Sunset Anxiety: సాయంత్రం కాగానే అలసట, ఆందోళన పెరుగుతున్నాయా? ఇదొక వ్యాధి అని మీకు తెలుసా? ఎలా పరిష్కారించాలో తెలుసుకోండి
Sunset Anxiety: సాయంత్రం కాగానే అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మీలో తెలియని అలసట, ఆందోళన, ఒత్తిడి వంటివి కలుగుతున్నాయా? ఇది ఒక వ్యాధి అంటే మీరు నమ్మగలరా? అవును దీన్ని “సన్‌సెట్ యాంగ్జైటీ”( Sunset Anxiety) అంటారు. ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు, పరిష్కారాలను గురించి తెలుసుకుందాం రండి.
సూర్యాస్తమయం ఎంత అందంగా కనిపించినప్పటికీ కొంతమందిలో ఆందోళన, అలసటకు కారణమవుతుంది. చాలా మందికి సూర్యుడు అస్తమించగానే అంటే సాయంత్రం కాగానే ఎలాంటి కారణం లేకుండానే మనస్సులో విచారంగా అనిపిస్తుంది. జీవితంలో శూన్యంగా భావిస్తారు, తెలియని వాటికి భయపడతారు, దీని వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు. మీకు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోండి. అవును దీన్నే వన్నీ ఓ వ్యాధి “సన్‌సెట్ యాంగ్జైటీ”( Sunset Anxiety)(సూర్యాస్తమయం ఆందోళన) అంటారు.
సన్‌సెట్ యాంగ్జైటీ( Sunset Anxiety) గురించి స్టడీలు ఏం చెబుతున్నాయి?
డయాగ్నస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5) ప్రకారం, సూర్యాస్తమయం ఆందోళన అనేది వైద్య రుగ్మత కాదు. కానీ డేటా ప్రకారం దాదాపు 20% మంది ఈ రకమైన ఒత్తిడి( anxiety) డిజార్డర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా సూర్యుడు అస్తమించేకొద్దీ తమకు ఎక్కువ అసౌకర్యంగా, ఆందోళనగా అనిపిస్తుందని పేర్కొన్నారు. చాలా మంది మానసిక ఆరోగ్య నిపుణులు కూడా ఇది నిజమేనని, Sunset Anxiety (సూర్యాస్తమయం ఆందోళన) ఎక్కువ మందిలో అసౌకర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకొచ్చారు.
ఫ్లోరిడా విశ్వవిద్యాలయం మనోవిజ్ఞాన విభాగంలో లైసెన్స్ పొందిన మనస్తత్వవేత్త ఆండ్రియా D. గువాస్టెల్లో, PhD, మీడియాతో మాట్లాడుతూ, సూర్యాస్తమయం ఆందోళన అనేది ఒక మానసిక లక్షణమనీ, ఇది సూర్యకాంతి తక్కువగా ఉన్నప్పుడు అంటే సూర్యుడు అస్తమించే సమయంలో పెరుగుతుందని తెలిపారు. దీని కారణంగా నిరాశ, ఒంటరితనం, నిస్సహాయ భావాలు వేగవంతం అవుతాయి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని వివరించారు.
సూర్యాస్తమయం ఆందోళన ప్రేరేపకాలు ఏమిటి?
సూర్యాస్తమయం ఆందోళన అనేది శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌కు సంబంధించినది. ఇది శరీరం పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ లయ శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి ద్వారా ప్రభావితమవుతుంది. మెలటోనిన్ ఉత్పత్తి నేరుగా కాంతి ద్వారా ప్రభావితమవుతుంది.ఇది సూర్యుడి కాంతి తగ్గడం ప్రారంభం కాగానే ఆందోళన లక్షణాలను కలిగిస్తుంది. శీతాకాలాలు, పగటి వెలుతురుతక్కువగా ఉండటం వల్ల కూడా శరీరంలో కొన్ని హార్మోన్ల మార్పులకు దారితీస్తుంది, ఇది సూర్యాస్తమయం ఆందోళనకు దోహదం చేస్తుంది.
సన్‌సెట్ యాంగ్జైటీ( Sunset Anxiety) లక్షణాలు
- రాత్రిపూట నిద్రపోవడం కష్టం.
- ఒంటరిగా, ఖాళీగా అనిపించడం.
- సూర్యాస్తమయం సమయంలో మనస్సులో విచారం, ప్రతికూల భావాలు కలగడం.
- హృదయ స్పందన వేగంగా ఉండటం.
- సాయంత్రం కాగానే ఆందోళన, చంచలత
- చెమటలు పట్టడం.
- చేతులు, కాళ్ళలో ప్రకంపనలు అనిపించవచ్చు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
- అతిగా ఆలోచించడం
- ఆత్మవిశ్వాసం లోపించవచ్చు.
- ఆందోళన
- బాధ్యతల ఒత్తిడి
- డిప్రెషన్ -
- విరక్తి
- అలసట
సన్‌సెట్ యాంగ్జైటీ( Sunset Anxiety)ని నివారించే పరిహారాలు:
సరైన జీవన విధానం లేకపోతే ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఈ లక్షణాలు ముందే ఉన్నవారిని సన్‌సెట్ యాంగ్జైటీ( Sunset Anxiety) ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కనుక ముందే జాగ్రత్తగా ఉండండి.
- ప్రతిరోజూ సరైన నిద్ర, పోషకాహారం తీసుకోండి.
- నిద్ర విషయంలో రాజీ పడకండి, నిద్రించడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని కేటాయించుకోండి.
- లోతైన శ్వాసతో కూడిన వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి ప్రయత్నించండి.
- సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా, ధ్యానం లేదా నడకకు వెళ్లండి.
- మీకు ఇష్టమైన పుస్తకం చదవడం వల్ల ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి.
- కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడపండి.
- సాయంత్రం మసక వెలుతురులో ఉండండి.
- ఆల్కహాల్ లేదా కెఫిన్ కలిగిన వస్తువులను తాగడం మానుకోండి.
- దీర్ఘకాలిక సూర్యాస్తమయ ఆందోళనను వదిలించుకోవడానికి నిపుణుల సహాయం తీసుకోండి.
సంబంధిత కథనం