Finance Tips | రెండోసారి బంధంలోకి అడుగుపెడుతున్నారా? అయితే ఇవి తెలుసుకోవాల్సిందే
కెరీర్ మీద దృష్టితో ఒక్కోసారి ప్రేమను పొందడం ఆలస్యం కావొచ్చు. లేదా లైఫ్‌లో ప్రేమ సెకండ్ ఛాన్స్ ఇవ్వొచ్చు. మరి రెండోసారి ప్రేమలో అడుగుపెడుతున్నప్పుడు లేదా.. లేటు వయసులో ప్రేమను పొందుతున్నప్పుడు మదిలో మెదిలో ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫినాన్సియల్ ప్రశ్నలు. ఇద్దరు ఇండిపెండెంట్ జీవితాలు కలిగిన వ్యక్తులు ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Finance Tips | జీవితంలో ప్రేమను లేటుగా కనుగొనడం లేదా ప్రేమ, వివాహంలో రెండవ అవకాశం పొందడం అనేది ప్రత్యేక అనుభూతి. కానీ ఈ ప్రేమను మీరు ఆస్వాదించాలంటే.. ఆర్థికపరమైన చర్చలు ఉండాలి అంటున్నారు నిపుణులు. ప్రేమ రెండో అవకాశం ఇచ్చినప్పుడు... మొదటిసారి జరిగిన తప్పులే రిపీట్ చేయకూడదు. కాబట్టి.. మీరు జంటగా ఖర్చు చేసే వాటి గురించి బడ్జెట్ కచ్చితంగా రూపొందించాలి. ఉమ్మడి చెల్లింపుల కోసం ఉమ్మడి ఖాతా సృష్టించినా.. పర్వాలేదు. లేదా ఇద్దరు మంచి అండర్‌స్టాండింగ్‌తో మెలిగినా పర్వాలేదు. భాగస్వామితో ఆర్థికంగా ఎలాంటి చర్చలు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రెండింగ్ వార్తలు
1. పిల్లల సంరక్షణ ఖర్చులు..
ఒకరు లేదా ఇద్దరూ పిల్లలు కలిగి ఉంటే, మీ భాగస్వామికి ప్రయోజనం చేకూర్చేందుకు మీ ఆర్థిక లావాదేవీలను మరింత పారదర్శకంగా చేయవచ్చు. అది ఎలా అంటే.. మీ నెలవారీ బడ్జెట్‌లో భాగంగా పిల్లలకు చెల్లింపులు లేదా వారి ఫీజులు, తదితర ఖర్చుల. మీ డబ్బును ఏమి చేస్తున్నారో అని మీ భాగస్వామి ఆలోచించకుండా ఉండేందుకు ఇది చక్కని మార్గం.
2. పదవీ విరమణ కోసం ప్లాన్ అవసరం
పదవీ విరమణ కోసం మీ సంసిద్ధతను అంచనా వేయడం చాలా ముఖ్యం. దీనికోసం మొదటిగా మీరు వ్యక్తిగతంగా, జంటగా.. మీ పొదుపు పరిధిని తప్పనిసరిగా పరిగణించాలి. రెండవది మీ వయస్సు 70 ఏళ్లు పైబడినప్పుడు.. మీలో ఒకరికి లేదా ఇద్దరికీ అవసరమయ్యే పెద్దల సంరక్షణ గురించి ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు.
3. బీమా పాలసీలు ముఖ్యం
మీ భాగస్వామికి వయస్సు పెరిగేకొద్దీ మీరు వారిపై శ్రద్ధ వహించాలి. జీవితాంతం వారికి సంరక్షణగా ఉండాలి. కాబట్టి బీమా పాలసీల గురించి వారితో చర్చించాలి. మీ బీమా పాలసీలను కూడా వారితో పంచుకోవాలి. దానికి సంబంధించిన ఖర్చులను కూడా లెక్కించాలి. ఫ్యూచర్లో బీమాలే మిమ్మల్ని రక్షిస్తాయి అనే విషయం మరచిపోకండి. నలభై ఏళ్ల తర్వాత ప్రేమలోకి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టేవారికి ఇలాంటి ఆర్థికపరమైన చర్చలు చాలా అవసరం.
అంతే కాకుండా ఆరోగ్య విషయంలో ఒకరిపట్ల మరొకరు శ్రద్ధ వహించాలి. అనారోగ్య విషయంలో భాగస్వామిపై పూర్తిగా అధికారం కూడా తీసుకోవచ్చు. వారితో ఉంటూ తగిన శ్రద్ధవహిస్తూ ఆరోగ్యకరమైన ప్రేమ జీవితాన్ని 40 ఏళ్ల తర్వాత కూడా పొందవచ్చు.
సంబంధిత కథనం