పెద్దగా కష్టపడకుండానే ఒక చిన్న వ్యాయామంతోనే 95 కిలోలు బరువు తగ్గిందట, అది కూడా ఇంట్లోనే ఎలాగో తెలుసుకోండి-find out how he lost 95 kg with a little exercise without much effort and that too at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  పెద్దగా కష్టపడకుండానే ఒక చిన్న వ్యాయామంతోనే 95 కిలోలు బరువు తగ్గిందట, అది కూడా ఇంట్లోనే ఎలాగో తెలుసుకోండి

పెద్దగా కష్టపడకుండానే ఒక చిన్న వ్యాయామంతోనే 95 కిలోలు బరువు తగ్గిందట, అది కూడా ఇంట్లోనే ఎలాగో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ఇంట్లోనే బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోనే తన బరువు ఎలా తగ్గిందో వివరించింది. జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువు తగ్గింది ఆమె.

స్కిప్పింగ్ ఉపయోగాలు (ప్రతీకాత్మక చిత్రం) (Freepik)

అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం కచ్చితంగా బరువు తగ్గాల్సిందే. అలా అని అందరూ జిమ్ కు వెళ్లలేరు. ఇంట్లోనే కొన్ని వర్కౌట్స్ ద్వారా బరువు తగ్గాల్సి వస్తుంది. కానీ ఏం చేయడం ద్వారా బరువు తగ్గాలో వారికి అర్థం కాదు. అలాంటివారికి ఒక నైజీరియన్ ఇంట్లో కూడా 95 కిలోల బరువు ఎలా తగ్గిందో వెల్లడించింది.

జైనాబ్ ఇంట్లో బరువు అధికంగానే ఉండేది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను రావడం మొదలయ్యాయి. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అలా అని జిమ్ కు వెళ్లాల్సినా పరిస్థితి లేదు. దీంతో ఆమె ఇంట్లోనే సులువుగా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది.

జైనాబ్ చెబుతున్న ప్రకారం ప్రతిరోజు నడక, స్కిప్పింగ్ ఈ రెండు వ్యాయామాలు చేయడం ద్వారా త్వరగా బరువు తగ్గవచ్చు. ఇంట్లో కూడా మీరు ఈ రెండిటినీ చేయవచ్చు. లేదా ఇంటి బయట అలా రోడ్డు మీద నడుస్తూ కూడా బరువు తగ్గవచ్చు. స్కిప్పింగ్ చేసేందుకు మీరు ఇంట్లో ఒక గదిని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు నెల రోజులపాటు ప్రతిరోజు గంట పాటు నడక అరగంటకు పాటు స్కిప్పింగ్ చేసి చూడండి. కచ్చితంగా మీరు బరువు తగ్గడం ఖాయమని వివరిస్తుంది.

స్కిప్పింగ్ ఉపయోగాలు

బరువు తగ్గడానికి స్కిప్పింగ్ ఎంతో ఉపయోగకరం కూడా. స్కిప్పింగ్ అనేది అధిక తీవ్రత కలిగిన వ్యాయామం తక్కువ సమయంలోనే ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది. మీరు స్కిప్పింగ్ రోప్ పై నుంచి దూకినప్పుడు మీ గుండె కొట్టుకునే రేటు పెరుగుతుంది. దీనివల్ల శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. క్యాలరీలు కూడా త్వరగా కరుగుతాయి. క్యాలరీలను బర్న్ చేయడమే కాదు... కాళ్ళు చేతులు, భుజాలలోని కండరాలపై పనిచేసి పటిష్టంగా మారుస్తుంది. మీ కండరాలను టోన్ చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును కూడా పెంచుతుంది.

అన్నిటికన్నా ఉత్తమమైన విషయం ఏమిటంటే స్కిప్పింగ్ కోసం మీరు ఏ జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక తాడు కొనుక్కుంటే చాలు... మీరు ఉన్నచోటే హ్యాపీగా స్కిప్పింగ్ చేసుకోవచ్చు. బిగినర్స్ మొదట్లో ఒకటి నుంచి రెండు నిమిషాలు పాటు మాత్రమే చేయాలి. ప్రతిరోజు ఆ సమయాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. అలా మీ స్టామినా మెరుగుపడిన తర్వాత రోజుకు పావుగంట నుంచి అరగంట వరకు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే అది తక్కువ కాలంలోనే మీరు బరువు తగ్గడం ఖాయమని జైనాబ్ చెబుతోంది.

స్కిప్పింగ్, నడక వంటివి ఇన్సులిన్ సెన్సిటివిటీ ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. కార్టిసాల్ హార్మోను ఉత్పత్తిని తగ్గించి ఒత్తిడి బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతాయి. ఒత్తిడి కూడా మీకు తెలియకుండానే బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాబట్టి స్కిప్పింగ్ చేయడం అనేది మానసిక, శారీరక ఆరోగ్యానికి రెండింటికి ఉత్తమమైనది.

కేవలం వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు ఆహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీరు రోజులో ఎక్కువ నీటిని తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇచ్చేలా అవకాడోలు, నట్స్ ,ఆలివ్ నూనెను మీ ఆహారంలో భాగం చేసుకోండి.

వీటిని తినండి

ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే పాలకూరను తినండి. అలాగే ప్రోటీన్ కోసం లీన్ మాంసం అంటే చికెన్, చేపలు, గుడ్లు వంటివి అధికంగా తినాలి. బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలను కూడా తినాల్సిన అవసరం ఉంది. ఫైబర్ కోసం పండ్లు, కూరగాయలు రోజువారీ భోజనంలో ఉండేలా చూసుకోండి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎలాంటి పోషకాహాన లోపం కూడా రాదు. శాశ్వతంగా బరువు తగ్గడానికి వ్యాయామం ఒకటే సరిపోతుందనుకుంటే అది మీ అపోహ. వ్యాయామానికి మద్దతు ఇచ్చేలా సరైన ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.