ఫ్యాషన్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఖర్చు. వేలకు వేలు డబ్బులు పోస్తే గానీ ఫ్యాషన్, ట్రెండ్ ని ఫాలో అవలేమనే భయం. ఏంటి.. ఫ్యాషన్ అంటే ఖర్చేనా, రిచ్‌గా కనిపించాలంటే బ్రాండెడ్ షర్ట్ లేదంటే పాపులర్ డిజైనర్ డ్రెస్సే వేసుకోవాలా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఆలోచించే వారైతే ఇది మీ కోసమే.
నిజానికి రిచ్ లుక్ అనేది వేసుకునే దుస్తులు, వాడే వస్తువుల ధర మీద ఆధారపడదు. వాటిని ఉపయోగించే వ్యక్తిలో ఉండే ఆత్మవిశ్వాసం, సెలెక్షన్, నీట్ ప్రజెంటేషన్ ఉంటే చాలంటున్నారు నిపుణులు. వీటన్నిటితో పాటు తక్కువ ఖర్చుతో రిచ్‌గా, ఫ్యాషనబుల్‌గా ఎలా కనిపించాలో ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.
ఒక బ్రాండెడ్ లోగో కలిగిన ఖరీదైన డ్రెస్ వేసుకున్న వారికన్నా, చక్కగా ఐరన్ చేసి వేసుకున్న ప్లెయిన్, లైట్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్లు చాలా చక్కగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఎందుకంటే ఫ్యాషన్ ఫాలో అవడం అంటే బ్రాండెడ్, లగ్జరీయస్ వస్తువులు, దుస్తులను ఎక్కువ ఖర్చు చేసి కొనడం కాదు. మనలో ఉన్న ఎంపిక జ్ఞానాన్ని ఉపయోగించడం. అంటే మన సెన్స్ ఆప్ సెలక్షన్ ను సరిగ్గా ఉపయోగించడమే.
ఫ్యాషన్ భాషలో రిచ్ అంటే డబ్బు, బ్రాండ్ కాదు సెన్స్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రజెంటేషన్. మన దగ్గర న్న రూ. 500 డ్రెస్‌ని కూడా రూ.5000దానిలా కనిపించేలా చేయగలిగితే… అదే fashion sense. ఇందుకు ప్రత్యేకంగా ఏమీ చేయవల్సిన అవసరం లేదు . మీరు ఎంచుకునే వాటిలో చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు:
ఇవేవీ బ్రాండ్ కాదు కానీ ఇవి మీకు క్లాసీ, రిచ్ లుక్ ఇస్తాయి. మీ మొత్తం పర్సనాలిటీని ఇవి షైన్ చేస్తాయి. ఇవి దుస్తులకన్నా ఎక్కువగా ఇంప్రెస్ చేస్తాయి.
సంబంధిత కథనం