Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో తేడాగా ఉన్న బల్బును ఐదు సెకన్లలో కనిపెట్టండి, అలా కనిపెడితే మీరు తోపే
Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ తో మరొకసారి మీ ముందుకు వచ్చాము. ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లను కేవలం 5 సెకన్లలో సాధించి విజేతగా నిలవండి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతోమందికి ఆసక్తిని కలిగిస్తాయి. కంటి ముందే జవాబు ఉన్నా... దాన్ని కనిపెట్టడానికి కష్టపడడమే ఆప్టికల్ ఇల్యూషన్ లోని ప్రత్యేకత. ఇక్కడ మేము మరొక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో అన్నీ వెలుగుతున్న బల్బులే ఉన్నాయి. ఆ బల్బుల మధ్యలో తేడాగా ఉన్న ఒక బల్బ్ ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ పని.
ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు. కేవలం అయిదు సెకన్ల నుంచి పది సెకన్ల సమయం మాత్రమే తీసుకొని మీరు కనిపెట్టి చెప్పాలి. నిజానికి ఇక్కడ ఉన్న బల్బుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. కాబట్టి మీరు ఐదు సెకన్లలోనే చెప్పేయాలి. అలా చెబితే మీ కంటి చూపు, మెదడు పనితీరు సూపర్ అని ఒప్పుకోవచ్చు.
పరిశోధకులు చెబుతున్న ప్రకారం ఆప్టికల్ ఇల్యూషన్లను తరచూ సాధించడం వల్ల మీలో నేర్చుకునే తత్వం పెరుగుతుంది అలాగే ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది పెద్దవయసులో ఉన్నవారు కూడా ఈ ఆప్టికల్ ఇల్యూషన్ లను తరచూ పరిష్కరిస్తూ ఉండాలి. ఇది వారిలో మతిమరుపు రాకుండా అడ్డుకుంటుంది
మన మెదడు ఎదురుగా కనిపిస్తున్న వస్తువు తాలూకు భౌతిక లక్షణాలను సరిగా అర్థం చేసుకోలేనప్పుడు ఆర్టికల్ భ్రమలు ఏర్పడతాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే మెదడు ఆ సమస్యను పరిష్కరించగలుగుతుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరించాలంటే కంటిచూపు, మెదడు కలిసి పని చేయాలి. అలా కంటి చూపు, మెదడు కలిసి పని చేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఆప్టికల్ ఇల్ల్యూషన్లను అప్పుడప్పుడు ప్రయత్నిస్తూ ఉండండి.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఇక జవాబు విషయానికి వస్తే ఈ బల్బుల్లో తేడాగా ఉన్న బల్బును ఐదు సెకన్లలోపే కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఈ బల్బులు చూడగానే అన్నీ ఒకేలా కనిపిస్తాయి. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా భిన్నంగా ఉంది. అది ఎక్కడుందో తెలియాలంటే ప్రతి బల్బును నిశితంగా చూడండి. మధ్యలో ఒక బల్బు రంగు వేరేగా ఉంది. మూడో నిలువ వరసలో రెండో బల్బును చూడండి. అన్ని బల్బుల అడుగు భాగాలు ఒక రంగులో ఉంటే.. ఈ బల్బు అడుగుభాగం మాత్రం మరో రంగులో ఉంది. అదే మీరు కనిపెట్టాల్సిన జవాబు.
ఆప్టికల్ ఇల్యుషన్లు తరచూ సాధిస్తూ ఉండడం వల్ల మీ అభిజ్ఞా పనితీరు మారుతుంది. సమస్యను పరిష్కరించే నైపుణ్యం మీకు వస్తుంది. పిల్లలతో కూడా ఈ ఆప్టికల్ ఇల్యుషన్లు తరచూ పరిష్కరించేలా చూడండి. ఇది వారిలో అవగాహనను పెంచుతుంది. మెదడుకు పదును పెడుతుంది. దృష్టికి సంబంధించిన సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. మానసికంగా ఉత్సాహాన్ని నింపుతుంది. వినోదాన్ని అందిస్తుంది. మొత్తం మీద మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.