Eye Health Tips: రోజూ మీరు వేసుకునే మాత్రలు మీ కంటి ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో తెలుసా?
కన్ను మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. కంటి ద్వారానే మనం అన్నీ చూడగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అటువంటి కంటి ఆరోగ్యాన్ని తెలియకుండానే మీరే నాశనం చేసుకుంటున్నారని మీకు తెలుసా? అవును.. రోజూ మీరు వేసుకునే రకరకాల మాత్రలు కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎలాగో తెలుసుకుందాం రండి..

మన దైనందిన జీవితంలో మన కళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. మంచి దృష్టిని కాపాడుకోవడానికి, దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మీరు మీ కంటిని మీరు ప్రత్యక్షంగా జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండచ్చు. కానీ పరోక్షంగా మీకు తెలియకుండానే మీరే నాశనం చేస్తున్నారు కూడా. అవును.. ఇతర ఆరోగ్య సమస్యల పేరుతో మీరు ప్రతి రోజూ వేసుకునే రకరకాల మాత్రలు మీ కంటి ఆరోగ్యంపై చెడు ప్రభావం చేపుతాయని మీకు తెలుసా? మధుమేహం, బరువు తగ్గడం, రక్తపోటు, మానసిక ఆరోగ్య సమస్యలతో సహా ఇతర సమస్యలకు తీసుకునే అనేక మందులు కంటి ఆరోగ్యానికి ప్రతికూలంగా ఉంటాయి. వివరంగా తెలుసుకుందాం రండి..
అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
మీరు బరువు తగ్గడానికి లేదా డయాబెటిస్ నియంత్రణ కోసం సెమాగ్లుటైడ్ లేదా టిర్జెపాటిడ్ మందులు తీసుకుంటుంటే, అది మీ దృష్టిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణుల బృందం తెలిపింది. ఒక కొత్త అధ్యయనం ప్రకారం, నేత్రవైద్యుల బృందం ఈ మందులతో సంబంధం ఉన్న కంటి సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేసింది, వీటిలో ఓజెంపిక్, వెగోవి, మోంజారో, జెప్బౌండ్ ఉన్నాయి.
ఈ మందులను వేసుకోవడం ప్రారంభించిన తరువాత రోగులు తీవ్రమైన దృష్టి సమస్యలను ఎదుర్కొన్నట్లుగా తొమ్మిది కేసులను పరిశోధకులు గుర్తించారు. వారిలో ఏడుగురు నాన్-ఆర్టెరియల్ ఆంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతిగా పిలిచే పరిస్థితితో బాధపడుతున్నారు, ఇది ఆప్టిక్ నరాలకి రక్త ప్రవాహం తగ్గడం వల్ల సంభవిస్తుంది. దృష్టి నష్టానికి దారితీస్తుంది.
మందులు కంటిపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయి:
దృష్టి సమస్య - వేగంగా బరువు తగ్గడానికి లేదా రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు ఉపయోగించే మందులు కంటి లెన్స్లో మార్పులకు కారణమయ్యి దృష్టి మసకబారేందుకు దోహదపడతాయి.
డయాబెటిక్ రెటినోపతి అధిక ప్రమాదం - రక్తంలో చక్కెరలో వేగవంతమైన మెరుగుదలకు ఉపయోగించే మెడిసిన్ కొన్నిసార్లు ఇప్పటికే ఉన్న డయాబెటిక్ రెటినోపతిని స్థిరీకరించడానికి బదులుగా మరింత అధ్వాన్నంగా మార్చేసే అవకాశాలున్నాయి.
కంటికి దుష్ప్రభావాలు: సెమాగ్లుటైడ్ (ఓజెంపిక్, వెగోవి) - కొన్ని మందుల వినియోగదారులు అస్పష్టమైన దృష్టి, నిర్జలీకరణం లేదా కంటి ఒత్తిడి వంటి సమస్యలకు కారణమవుతాయి.
ఇన్సులిన్ సర్దుబాటు - రక్తంలో చక్కెరలో వేగవంతమైన మార్పులు కంటి లెన్స్లో వాపుకు కారణమవుతాయి, ఇది తాత్కాలిక దృష్టి సమస్యలకు దారితీస్తుంది.
కంటి నరాలు ఆరోగ్యం-కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రక్తంలో చక్కెరను, ఆకలిని నియంత్రించడానికి గట్ హార్మోన్లను అనుకరించడం కోసం ఉపయోగించే సెమాగ్లుటైడ్, టిర్జెపాటిడ్ వంటివి వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా ఆప్టిక్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
ఏమి చేయాలి?
మీరు సెమాగ్లుటైడ్ లేదా టిర్జెపాటిడ్ వంటి మందులను రోజూ తీసుకుంటుంటే, మీలో అస్పష్టమైన దృష్టి లేదా దృష్టి కోల్పోవడం వంటి ఆకస్మిక మార్పులను గమనించండి. వీలైనంత త్వరగా కంటి నిపుణుడిని సందర్శించండి, తగిన మందులు లేదా కళ్లజోడుని తీసుకోండి.
ప్రస్తుతానికి, ఈ అధ్యయనం ఒక మేల్కొలుపు మాత్రమే, అయితే ఈ మందులు తీవ్రమైన కంటి ప్రమాదాన్ని పెంచుతాయో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. అయితే, మీరు ఈ మందులను రోజూ తీసుకుంటుంటే తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం మర్చిపోకండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం