ఎంత కష్టపడ్డా బరువు తగ్గట్లేదా? ఇందుకు కారణం ఈ 5 హార్మోన్లు అయి ఉండచ్చు, చెక్ చేసుకోండి!-find out what hormones are causing you to not lose weight no matter how hard you try ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎంత కష్టపడ్డా బరువు తగ్గట్లేదా? ఇందుకు కారణం ఈ 5 హార్మోన్లు అయి ఉండచ్చు, చెక్ చేసుకోండి!

ఎంత కష్టపడ్డా బరువు తగ్గట్లేదా? ఇందుకు కారణం ఈ 5 హార్మోన్లు అయి ఉండచ్చు, చెక్ చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu

వ్యాయామం, డైట్ వంటివన్నీ చేసిన తర్వాత కూడా శరీర బరువును ఆపలేకపోతున్నారా? దీనికి కారణంలో మీ శరీరంలోని హార్మోన్లు కావచ్చు.అవును శరీరంలోని కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు తగ్గడం అనేది సాధ్యం కాకపోవచ్చు. బరువు తగ్గుదలను అడ్డుకునే హార్మోన్లు ఏంటో, వాటి నుండి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకోండి.

బరువు తగ్గకపోవడానికి కారణాలేంటి (shutterstock)

మీ శరీర బరువు రోజు రోజుకీ పెరుగుతుందా? వ్యాయామం, ఆహార నియంత్రణ వంటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫ్యాట్ లాస్‌పై ఎటువంటి ప్రభావం చూపడం లేదా. అయితే ఇందుకు కారణం మీ శరీరంలోని కొన్ని హార్మోన్లు అయి ఉండచ్చు. ముందుగా మీ శరీరంలోని హార్మోన్ల స్థాయిలను చెక్ చేసుకోండి. ఎందుకంటే హార్మోన్ల అసమతుల్యత అనేది బరువు తగ్గుదలకు అడ్డుగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటి కారణంగానే చాలా మంది వెయిట్ టాస్ కోసం పడే కష్టం అంతా వృథా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు తగ్గుదలను కష్టతరం చేసే హార్మోన్లలో ముఖ్యమైన 5 రకాల హార్మోన్లు, వాటి సమతుల్యత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి.

శరీర బరువును పెరగడానికి కారణమయ్యే హార్మోన్లు..

1. ఇన్సులిన్ హార్మోన్

ఇన్సులిన్ హార్మోన్ క్లోమం నుండి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రభావితమవుతాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పనిచేయకపోతే, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ కొవ్వు తగ్గదు. ్మకాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదంటే ముందు ఇన్సులిస్ హార్మోన్ స్థాయిలను చెక్ చేసుకోండి. దీన్ని తగ్గించడానికి రోజూ ఉదయం ఒక చెంచా నానబెట్టిన మెంతులను నమలండి. లేదంటే మెంతులు నానబెట్టిన ఆ నీటిని పరగడుపునే తాగేయండి.

2. కార్టిసోల్ హార్మోన్

ఒత్తిడి, ఆందోళన కారణంగా పెరిగే కార్టిసోల్ హార్మోన్ స్థాయి కూడా మీ శరీర బరువు తగ్గుదలను అదుపు చేస్తుంది. కార్మిస్టొల్ హార్మోన్ స్థాయితులు పెరిగితే అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. అలాగే కొవ్వు పేరుకుపోయేందుకు మెదడుకు సిగ్నల్ వెళుతుంది. కాబట్టి మీ శరీర బరువును అదుపులో ఉంచుకోవాలంటే ముందు మీరు మీ మానసిక బరువును అంటే ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా శరీరంలోని కార్టిసోల్ స్థాయి పెరగదు, బరువు తగ్గడం సులభం అవుతుంది. కార్టిసోల్ హార్మోన్‌ను తగ్గించడానికి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అర చెంచా అశ్వగంధ పొడిని వెచ్చని పాలు లేదా నీటిలో కలిపుకుని త్రాగండి.

3. గ్రెలిన్ హార్మోన్

మీకు ఎక్కువగా ఆకలిగా అనిపిస్తే, తిన్న వెంటనే మళ్లీ తినాలనిపిస్తే దానికి కారణం గ్రెలిన్ హార్మోన్. ఈ హార్మోన్ అసమతుల్యత కారణంగా మీరు ఎక్కువగా తింటారు, ఫలితంగా శరీర బరువు పెరుగుతూ వస్తుంది. ఈ హార్మోన్ స్థాయిని సరిచేసుకోవడానికి రోజూ అర చెంచా దాల్చిన చెక్క పొడిని వెచ్చని నీటిలో కలపి తాగండి. లేదా టీ తయారు చేసుకుని భోజనానికి అరగంట ముందు తాగండి. ఇలా చేయడం వల్ల తక్కువ తినడం మొదలు పెడతారు.

4. ఎస్ట్రోజెన్ హార్మోన్

ఎస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు కైడా శరీర బరువును వేగంగా పెంచుతాయి. ఈ హార్మోన్ స్థాయిని సమతుల్యం చేయడానికి, రోజూ ఒక చెంచా అవిసె గింజలను వెచ్చని నీటిలో కలుపుకుని తాగండి. లేదంటే సలాడ్ లలో కలుపుకుని తీసుకొండి.

5. లెప్టిన్ హార్మోన్

లెప్టిన్ హార్మోన్ మీ ఆహార సంతృప్తిని అనుభూతి చెందేలా చేస్తుంది. ఆహారం శరీరంలోకి వెళ్ళినప్పుడు, లెప్టిన్ హార్మోన్ వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను కలిగించదు. ఇది సమతుల్యంగా లేకపోతే ఎక్కువగా తినాలనిపిస్తుంది. దీని వలన ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడం కష్టం అవుతుంది. లెప్టిన్ హార్మోన్‌ను సక్రియం చేయడానికి, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు వెచ్చని పాలు లేదా నీటిలో అర చెంచా పసుపు, నల్ల మిరియాల పొడి వేసి కలిపి తాగండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం