చేప పకోడి ఇలా చేశారంటే క్రిస్పీగా జ్యూసీగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి-fish pakoras are crispy and juicy when cooked this way know the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చేప పకోడి ఇలా చేశారంటే క్రిస్పీగా జ్యూసీగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి

చేప పకోడి ఇలా చేశారంటే క్రిస్పీగా జ్యూసీగా అదిరిపోతుంది, రెసిపీ తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

చేపలతో వండే వంటకాలు ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టం. చేప పకోడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము. దీన్ని క్రిస్పీగా, జ్యూసీగా ఉంటుంది. ఎవరైనా అతిధులు ఇంటికి వచ్చినప్పుడు చేప పకోడి వండి పెడితే అద్భుతంగా ఉంటుంది.

చేప పకోడి రెసిపీ

సాయంత్రం అయితే చాలు పకోడీలు, బజ్జీలు తినాలనిపిస్తుంది. ఇక నాన్ వెజ్ ప్రియులకైతే చికెన్, చేప, రొయ్యల స్నాక్స్ తినేందకు ఇష్టపడతారు. ప్రతిసారి బయటకొనుక్కుని తినడం అంత మంచిది కాదు. ఇంట్లోనే చేసుకుంటే శుచిగా ఉంటుంది. చేపలతో క్రిస్పీగా, జ్యూసీగా పకోడీ ఎలా చేయాలో ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. బోన్ లెస్ చేప ముక్కలు కొనుక్కుంటే పకోడీ చేసుకోవడం చాలా ఈజీ.

చేప పకోడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చేపలు ముక్కలు - అరకిలో

వెల్లుల్లి - ఆరు రెబ్బలు

నిమ్మరసం - అర స్పూను

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

కార్న్ ఫ్లోర్ - రెండు స్పూన్లు

మిరియాల పొడి - అర స్పూను

కారం - ఒక స్పూను

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

చేప పకోడి రెసిపీ

  1. చేప పకోడి చేసేందుకు తక్కువ ముల్లులున్న చేపలను ఎంపిక చేసుకోవాలి.
  2. చేపలను ముక్కలను కోసి మధ్యలో ఉన్న పెద్ద ముల్లును తీసేయండి. బోన్ లెస్ చేప ముక్కలు నేరుగా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని తెచ్చుకుంటే పని ఇంకా సులువు అవుతుంది.
  3. ఒక గిన్నెలో ఈ చేప ముక్కలను వేసి కార్న్ ఫ్లోర్ పిండి, ఉప్పు, మిరియాలపొడి, కారం, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

4. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి.

5. నూనె వేడెక్కాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు వేసి బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.

6. చేపలు వేయించాక ఆయిల్ స్ట్రెయినర్ లో వేసి నూనె లేకుండా చూసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, కరివేపాకులు వేసి వేయించాలి.

8. అందులో ఫిష్ పకోడా వేసి ఓసారి టాస్ చేసుకుని స్టవ్ ఆపేయాలి. అంతే టేస్టీ చేప రెసిపీ రెడీ అయినట్టే. నోట్లో పెడితే చాలు ఇక ఆపలేరు. మొత్తం తినేస్తారు.

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చేపలతో చేసే వంటకాల్లో చేప పకోడీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వండడం చాలా సులువు, దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో వండితే చాలా తక్కువ నూనెతో వండేయచ్చు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.