మీ చర్మం ఆరోగ్యం మీరు తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారాలు మీ అందాన్ని, చర్మారోగ్యాన్ని పెంచి సహజ కాంతినిస్తాయి. అలాగే కొన్ని ఆహారాలు మొటిమలు, మచ్చలు వంటి అనేక రకాల చర్మ సమస్యలకు కారణమవుతాయి. ఏదేమైనా మీ ఆహారాపు అలవాట్లు, అభిరుచులు మీ చర్మం మీద చాలా ప్రభావం చూపిస్తాయన్నది వాస్తవం. కాబట్టి మీ చర్మం రకాన్ని, సమస్యని బట్టి మీకు సరైన ఆహారం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం మీకు చాలా ఉంది.
ఎందుకంటే సమస్య తెలిస్తేనే దానికి తగిన పరిష్కారాన్ని కనుగొనచ్చు. మీ చర్మ రకం వేరే అయి ఉండి మీరు అందంగా ఉండటం కోసం వేరే డైట్ ను ఫాలో అవుతుంటే అది వృథా అవచ్చు. అలాగే మొటిమల పొగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అందుకు తగిన ఆహారాన్ని ఎంచుకోకపోతే అవి తగ్గకపోవచ్చు. ఇలా జరగకూడదు అంటే మీ చర్మం రకం ఏంటో తెలుసుకోండి. దాన్ని బట్టి మీకు ఎలాంటి ఫుడ్ మేలు చేస్తుందో దాన్ని తినండి.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్, కాస్మెటాలజిస్ట్ సోనాల్ మకాడియా తరచుగా ఆరోగ్యం, చర్మ సంరక్షణపై సలహాలు, చిట్కాలను తన ఇన్స్టా కుటుంబంతో పంచుకుంటారు. అలాగే చర్మ రకాన్ని బట్టి ఏ ఆహారం బెస్ట్ రిజల్ట్ అందిస్తుందో చెప్పుకొచ్చింది. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి.
జిడ్డుగల చర్మం ఉన్నవారికి సోనాల్ కీర దోసకాయలను సిఫార్సు చేస్తుంది, ఎందుకంటే అవి ఆర్ద్రీకరణ, సమతుల్యతను కాపాడటానికి చాలా బాగా సహాయపడతాయి. ఇలాంటి వారు వీలైనంత వరకూ కీరదోసకాయను ఎక్కువ తినడానికి ప్రయత్నించండి. కీరదోసను నేరుగా కట్ చేసుకుని తినచ్చు. సలాడ్లు వంటి వాటిలో కూడా జోడించి తినచ్చు. అంతేకాదు కీరదోసతో డిటాక్సిఫైయింగ్ డ్రింక్ తయారు చేసుకుని కూడా తినచ్చు. దీన్ని ఉదయం లేక సాయంత్రం ఎప్పుడైనా రిఫ్రెషింగ్ చిరుతిండిగా ఆస్వాదించండి.
"మీది పొడి చర్మం అయితే చియా విత్తనాలు మీకు చక్కటి ఆప్షన్.. ఇవి లోతైన పోషణ, ఆర్ద్రీకరణను అందిస్తాయి" అని ఆమె వివరిస్తుంది. వీటిని నీటిలో లేదా పాలలో కలుపుకుని తాగచ్చు. లేదా పండ్ల రసాలు, సలాడ్లు, స్మూతీలలో వేసుకుని కూడా తినచ్చు. మరింత అందమైన చర్మం కోసం చియా విత్తనాలను పెరుగులో కలుపుకుని కూడా తినచ్చు.
విటమిన్ సి కలిగి ఉండే సహజ వనరైన నారింజ డల్ స్కిన్ ను రిపేర్ చేయడానికి, లోపలి నుంచి మెరుపును తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం మీరు నారింజలను నేరుగా తింటే చాలా మంచిది. లేదంటే జ్యూస్, సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
"మీరు మొటిమలతో పోరాడుతుంటే, గుమ్మడికాయ విత్తనాలను మీ ఆహారంలో చేర్చండి, ఎందుకంటే అవి చర్మ వైద్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి" అని సోనాల్ చెప్పారు. వీటిని చిరుతిండిగా తినచ్చు. సలాడ్లపై చల్లుకుని తిసుకోవచ్చు లేదంటే స్మూతీలలో కలపుకుని ఆస్వాదించవచ్చు.
"బాదం విటమిన్ బి స్థాయిలను మెరుగుపరచడానికి, రక్త ప్రసరణను పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది డార్క్ సర్కిల్స్ తగ్గంచడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది" అని సోనాల్ చెప్పారు. వాటిని రాత్రంతా నానబెట్టి ఉదయం పొట్టు తీసకుని తినచ్చు. స్మూతీలలో కలుపుకుని తినచ్చు. ఎక్కువ పోషకాలు అందడానికి వీటిని ఓట్ మిల్క్ లో వేసుకుని కూడా తాగచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం