Fish Pedicure: వర్షాకాలంలో ఫిష్ పెడిక్యూర్.. మీ పాదాలకు అందం
Fish Pedicure in Rainy Season: ఫిష్ పెడిక్యూర్ చేసుకోవడం వల్ల పాదాల అందం మెరుగవుతుందనేది నిజం. కానీ దీనికి ప్రతికూలతలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవాలనుకునే వారు ఒక్కసారి ఈ స్టోరీ చదవాల్సిందే.
అమ్మాయిలు తమ కాళ్లు, పాదాల అందాన్ని మెరుగుపరుచుకోవడానికి పెడిక్యూర్ చేయించుకుంటారు. పెడిక్యూర్‌లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఫిష్ పెడిక్యూర్ ఒకటి. ఫిష్ పెడిక్యూర్ గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చు. వర్షాకాలంలో పాదాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ఫిష్ పెడిక్యూర్ పాత్ర ముఖ్యమైనది.
వర్షాకాలంలో ఫిష్ పెడిక్యూర్ ఉపయోగాలు
వర్షాకాలంలో పాదాల సంరక్షణ చాలా ముఖ్యం. ఈ సమయంలో మురికి నీరు పాదాల ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాగే, మురికి, చనిపోయిన చర్మం పాదాలకు సమస్యలను కలిగిస్తుంది. ఇది పాదాలలో దురద, ఇన్ఫెక్షన్ వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీరు వర్షపు రోజుల్లో మీ పాదాలను శుభ్రం చేయడానికి ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవచ్చు.
ఫిష్ పెడిక్యూర్‌ను ఫిష్ స్పా ట్రీట్‌మెంట్ అంటారు. ఇలా చేయడం వల్ల చేప మన కాలి చర్మంలోని మృతకణాలను శుభ్రపరుస్తుంది. అలాగే పాదాలను మృదువుగా చేస్తుంది. దీంతో పాదాల అందం పెరుగుతుంది. చర్మాన్ని మరింత మృదువుగా మార్చుతుంది.
దుష్ప్రభావాలు
ఫిష్ స్పా లేదా ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చేప పాదాలకు రక్తస్రావం కలిగించే ముప్పుంది. కొన్నిసార్లు చేపలు చనిపోయిన చర్మ కణాలతో పాటు ఆరోగ్యకరమైన చర్మాన్ని కొరుకుతాయి. ఇది రక్తస్రావం కలిగిస్తుంది. ఫిష్ స్పా ద్వారా జూనోటిక్ వ్యాధులు వ్యాపించే అవకాశం కూడా ఉంది. దీనితో పాటు, బలహీనమైన రోగనిరోధక శక్తి, మధుమేహం ఉన్నవారిలో సమస్య తీవ్రమయ్యే ముప్పుుంది. అంతేకాకుండా గాయాల వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉంది. అలాగే, ఫిష్ పెడిక్యూర్ కోసం ఉపయోగించే నీటిని మార్చకపోవడం వల్ల ఇన్ఫెక్షన్‌తో సహా ఇతర చర్మ సమస్యలు పెరుగుతాయి.
ఫిష్ పెడిక్యూర్ పద్ధతి
చికిత్సలో భాగంగా పాదాలను నీటి బేసిన్‌లో ఉంచాలి. అందులో ఉండే చిన్న చేపలు పాదాలపై చనిపోయిన చర్మాన్ని తినేస్తాయి. అయితే ఫిష్ బేసిన్‌లో పాదాలను ఉంచే ముందు పాదాలను వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చిన్న చేపలు ఉన్న నీటిలో పాదాన్ని ముంచాలి. ఈ చేపలు పాదాలు, అరికాళ్లు, కాలి వేళ్లపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ ను తింటాయి. 15 నిమిషాల తర్వాత కాళ్లు బేసిన్ నుండి బయటకు తీయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో ఫిష్ పెడిక్యూర్ చేయడం కంటే బ్యూటీ పార్లర్‌లో సాధారణ పెడిక్యూర్ చేయించుకోవడం మంచిది. లేదా సంబంధిత ఉపకరణాలతో ఇంట్లో మీరే చేసుకోవచ్చు.
టాపిక్