మీ ఆర్మ్స్ ఊగుతున్నాయని మీకు బెంగగా ఉందా? స్లీవ్‌లెస్ టాప్స్ వేసుకోవాలన్నా, లేక మీరు ఇంకా బలంగా తయారవ్వాలనుకున్నా, మీ చేతుల్ని ఫిట్‌గా చేసుకోవడానికి జిమ్‌లో గంటల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ కోచ్ ప్యాట్రిక్ హాంగ్ జూన్ 10న పెట్టిన పోస్ట్‌లో దీని గురించి వివరించారు. మీ ఆర్మ్స్ చక్కటి ఆకృతితో దృఢంగా మారేందుకు పది నిమిషాల వర్కవుట్ గురించి చెప్పారు. జిమ్‌కి వెళ్లకుండా, పుష్-అప్‌లు చేయకుండా ప్యాట్రిక్ చెప్పిన పది నిమిషాల ఈ వ్యాయామం (అప్పర్ బాడీ వర్కవుట్) చూద్దాం.
మీ భుజాలను సిద్ధం చేయడానికి, రక్తం బాగా ప్రవహించడానికి ఆర్మ్ సర్కిల్స్‌తో మొదలుపెట్టండి. నిటారుగా నిలబడి, చేతుల్ని పక్కలకు చాచి, 30 సెకన్ల పాటు చిన్నగా గుండ్రంగా ముందుకు తిప్పండి. ఆ తర్వాత 30 సెకన్లు వెనక్కి తిప్పండి.
గట్టిగా ఉండే బెంచ్, కుర్చీ లేదా కింద ఉండే టేబుల్ ఏదైనా పర్వాలేదు.
బిగినర్స్: మోకాళ్ళు వంచి, కాళ్ళు బెంచ్‌కి దగ్గరగా ఉంచండి.
ఎక్కువ చేయాలనుకునేవాళ్ళు: కాళ్ళు స్ట్రెయిట్‌గా చాచి, మీ చేతులకి ఇంకాస్త కష్టం పెరిగేలా చేయండి. మీ మోచేతుల్ని వంచుతూ శరీరాన్ని కిందికి దించి, మళ్ళీ పైకి లేపండి. ఇది ట్రైసెప్స్ కండరాలకు చాలా మంచి బలాన్ని ఇస్తుంది.
(పాఠకుకలు గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. ఇది డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా మీ డాక్టర్‌ని అడగండి.)