Christmas 2022 gift ideas: పిల్లలకు క్రిస్మస్ కానుకలు.. ఈ 6 వారికి నచ్చుతాయి-find 6 unique christmas gifting ideas for your child for christmas 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Find 6 Unique Christmas Gifting Ideas For Your Child For Christmas 2022

Christmas 2022 gift ideas: పిల్లలకు క్రిస్మస్ కానుకలు.. ఈ 6 వారికి నచ్చుతాయి

HT Telugu Desk HT Telugu
Dec 21, 2022 09:29 AM IST

Christmas 2022 gift ideas: క్రిస్మస్ 2022 గిఫ్ట్ ఐడియాల కోసం వెతుకుతున్నారా? మీ పిల్లలకు ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 6 బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు పరిశీలించండి.

Christmas 2022: క్రిస్మస్ కానుకలతో మీ పిల్లలను ఆనందింపజేయండి
Christmas 2022: క్రిస్మస్ కానుకలతో మీ పిల్లలను ఆనందింపజేయండి (pexels)

Christmas 2022 gift ideas: క్రిస్మస్ సీజన్ వచ్చిందంటే స్వీట్ కేక్స్, ఫ్యాన్సీ డెకొరేరషన్స్, ఆకట్టుకునే కానుకలు, సంతోషకరమైన వాతావరణం మీ మనస్సును ఉత్తేజపరుస్తాయి. ఇక పిల్లల్లో ఆ ఉత్సాహం రెట్టింపు ఉంటుంది. క్రిస్మస్ రోజు చిన్నారులు కానుకల కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తుంటారు. మరి ఈ క్రిస్మస్‌కు వారికి ఏమివ్వాలనుకుంటున్నారు? చక్కటి కానుకల జాబితా మీకోసం..

1. Art supplies: ఆర్ట్ టూల్స్, క్రాఫ్ట్ మెటిరియల్

ఆర్ట్ టూల్స్, క్రాఫ్ట్ మెటిరియల్ క్రిస్మస్ గిఫ్ట్‌గా బాగుంటుంది. మీ పిల్లల్లోని కళను వెలికితీసిన వారవుతారు. వారిలో ఉన్న సృజనాత్మకత ఆచరణలోకి తెచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడుతాయి. పెయింటింగ్స్ చేసేందుకు, క్రాఫ్ట్స్ చేసేందుకు తగిన టూల్స్, మెటిరియల్ మీ స్టేషనరీ షాపులోనే దొరుకుతాయి.

2. Piggy bank: పిగ్గీ బ్యాంక్

పిల్లలకు మీరు డబ్బుల గురించి ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా మెదుడుకు ఎక్కవు. వాటి విలువను పిల్లలు గుర్తించాలంటే సేవింగ్స్ చేయించి వాటి భవిష్యత్తు ఉపయోగాన్ని ఆచరణాత్మకంగా చూపాలి. అందుకు పిగ్గీ బ్యాంక్ మొదటి అడుగు అవుతుంది. రకరకాల రంగుల్లో, ఆకట్టుకునే రూపాల్లో లభిస్తాయి. మీ పిల్లల ఫేవరైట్ కార్టూన్ రూపంలో ఉండే పిగ్గీ బ్యాంక్‌ను ఈ క్రిస్మస్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా వారిని ఆకట్టుకోండి.

3. Kaleidoscope: కలైడోస్కోప్

కలైడోస్కోప్ క్రిస్మస్ గిఫ్ట్‌గా బాగుంటుంది. పిల్లలకు వినోదాన్ని, విద్యను అందిస్తుంది. విభిన్న రంగులు, రూపాల గురించి తెలియపరిచే ఈ చిత్రదర్శిని పిల్లలను బాగా ఆకట్టుకుంటుంది. నాలుగేళ్ల వయస్సు, ఆపైబడిన వయస్సు పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది.

4. Jewellery-making kit: జువెల్లరీ మేకింగ్ కిట్

నగల తయారీ ఒక కళ. ఈ అలవాటు పిల్లల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. అలాగే చేయి-కంటి సమన్వయం మెరుగుపడుతుంది. ఒక బేసిక్ జువెల్లరీ సెట్ ఎంచుకుని అందులో ఆర్నమెంట్స్ తయారు చేసేలా మెటీరియల్ ఉండేలా చూసుకోవాలి. బీడ్స్, రిబ్బన్స్, స్ట్రింగ్స్, గ్లిటర్ వంటివి అందులో ఉంటాయి.

5. Picture books: బొమ్మల పుస్తకాలు

పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించి వారిలో రీడింగ్‌పై ఆసక్తి పెంచేందుకు బొమ్మల పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. తక్కువ ధరలో దొరుకుతాయి. అన్ని వయస్సులు, అభిరుచులకు తగ్గట్టు విభిన్న పుస్తకాలు దొరుకుతాయి. క్రిస్మస్ గిఫ్ట్‌గా ఇవి పిల్లలకు బాగా నచ్చుతాయి.

6. Gift them a plant: మొక్కను బహుమతిగా ఇవ్వండి

మొక్కను పిల్లలకు బహుమతిగా ఇవ్వడం చాలా బాగుంటుంది. మొక్కల పట్ల వారికి ప్రేమ పెరుగుతుంది. పర్యావరణం గురించి ఆలోచన రేకెత్తుతుంది. వారు మరింత బాధ్యతగా ఉండడం నేర్పుతుంది. వాటి పట్ల ఎలాంటి శ్రద్ధ కనబరచాలో తెలుస్తుంది.

WhatsApp channel