ్రూట్ ఫ్లైస్ వంటి వాటిని తరిమికొట్టడానికి బిర్యానీ ఆకు సహాయపడుతుంది. ఈ రెమెడీ కోసం, మీరు ఒక పెద్ద గిన్నె లేదా మట్టి దీపాన్ని తీసుకొని అందులో 5 బిర్యానీలు ఆకులు, 5 కర్పూరం, 2 టీస్పూన్ల వేప లేదా ఆవ నూనె వేసి కాల్చాలి. ఈ రెమెడీ చేసేటప్పుడు వంటగది తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. తద్వారా వంటగదిలో ఆ పొగ అంతా పేరుకుపోతుంది. ఆ బిర్యానీ ఆకుల వాసన ఈగలకు ఏ మాత్రం నచ్చదు. కాబట్టి ఇంట్లో నుంచి ఈగలన్నీ బయటికి పోతాయి.
బేకింగ్ సోడా, నిమ్మకాయ రెమెడీ
ఈగలు మురికి, తేమ ఉన్న ప్రదేశాలలో నివసించడానికి ఇష్టపడతాయి. అటువంటి పరిస్థితిలో, కిచెన్ సింక్, కౌంటర్, డస్ట్ బిన్ చుట్టూ పరిశుభ్రంగా ఉంచండి. దీని కోసం, మీరు బేకింగ్ సోడా, నిమ్మకాయ రెమెడీని ప్రయత్నించవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, వంటగదిలోని ఈ ప్రదేశాలలో బేకింగ్ సోడా చల్లి, దానిపై నిమ్మరసం వేయండి. ఈ కిచెన్ చిట్కా ఈగలను తరిమికొట్టడమే కాకుండా వంటగదిలో ఉండే బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది.
వెల్లుల్లి స్ప్రే
ఇంట్లో ఉన్న ఈగలను బయటికి పంపించడానికి మీరు వెల్లుల్లి స్ప్రేను కూడా ఉపయోగించవచ్చు. ఈగలను తరిమికొట్టడానికి ఇది సహజమైన మార్గం. ఈ రెమెడీ చేయడానికి, మొదట, ఒక నల్ల మిరియాలు, 3 వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్టులా చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో వేసి నీటితో నింపి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమం ఉన్న నీటిని వంటగది తలుపులు, కిటికీలు, మూలలపై స్ప్రే చేయాలి. వెల్లుల్లి వాసన వల్ల ఈగలు వంటగదిలోకి రాకుండా ఉంటాయి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఈగలు చేరకుండా ఉంటాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం