Facts on Tampons : పీరియడ్స్ సమయంలో టాంపోన్లను ఉపయోగించడం మంచిదేనా?
Facts on Tampons : మీరు పీరియడ్స్ సమయంలో టాంపోన్లను ఉపయోగిస్తుంటే.. మీరు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. వాటిని సురక్షితంగా ఎలా ఉపయోగించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు. ఇంతకీ టాంపోన్స్ అంటే ఏమిటి.. వాటిని ఉపయోగిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Facts on Tampons : పీరియడ్స్ సమయంలో ఋతు ప్రవాహాన్ని గ్రహించడానికి టాంపోన్స్ ఉపయోగించడం ఒక పద్ధతి. వీటిని అప్లికేటర్‌తో లేదా లేకుండా కూడా యోనిలోకి చొప్పించేలా రూపొందిస్తారు. అయితే టాంపోన్ ఒకసారి ఉపయోగిస్తే.. మళ్లీ ఉపయోగించకూడదు. మరి వీటిని ఎలా తయారు చేస్తారు. ఇవి సురక్షితమేనా? వాడితో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
టాంపోన్లు దేనితో తయారు చేస్తారంటే..
FDA-క్లియర్డ్ టాంపాన్‌లు పత్తి, రేయాన్ లేదా రెండింటి మిశ్రమంతో తయారు చేస్తారు. ప్రస్తుతం విక్రయిస్తున్న FDA-క్లియర్డ్ టాంపోన్‌లలో ఉపయోగించే శోషక ఫైబర్‌లు ఎలిమెంటల్ క్లోరిన్ లేని బ్లీచింగ్ ప్రక్రియతో తయారు చేస్తున్నారు. ఇది ఉత్పత్తులను ప్రమాదకర స్థాయిలో డయాక్సిన్ లేకుండా నిరోధిస్తుంది.
మీరు పునర్వినియోగ టాంపోన్ల గురించి విని ఉండవచ్చు కానీ.. ఇవి ఈస్ట్, ఫంగల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇన్ఫెక్షన్లను, అదనపు ప్రమాదాలను కలిగి ఉండవచ్చు. అందుకే వీటిని FDA ఆమోదించలేదు. FDAచే ఆమోదించిన టాంపోన్లు కేవలం ఒక్కసారే ఉపయోగించేవిగా రూపొందించారు.
టాంపోన్ ఉపయోగించే వీటిని గుర్తించుకోండి..
టాంపోన్‌లు మీకు సరైనవా కాదా అనే దాని గురించి మీరు మీ వైద్యుడిని కలిసి తెలుసుకోవచ్చు. అయితే మీరు టాంపోన్లను ఉపయోగిస్తుంటే.. కొన్నింటిని కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
* లేబుల్‌లో ఇచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. మీరు ఇంతకు ముందు టాంపోన్లను ఉపయోగించినప్పటికీ.. ప్యాకేజీలోని సూచనలను మరోసారి చదవండి.
* టాంపోన్ ఉపయోగించే ముందు, తరువాత మీ చేతులను శుభ్రంగా కడగండి. ఇది బ్యాక్టీరియా వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
* మీరు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే టాంపోన్‌లను ఉపయోగించండి. మరే ఇతర సమయంలోనూ.. లేదా మరే ఇతర కారణాలతో వాటిని ఉపయోగించకూడదు.
* ప్రతి టాంపోన్‌ను 4 నుంచి 8 గంటలకు మార్చండి. 8 గంటల కంటే ఎక్కువసేపు ఒక్క టాంపోన్‌ను కూడా ఉంచుకోవద్దు.
* అవసరమైన అత్యల్ప శోషణ టాంపోన్ ఉపయోగించండి. మీరు దానిని మార్చకుండా ఎనిమిది గంటల వరకు ఒక టాంపోన్ ధరించగలిగితే.. శోషణ చాలా ఎక్కువగా ఉంటుంది.
* మీకు నొప్పి, జ్వరం లేదా ఇతర అసాధారణ లక్షణాలు ఉంటే.. మీరు వెంటనే వైద్యుని సంప్రదించండి.
* మీకు అసౌకర్యం, నొప్పి లేదా టాంపోన్‌ను చొప్పించడానికి లేదా ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అసాధారణమైన, ఊహించని లక్షణాలు ఉంటే లేదా మీకు అలెర్జీ ప్రతిచర్య ఉంటే.. వెంటనే టాంపోన్‌లను ఉపయోగించడం ఆపివేయండి.
* పీరియడ్స్ సమయంలో సెక్స్‌లో పాల్గొంటే.. కచ్చితంగా టాంపోన్లను తీసివేయండి.
టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) అరుదైనది. కొన్ని రకాల బాక్టీరియా ద్వారా ఉత్పత్తి అయిన ఒక విష పదార్థం వలన వస్తుంది. బాక్టీరియా ఉత్పత్తి చేసే విష పదార్ధం అవయవ నష్టం (మూత్రపిండాలు, గుండె మరియు కాలేయ వైఫల్యంతో సహా).. షాక్ మరియు మరణానికి కూడా కారణమవుతుంది. ఇవి టాంపోన్లను ఉపయోగించడం వల్ల గణనీయంగా తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి.
సంబంధిత కథనం