Rose Water Making: మార్కెట్లో నకిలీ రోజ్ వాటర్, ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా సేంద్రీయ పద్ధతిలో తయారుచేసుకోండి-fake rose water in the market make rose water at home organically ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rose Water Making: మార్కెట్లో నకిలీ రోజ్ వాటర్, ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా సేంద్రీయ పద్ధతిలో తయారుచేసుకోండి

Rose Water Making: మార్కెట్లో నకిలీ రోజ్ వాటర్, ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా సేంద్రీయ పద్ధతిలో తయారుచేసుకోండి

Haritha Chappa HT Telugu

Rose Water Making: మార్కెట్ లో దొరికే రోజ్ వాటర్ సేంద్రియ పద్ధతిలో తయారుచేసినది కాకపోవచ్చు. ఫేక్ రోజ్ వాటర్ వల్ల ముఖ చర్మంపై ఎలాంటి ప్రభావం ఉండదు. మీ ముఖ కాంతిని పెంచుకోవడం కోసం ఇంట్లోనే సేంద్రీయ పద్ధతిలో రోజ్ వాటర్ తయారుచేసుకోవచ్చు.

రోజ్ వాటర్ తయారీ ఇలా (shutterstock)

పండుగల సమయంలో ముఖం మెరిసిపోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. మహిళలు తమ చర్మ సంరక్షణపై దృష్టి ఎక్కువగా పెడతారు. చర్మాన్ని రిఫ్రెష్ గా ఉంచుకోవడానికి మార్కెట్ లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎన్ని ఉత్పత్తులు ఉన్నా కానీ రోజ్ వాటర్ ను మాత్రం మహిళలు ఏళ్ల తరబడి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ అన్ని వయసుల మహిళలకు ఇష్టమైన బ్యూటీ ప్రొడక్ట్. వీటి సహాయంతో వారు తమ చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతారు.

రోజ్ వాటర్ ఉపయోగాలు

రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. రాత్రి పడుకునే ముందు దీన్ని అప్లై చేయడం వల్ల ముఖంపై మెరుపు వస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ముఖంపై రోజ్ వాటర్ నీటిని ఉపయోగించడం వల్ల చర్మానికి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. కానీ మార్కెట్ లో దొరికే కెమికల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ తో తయారు చేసిన రోజ్ వాటర్ ను మహిళ ముఖంపై వాడితే ఆమె చర్మానికి ప్రయోజనానికి బదులు హాని కలుగుతుంది.

వాస్తవానికి మార్కెట్లో దొరికే ఇలాంటి రోజ్ వాటర్‌తో వాటి సహజ గుణాలు దాదాపుగా తొలగిపోతాయి. మీరు కూడా మీ ముఖం కాంతిని కాపాడుకోవడానికి ఇంట్లో తయారుచేసిన నిజమైన రోజ్ వాటర్ ను ఉపయోగించాలనుకుంటే, ఈ సులభమైన సౌందర్య చిట్కాలను అనుసరించండి.

రోజ్ వాటర్ ఇలా తయారు చేయండి

రోజ్ వాటర్ ఇంట్లోనే తయారు చేయడం చాలా సులువు. దీన్ని కొనాల్సిన అవసరం లేదు. తాజా గులాబీ పువ్వులను తీసుకుని అందులోని గులాబీ రేకులను విడదీయాలి. వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. ఇప్పుడు ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు, గులాబీ ఆకులు వేసి తక్కువ మంట మీద మూతపెట్టి ఒక గంటసేపు మరిగించాలి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక గంట తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నీళ్లు చల్లారనివ్వాలి. దీని తరువాత, జల్లెడతో నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఈ నీటిని స్ప్రే బాటిల్ లో వేయాలి. ఇంట్లో సేంద్రీయ పద్ధతిలో తయారుచేసిన రోజ్ వాటర్ రెడీ అయినట్టే. మీరు దీన్ని 4-5 రోజులు ఫ్రిజ్లో నిల్వ చేయవచ్చు.

రోజ్ వాటర్ అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు

- రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంచుతుంది.

- రోజ్ వాటర్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తేమవంతంగా ఉండేలా చేస్తుంది.

- రోజ్ వాటర్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

- రోజ్ వాటర్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మం వాపును తగ్గించి లోతుగా శుభ్రపరచడంలో సహాయపడతాయి.