Skin Color and Dress: నలుపురంగులో ఉన్న వారికి ఏ కలర్ దుస్తులు వేసుకుంటే అందంగా-find out what color clothes look best on black skin people ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Color And Dress: నలుపురంగులో ఉన్న వారికి ఏ కలర్ దుస్తులు వేసుకుంటే అందంగా

Skin Color and Dress: నలుపురంగులో ఉన్న వారికి ఏ కలర్ దుస్తులు వేసుకుంటే అందంగా

Haritha Chappa HT Telugu

Skin Color and Dress: నల్లటి చర్మం ఉన్న వారికి అన్ని రంగులు సరిగా నప్పకపోవచ్చు. కొన్ని రంగుల దుస్తులు అందంగా నప్పుతాయి. రంగు తక్కువ ఉన్నవారు ఏ రంగు దుస్తులను ఎంచుకోవాలో తెలుసుకోండి.

రంగు తక్కువగా ఉన్నవారు ఈ రంగుల దుస్తులను ఎంచుకోవాలి (shutterstock)

భారతీయుల్లో అనేక చర్మ రంగులు కలవారు ఉంటారు. కొంతమంది తెల్లటి చర్మాన్ని కలిగి ఉంటే, మరికొందరు గోధుమ రంగులో ఉంటారు. ఇంకొందరు చామన ఛాయగా, మరికొందరు నల్లటి చర్మం కలిగి ఉంటారు. చర్మం రంగును బట్టి మీరు వేసుకునే దుస్తుల రంగు ఆధారపడి ఉంటుంది.

మీ చర్మానికి తగ్గట్టు దుస్తులు రంగులను ఎంపిక చేసుకుంటే మీరు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. అయితే తమ చర్మ రంగుకు తగ్గట్టు ఏ కలర్ దుస్తులు వేసుకోవాలో ఎంతో మందికి తెలియదు. మీరు తక్కువ రంగు చర్మాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని మరింత అందంగా చూపించే రంగుల దుస్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

నల్లటి చర్మం ఉన్నవారు ఏ రంగులను ప్రయత్నించాలో ఇక్కడ ఇచ్చాము. ఈ రంగుల దుస్తులు వేసుకుంటే మీరు ఎంతో ఆకర్షణగా కనిపిస్తారు. ఈ రంగులన్నీ కూడా ఎంతో అందంగా కనిపించేవే.

ముదురు నీలి రంగు (డీప్ బ్లూ)

మీ చర్మం నల్లగా ఉంటే, ముదురు నీలి రంగు లేదా డీప్ బ్లూ రంగు దుస్తులను ఎంచుకోండి. ఈ రంగులు మీ చర్మ రంగును మరింత అందంగా చూపిస్తాయి. ఎంతో ఆకర్షణగా మీరు ఉంటారు.

ముదురు ఆకుపచ్చ (ఎమరాల్డ్ గ్రీన్)

ఎమరాల్డ్ గ్రీన్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ రంగు కూడా నల్లటి చర్మం ఉన్నవారికి ఎంతో బావుంటుంది. పురుషులు, స్త్రీలు ఇద్దరికీ ఈ రంగు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రొఫెషనల్ లుక్ కోసం కూడా ఈ రంగును ఉపయోగించవచ్చు.

వైన్ రంగు

వైన్ రంగు అంటే డార్క్ మెరూన్ కంటే ముదురైనది. గ్లాసులో వైన్ వేస్తే ఏ రంగు వస్తుందో ఆ రంగన్నమాట. ఈ రంగు కూడా నల్లటి చర్మం ఉన్నవారికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నల్లటి చర్మం ఉన్న పెళ్లి కూతుళ్ళు వైన్ రంగు లెహెంగా లేదా చీర ధరించడం వల్ల చాలా అందంగా కనిపిస్తారు.

గోధుమ రంగు

గోధుమ రంగు… లైట్ క్రీమ్ కలర్ లా ఉంటుంది. ఇది నలుపు చర్మం ఉన్నవారికి చాలా అందంగా ఉంటుంది. అలాగే కాపర్ బ్రౌన్, చాక్లెట్ బ్రౌన్ వంటివి కూడా వీరికి బాగా నప్పుతాయి. ఈ రంగు లిప్ స్టిక్ నుండి దుస్తుల వరకు ఒకే రంగును ఎంపిక చేసుకుంటే మీరు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు.

పీచ్ రంగు

పీచ్ రంగులోని డార్క్ షేడ్ అయిన కోరల్ రంగు నల్లటి చర్మం ఉన్నవారికి చాలా సరిపోతుంది. ఈ రంగు దుస్తులు కూడా నల్లటి చర్మం ఉన్న అమ్మాయిలకు చాలా అందంగా ఉంటాయి. చర్మం ముదురు రంగులో ఉన్నవారికి ఏ రంగు దుస్తులు వేసుకోవాలో అర్థం కాకపోతే ఈ రంగులను ఖచ్చితంగా ప్రయత్నించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం