Methi Serum: చుండ్రును తగ్గించి జుట్టును పెంచే మెంతి సీరమ్, దీన్ని ఇంట్లో ఇలా చేయండి-fenugreek serum to reduce dandruff and grow hair make it at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Methi Serum: చుండ్రును తగ్గించి జుట్టును పెంచే మెంతి సీరమ్, దీన్ని ఇంట్లో ఇలా చేయండి

Methi Serum: చుండ్రును తగ్గించి జుట్టును పెంచే మెంతి సీరమ్, దీన్ని ఇంట్లో ఇలా చేయండి

Haritha Chappa HT Telugu
Jan 29, 2025 10:30 AM IST

Methi Serum: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇంట్లోనే మెంతి సీరమ్ తయారు చేసుకోండి. దీన్ని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. జుట్టును ఒత్తుగా పెరిగేలా ఇది చేస్తుంది.

జుట్టు కోసం మెంతి సీరమ్ తయారీ
జుట్టు కోసం మెంతి సీరమ్ తయారీ

ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కొందరిలో జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు ఉన్నాయి. మరికొందరిలో చుండ్రు ఎక్కువగా పట్టేస్తుంది. దీనికోసం జుట్టును రక్షించే మెంతి సీరమ్ మంచి పరిష్కారంలా పనిచేస్తుంది. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా సమస్యలు తీరుతాయి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి మెంతి సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.

yearly horoscope entry point

జుట్టు రాలడాన్ని నివారించడంలో మెంతికూర చాలా ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. మెంతికూర జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడుతుంది. మూలాల నుండి బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది

జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి మెంతికూరను రోజూ అప్లై చేయడం మంచి పరిష్కారం. మెంతికూరలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టుకు పోషణను అందిస్తుంది. కుదుళ్లను బలోపేతం చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

జుట్టు తెల్లబడడం

వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ తెల్ల జుట్టు సమస్య ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మెంతి సీరమ్ ను రోజూ మాడుకు అప్లై చేయాలి. ఇది జుట్టుకు నేచురల్ కలర్ ఇవ్వడంలో సహాయపడుతుంది. జుట్టు తెల్లగా మారకుండా నివారిస్తుంది.

పొడిబారిన, చిక్కుకుపోయిన జుట్టు ఉన్నవారు మెంతి సీరమ్ ను తరచూ జుట్టుకు స్ప్రే చేయాలి. లేదా వారానికి ఒకసారైనా మెంతి పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరిసిపోతుంది. తరచూ జుట్టు రాలే సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

పేలు పోయేలా

కొందరికి తలపై దురద, పేలు, చుండ్రు మొదలైన సమస్యలు ఇబ్బంది పెడతాయి. అలాంటి వారు మెంతి సీరమ్ ను జుట్టు బేస్ కు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని బాగా శుభ్రపరచడంలో సహాయపడతాయి.

మెంతి సీరమ్ ఎలా తయారు చేయాలి?

  • మెంతి సీరమ్ తయారు చేయడానికి, ఒక గాజు గిన్నె లేదా సీసాలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేయండి.
  • అందులో ఒక గ్లాసు నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి.
  • ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపాలి.

మరొక పద్ధతి

  • ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో మెంతులు వేయాలి.
  • స్టవ్ వెలిగించి 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి.
  • నీటి రంగు మారిన తర్వాత, ఈ నీటిని ఫిల్టర్ చేయండి.
  • చల్లారిన తర్వాత ఒక సీసాలో భద్రపరుచుకోవాలి.

ఈ నీటిని తలస్నానం చేయడానికి ముందు లేదా షాంపూ చేయడానికి రెండు గంటల ముందు ఈ నీటిని మీ జుట్టుకు స్ప్రే చేసి వదిలేయండి. పావుగంట పాటు అలాగే వదిలేసి షాంపూతో తలస్నానం చేయాలి. ఇది చక్కగా పనిచేస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner