దక్షిణ భారతదేశంలో కావాల్సినన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. మర పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అద్భుతాలు చూడొచ్చు. మీరు ఈసారి ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే.. దక్షిణ భారతదేశంలో అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రకృతి అందాలతో అనేక సరస్సులు, జలపాతాలు, చెరువులు, నదులు కనిపిస్తాయి. జులైలో ప్రయాణించాలనుకుంటే.. ఈ 5 ప్రదేశాల గురించి చూడండి.
1. చిక్కమగళూరు అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి జులై నెల ఉత్తమ సమయం. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, కొండలు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ మాసంలో కురిసే వర్షం కాఫీ, తడి నేల వాసనను వెదజల్లుతుంది.
2. దక్షిణ భారతదేశంలో తప్పకుండా చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ఒకటైన దండేలి సాహసంతో నిండి ఉంటుంది. ఉత్తర కర్ణాటకలోని ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింగ్, జంగిల్ సఫారీలు, వర్షంలో అడవులను చూడవచ్చు.
3. వర్షాకాలంలో కర్ణాటకలోని కబిని వన్యప్రాణుల అభయారణ్యం అందంగా మారుతుంది. ఈ సమయంలో కబిని నది ఉప్పొంగుతుంది. అడవులు పచ్చగా మారతాయి. చెట్ల మధ్య పొగమంచు, ఉదయం వచ్చే సూర్యకిరణాలు అందాన్ని మరింత పెంచుతాయి.
4. తమిళనాడు అనమలై కొండల్లో ఉన్న వాల్పరై ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం. వర్షాకాలంలో ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఎమరాల్డ్ తేయాకు తోటలు, వన్యప్రాణుల అభయారణ్యం కనిపిస్తాయి.
5. ఊటీ తమిళనాడులోని నీలగిరి కొండలలో ఉన్న ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది సహజ సౌందర్యానికి, చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. జులై నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది.