Fathers Day 2024 : కుమార్తెకు తండ్రే సూపర్ హీరో.. ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే నిలువెత్తు ప్రేమ
Father and Daughter Relation : కుమార్తెలు తమ తండ్రులతో భావోద్వేగ బంధాన్ని కలిగి ఉంటారు. తండ్రులు కూడా తమ కుమార్తెలను కొడుకుల కంటే ఉన్నతంగా పెంచుతారు. కూతురు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి భుజం తట్టి ఆమెకు బలం చేకూర్చుతాడు.
ఈ సృష్టిలో తండ్రీకూతురి ప్రేమ చాలా గొప్పది. ఈ ప్రపంచంలో తండ్రిని మించిన శక్తివంతమైన ఆయుధం లేదని ఆమె అనుకుంటుంది. జీవితంలో కుమార్తె ఎన్నిసార్లు ఓడిపోయినా నిలబడి చప్పట్లు కొట్టి ఆమెను ప్రోత్సహించేది తండ్రి మాత్రమే. అయితే కూతురికి తన తండ్రితో ఎలాంటి మానసిక సంబంధం ఉంటుందో తెలుసుకుందాం.
కూతురు చెబితే వినాల్సిందే
కుమార్తె కోసం కుటుంబం ఎంత దూరమైనా వెళ్తుంది. కూతురు తండ్రిని అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరు. కూతురు ఏదైనా విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు, తండ్రి దానిని కాదనడు, చిన్నచూపు చూడడు. కూతురి మాట ఇంట్లో ఎవరూ వినకపోయినా నాన్న ఎప్పుడూ తనతోనే ఉంటారనే నిజం ఆమెకు తెలుసు.
మెుదటి ప్రేమ తండ్రే
కూతురికి మొదటి హీరో, మొదటి ప్రేమ తండ్రి. అలాగే కూతురిపై తండ్రి ప్రేమకు అంతులేదు. ఇది నిరంతరాయంగా ఉంటుంది. కూతురు పుట్టగానే చిన్న పిల్లాడిలా ఆమె భవిష్యత్తు గురించి వందల కలలు కంటాడు. ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు రక్తాన్ని చెమటగా చేసి కష్టపడుతాడు. ఏ కారణం చేతనైనా నాన్న కూతురి జీవితం గురించి తప్పుడు నిర్ణయం తీసుకోరని ప్రతీ బిడ్డకు బాగా తెలుసు.
నాన్నే ప్రపంచం
కూతురికి మొదటి ప్రేమ తండ్రి. నాన్నే ఆమె ప్రపంచం. తండ్రిని చూసుకుంటూ పెరిగిన కూతురికి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూడా ఇలాగే ఉండాలని అనుకుంటారు. ఇలాగే ఉంటారా అనే ఆలోచన కూడా వస్తుంది. తండ్రి ప్రేమించే విధానం, పట్టించుకునే విధానం ఆమెకు చాలా ఇష్టం. తను పెళ్లి చేసుకునే భర్త తన తండ్రిలా ఉండాలని కోరుకుంటుంది.
ఏ సమస్య వచ్చినా ముందుంటాడు
తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం చాలా దగ్గరైంది. అందుకని ఏ సమస్య వచ్చినా ముందుగా కూతురు తన తండ్రి దగ్గరకు పరిగెత్తుతుంది. ఎందుకంటే ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం తండ్రి దగ్గరే ఉంటుందని కూతురికి బాగా తెలుసు. ఒకవేళ కష్టమైన పనైనా.. కుమార్తె కోసం చేసేస్తాడు తండ్రి. కొన్నిసార్లు తండ్రులు ఎక్కువగా మాట్లాడరు. కానీ తన కూతురికి సమస్య ఉందని తెలియగానే మనసు కలత చెందుతుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన చెందుతూనే ఉంటాడు తండ్రి.
కూతురిపై శ్రద్ధ
చాలా ఇళ్లలో ఒక సంప్రదాయం ఉంది. కొడుకు, కూతురు ఉంటే ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మొదట కొడుకుని తండ్రే తిడతారు. కూతుర్ని తిట్టరు, కొట్టరు. కొన్ని సార్లు వాళ్ళు అందరి ముందు ఆమెను తిట్టినట్లు నటిస్తారు, మళ్ళీ ఆమెను పక్కకు తీసుకెళ్లి లాలిస్తారు. తండ్రికి ఎప్పుడూ తన కూతురి పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఆప్యాయత, ప్రేమ ఉంటుంది.
తండ్రే సైనికుడు
కూతురు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుగా అర్థం చేసుకునేది తండ్రే. కూతురు మాటలు చెప్పకముందే ఆమె కష్టాలు అర్థమవుతాయి. తండ్రి ఎంత పెద్దవాడైనా, ఎంత బలహీనుడైనా తన కూతురి బాధ్యత తీసుకోవడం మరచిపోడు. కష్టకాలంలో ఆమెకు పెద్ద శక్తిగా నిలిచేది నాన్న.
తండ్రి అంటే ప్రతీ కూతురికి కూడా ఆకాశమంత ప్రేమ. ఈ ప్రేమకు వెలకట్టలేం. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం.
టాపిక్