Raw Milk Facepack: పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే ముఖం అద్దంలా మెరిసిపోవాలంతే! ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా?
Raw Milk Facepack: ఫేస్ ప్యాక్ చాలా ఒరిజినల్‌గా ఉండాలని అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం! చర్మానికి ఎంతో మేలు కలిగించే పచ్చిపాలతో ఫేస్ ప్యాక్ వేసేసుకోండి. అద్దంలా మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోండి. చాలా సింపుల్‌గా ఫేస్ ప్యాక్ తయారీ విధానం తెలుసుకుందాం రండి.
ఏ వాతావరణంలోనైనా, చర్మానికి సంరక్షణ చాలా అవసరం. మీ చర్మాన్ని యథావిధిగా అలా ఉంచేస్తే, కాలుష్యం పెరిగిన వాతావరణంలో తిరగడం కారణంగా మీకు ముందుగానే వృద్ధాప్యం వచ్చేయొచ్చు. ఇందుకోసం చర్మాన్ని కాపాడుకోవాలంటే ఏమైనా క్రీములో, లేదా సహజమైన పదార్థాలను వాడుతుండాలి. మీకు మార్కెట్లో దొరికే కెమికల్స్‌తో కూడిన క్రీములు వాడటం ఇష్టం లేకపోతే ఇంట్లోనే సహజంగా దొరికే పదార్థాలను ఉపయోగించి చర్మానికి సంరక్షణ కల్పించుకోవచ్చు. స్వచ్ఛమైన పచ్చిపాలతో చేసుకునే ఫేస్ ప్యాక్ అయితే ఇంకా బెటర్.

పచ్చి పాలు చర్మానికి చాలా మంచివి. దీనితో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఎండిపోయినట్లుగా ఉండి, నిర్జీవంగా కనిపిస్తున్న చర్మం గలవారికి ఇది చాలా మంచిది, ఎందుకంటే పచ్చి పాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. మెరిసే చర్మం కావాలనుకుంటే, ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
పచ్చి పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి అవసరమైనవి
- 2 చెంచాల కచ్చి పాలు
- అర చిన్న చెంచా పసుపు పొడి
- ఒక చెంచా చక్కెర
- కాఫీ పొడి
- గోధుమ పిండి
ఈ ఫేస్ ప్యాక్ తయారీ విధానం
- ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ముందుగా ఒక గిన్నెలో పచ్చి పాలు తీసుకోండి. అందులో పసుపుకొమ్ముల నుంచి తీసిన ఒరిజినల్ పసుపు అర చెంచా, ఒక చెంచా చక్కెర వేసి కలుపుకోండి.
- మిశ్రమాన్ని బాగా తిప్పుకుంటూ చక్కెర కరిగిపోయిందని కన్ఫమ్ చేసుకోండి. ఇప్పుడు అందులో కాఫీ, గోధుమ పిండి వేసి బాగా కలపండి.
- కాస్త ఎక్కువసేపు తిప్పడం వల్ల బాగా కలిసి మిశ్రమాన్ని గట్టి పేస్ట్‌లా మారుతుంది.
- దీనిని నీటితో శుభ్రం చేసుకుని తుడుచుకున్న ముఖంపై అప్లై చేయండి.
- ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మర్చిపోకండి. చర్మంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ప్యాక్ వేసుకోండి.
ఈ ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి
- స్వచ్ఛమైన పాలతో తయారు చేసుకున్న పచ్చిపాల ప్యాక్ వేసుకునే సమయంలోనూ అదే విధంగా పాటించాలి.
- ఈ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోండి.
- నీటితో కడిగి తుడుచుకున్న మొఖంపై ఫేస్ ప్యాక్‌ను మందంగా పట్టించండి. సున్నితంగా రుద్దుతూ మొఖం అంతా ఒకేవిధంగా అప్లై చేసుకోండి.
- అలా వేసుకున్న ఫేస్ ప్యాక్‌ను ముఖంపై కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచుకోండి.
- ఆ తర్వాత ఫేస్ ప్యాక్ క్లీన్ చేసుకోవాలనుకుంటున్న సమయంలో ముందుగా మొఖంపై కాస్త నీళ్లు చల్లుకోండి. ఆ తర్వాత మీ చేతి వేళ్లతో మెల్లగా రుద్దండి.
- ఎక్కువగా రుద్దితే చర్మానికి హాని కలుగుతుందని మరువద్దు. బాగా రుద్దిన తర్వాత, వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది. ఇప్పుడు చర్మాన్ని సున్నితమైన వస్త్రంతో అద్దినట్లుగా తుడుచుకోండి.
- ఇలా క్రమం తప్పకుండా చర్మంపై ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉండటం వల్ల కాంతివంతమైన మొఖం మీ సొంతమవుతుంది. అతి త్వరలోనే మీ మొఖం తళుకులీనుతూ, అద్దంలా మెరిసిపోతుంది.
సంబంధిత కథనం