Fact Check: రూ. 1000 కాయిన్‌.. కావాలంటే రూ. 5000 పైగా చెల్లించాల్సిందే!-fact check nofakenewsonrbilaunchesrs1000coin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Fact Check No-fake-news-on-rbi-launches-rs-1000-coin

Fact Check: రూ. 1000 కాయిన్‌.. కావాలంటే రూ. 5000 పైగా చెల్లించాల్సిందే!

HT Telugu Desk HT Telugu
Mar 18, 2022 02:15 PM IST

కొంత మంది 1000 రూపాయల నాణెంతో ఉన్న ఫోటోతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. నిజానికి 1000 రూపాయల నాణేం విడులైందా.. ఇది ఎంత వరకు నిజమని చూడగా.. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

one thousand rupee coin
one thousand rupee coin

1000 రూపాయల నాణేన్ని ఆర్‌బీఐ విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలంటూ కొంత మంది 1000 రూపాయల నాణెంతో ఉన్న ఫోటోతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. నిజానికి 1000 రూపాయల నాణేం విడుదల అయిందా.. ఇది ఎంత వరకు నిజమని చూడగా.. పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అయితే ఆర్‌బీఐ రూ.1000 నాణాన్ని విడుదల చేసినప్పటికీ... ఈ నాణేలకు చట్టపరమైన విలువ లేదు. ఇది సేకరణకు మాత్రమే ఉపయోగపడుతుంది.

Fact check: మెుదటిగా ఆర్‌బీఐ ప్రెస్‌ రిలీజ్‌ సెక్షన్‌ను పరిశీలించగా కొత్త 1000 రూపాయల నాణెం విడుదల కాలేదని తేలింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక ది హిందు కథనం ప్రకారం.. ఆర్‌బీఐ 2010లో రూ.1000 స్మారక నాణేన్ని విడుదల చేసిందని వెల్లడైంది. తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరుడి ప్రసిద్ధ అలయం వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా RBI దీనిని విడుదల చేసినట్లు పత్రిక తెలిపింది.  అలాగే పూరీజగన్నాథ రథయాత్రకు వెయ్యి ఏళ్ళు అయిన సందర్భంగా ఇటీవల పూరీ జగన్నాథుని చిత్రంతో ఈ కాయిన్‌ను మరో సారి విడుదల చేసినట్లు సమాచారం కానీ ఇది చట్టబద్ధమైన టెండర్ కాదు. 

80 శాతం వెండి, 20 శాతం రాగి మిశ్రమంతో ఈ 1000 రూపాయల నాణెం తయారు చేయబడింది. నాణెం బరువు 35 గ్రాములు. ఈ నాణెం ముందు భాగంలో అశోక స్థంభం, వెనుక బృహదీశ్వర శివాలయం చిత్రం చెక్కబడి ఉన్నాయి. దీన్ని ముంబై మింట్‌లో ముద్రించారు. సాధరణంగా ఇలాంటి స్మారక నాణేలను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది. వాటిని చట్టబద్ధమైన టెండర్‌గా పరిగణించదు. వాటికి చట్టపరమైన విలువ కూడా ఉండదు. ఈ స్మారక నాణేలు సేకరణకు మాత్రమే ఉపయోగపడుతాయి. ఇవి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వాటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఈ 1000 రూపాయల నాణెం ఖరీదు రూ. 5 వేల పైగా  ఉంటుంది. చివరిగా 1000 రూపాయల స్మారక నాణాన్ని విడుదల అయినప్పటికి... దీనికి ఎలాంటి చట్టపరమైన విలువ లేదు. ఇది సేకరణ కోసం మాత్రమే ఉంచబడింది తేలింది

WhatsApp channel