Happy Fathers day: కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లలకు వెలుగునిచ్చే మీ నాన్నకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి-fathers day wishes quotes sms greetings whatsapp and facebook status to share with your dad in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Happy Fathers Day: కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లలకు వెలుగునిచ్చే మీ నాన్నకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Happy Fathers day: కొవ్వొత్తిలా కరుగుతూ పిల్లలకు వెలుగునిచ్చే మీ నాన్నకు ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 05:30 AM IST

Happy Fathers day: పిల్లల గెలుపును చూసి లోలోపలే ఆనందపడే వ్యక్తి నాన్న. నాన్న గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం ప్రతి ఏడాది ఫాదర్స్ డే వస్తుంది. ఈ రోజే ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే (International Fathers day).

హ్యాపీ ఫాదర్స్ డే
హ్యాపీ ఫాదర్స్ డే (Pixabay)

Happy Fathers day: ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భంగా మీ తండ్రికి అతనిపై మీకున్న ప్రేమను వ్యక్తపరచండి. నాన్నంటే ఒక చెట్టులాంటివాడు. తాను రాళ్ల దెబ్బలు తింటున్నా... పిల్లలకి తియ్యటి పండ్లు ఇచ్చే వ్యక్తి నాన్న. అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని కచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అందుకోసమే ప్రతి ఏడాది జూన్ నెలలోని మూడో ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. తల్లులకు గౌరవార్థం మాతృ దినోత్సవం ఎలా ఉందో... తండ్రి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ నాన్నల దినోత్సవం నిర్వహించుకుంటారు.

నాన్న నిస్వార్థంగా పిల్లల విజయం కొరకు తపిస్తాడు. అతను చేసిన త్యాగాలు, మోసిన బాధ్యతల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మీ నాన్నకు అందంగా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఇక్కడ ఎన్నో కోట్స్, మెసేజులు ఉన్నాయి. వాటిలో అందమైన మెసేజ్ ని ఎంపిక చేసుకొని మీ నాన్నకు పంపించండి.

హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

1. గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి నాన్న

ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని ఓదార్చే వ్యక్తి నాన్న

అలాంటి నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే (Happy Fathers Day)

2. మనలో జీవాన్ని నింపి

అల్లారు ముద్దుగా పెంచి

మన లోపాలను సరిచేస్తూ

మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ

మనకు గమ్యం చూపేది నాన్న

అలాంటి నాన్న గొప్పదనాన్ని తలుచుకోవడం మన విధి

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

3. నాన్న నా ఆశ, నా శ్వాస

నాన్న అందుకో పితృ దినోత్సవ శుభాకాంక్షలు

4. జీవితంలో పిల్లల్ని ముందుకు నడిపించి

తాను మాత్రం వెనకే ఉండిపోతాడు నాన్న

అలా పిల్లలకు చేయూతగా ఉండడమే

ఏ తండ్రికైనా సంతోషం

హ్యాపీ ఫాదర్స్ డే

5. నాన్నా నీ మాటల్లో కఠినత్వం ఉన్నా

నీ మనసులో అంతా ప్రేమే నిండి ఉంటుంది

నీ కోపంలో బాధ్యత ఉంటుంది

అనుక్షణం బిడ్డ గురించే ఆలోచనలు ఉంటాయి

అలాంటి నా తండ్రికి పితృ దినోత్సవ శుభాకాంక్షలు

6. డియర్ నాన్నా...

మీరు ప్రపంచంలో ఉన్న నాన్నల్లో ఒకరు కావచ్చు

కానీ నాకు మాత్రం మీరే నా ప్రపంచం

హ్యాపీ ఫాదర్స్ డే

7. డియర్ నాన్నా

నువ్వు ముళ్ల బాటలో నడిచి

పూల తోటలో మమ్మల్ని నడిపించావు

హ్యాపీ ఫాదర్స్ డే

8. మా నాన్నే నాకు మొదటి స్నేహితుడు, గురువు, దైవం

ఇలాంటి నాన్నలందరకీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు

9. మనం పుట్టిన నాటినుండి

తిరిగి పెద్దయ్యే వరకు

మనల్ని తన భుజాలపై మోస్తూ

ఈ లోకాన్ని మొట్టమొదటిగా చూపించేది నాన్న

హ్యాపీ ఫాదర్స్ డే డియర్ నాన్న

10. బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేది

నలుగురితో ఎలా మెలగాలో నేర్పేది నాన్న మాత్రమే.

అలాంటి నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే

11. నాన్న తన ఊపిరి ఉన్నంతవరకు

పిల్లల కోసమే తన ప్రాణాన్ని పణంగా పెట్టి

రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి

జీవితాన్ని ధారపోసి మనకి జీవితాన్ని ఇస్తాడు

అలాంటి నాన్నలకు హ్యాపీ ఫాదర్స్ డే

12. నాకు తొలి అడుగు నేర్పింది నాన్న

నా గెలుపును తనలో చూసుకునేవాడు నాన్న

తను కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిచ్చేవాడు నాన్న

అలాంటి నాన్నలందరికీ హ్యాపీ ఫాదర్స్ డే

13. ప్రతి అమ్మాయి తన భర్తకు రాణి అవుతుందో లేదో తెలియదు

కానీ... తండ్రికి మాత్రం ఎప్పటికీ యువరాణి గానే ఉంటుంది.

కూతుళ్లను యువరాణులుగా చూసే

ప్రతి తండ్రికి హ్యాపీ ఫాదర్స్ డే.

14. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు

కానీ అపజయం మాత్రం ఉండదు

హ్యాపీ ఫాదర్స్ డే

15. నాన్నా... నన్ను ఎత్తుకొని నువ్వు చూడని ప్రపంచాన్ని

నాకు చూపించాలని ఎంతో ఆరాటపడ్డారు

మీ ఆరాటమే నన్ను ఇప్పుడు ఇంత ఉన్నత స్థాయిలో ఉండేలా చేసింది

హ్యాపీ ఫాదర్స్ డే నాన్న

WhatsApp channel