Healthy Nuts: థైరాయిడ్ నుంచి చెడు కొలెస్ట్రాల్ వరకు ఏ ఆరోగ్యసమస్యకు ఏ నట్స్ తినాలో తెలుసుకోండి
Healthy Nuts: కీళ్ల నొప్పులు, గుండె ఆరోగ్యం, థైరాయిడ్… ఇలా ఒక్కోసమస్యకు ఒక్కోరకం నట్స్ తినాలి. ఏ సమస్యకు ఎలాంటి నట్స్ తినాలో ఇక్కడ ఇచ్చాము. మీ సమస్యను బట్టి నట్స్ ఎంపిక చేసుకుని తినాలి.
బాదం, వాల్ నట్స్ వంటి నట్స్ ఎన్నో రకాలు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినే పద్దతి ఎంతో మందికి తెలియదు. అలాగే ఆరోగ్య సమస్యను బట్టి మీరు నట్స ఎంపిక చేసుకోవాలి. కేవలం బాదం, పిస్తా, జీడిపప్పులు వంటివే కాదు ఆరోగ్యానికి మేలు చేసే గింజలు ఎన్నో ఉన్నాయి. శరీరంలోని వివిధ సమస్యలను బట్టి నట్స్ ఎంపిక చేసుకుని తినాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

థైరాయిడ్, చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలతో పోరాడుతుంటే మీరు ఎలాంటి నట్స్ తినాలో తెలుసుకోవాలి. ఏ గింజలు ఏ వ్యాధిలో శరీరానికి మేలు చేస్తాయో తెలుసుకోండి.
చెడు కొలెస్ట్రాల్
మకాడమియా గింజలలో మోనోశాచురేటెడ్ కొవ్వు, ప్రోటీన్, శక్తి పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మకాడమియా తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో పెరుగుతున్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచుతుంది. ఇవి సూపర్ మార్కెట్లలో, ఈ కామర్స్ సైట్లలో ఈ నట్స్ దొరుకుతాయి. మీరు ప్రతిరోజూ కొన్ని నట్స్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
గుండెకు
మీరు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే హాజెల్ నట్స్ ఆహారంలో చేర్చండి. ఎఫ్‌డీఏ 2003 నివేదిక ప్రకారం, హాజెల్ గింజలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ గుప్పెడు హాజెల్ నట్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
అలాగే వాల్ నట్స్‌లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే పిల్లలతో పాటు పెద్దలకు కూడా జ్ఞాపకశక్తికి పదును పెట్టాలనుకుంటే రోజూ వాల్ నట్స్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
కళ్ల కోసం
కంటిపై ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి గుప్పెడు పిస్తా పప్పులు తినడం అలవాటు చేసుకోవాలి. కళ్లలో నొప్పి, తలలో బరువు ఉంటే రోజూ పిస్తా పప్పు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని పిస్తా పప్పులు తింటే కొన్ని రోజుల్లోనే మీకు మంచి మార్పులు కనిపిస్తాయి.
థైరాయిడ్ సమస్య ఉంటే
థైరాయిడ్ పనితీరును నియంత్రించడానికి బ్రెజిల్ గింజలు ఉత్తమమైనవి. ఇందులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ పనితీరును సరిచేస్తుంది.
కీళ్ల నొప్పులు
ఎముకలు, కీళ్ళలో నొప్పితో బాధపడేవారికి పెకాన్స్ అని పిలిచే నట్స్ తినడం అలవాటు చేుకోవాలి. ఇవి ఆర్ధరైటిస్ సమస్యను తగ్గిస్తుంది. ఇవి ఎముకలకు బలాన్ని అందిస్తుంది. మాంగనీస్ పెకాన్ నట్స్ లో పుష్కలంగా ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం