Excercises for Heart: గుండెను పదిలంగా ఉంచుకోవడానికి రోజుకు 10 నిమిషాలు వ్యాయామం చేస్తే చాలు! అవేంటో తెలుసా?
Exercises for Heart: గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనసును అదుపులో ఉంచుకుని డైట్ కంట్రోల్ చేసుకోవడం ముఖ్యమే. కానీ, దాంతోపాటుగా శరీరానికి సరైన వ్యాయామం చేయడం కూడా తప్పనిసరి. వీటి కోసం మీరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి రోజూ కనీసం 10 నిమిషాలు చేస్తే సరిపోయే వ్యాయామాలేంటో తెలుసుకుందాం.

జీవనశైలిలో కలుగుతున్న మార్పుల కారణంగా చాలా మందిలో అనారోగ్యానికి గురవుతున్నారు. వీటిల్లో ప్రధానంగా చెప్పాలంటే గుండెనొప్పితో ఎక్కువ మంది సతమతమవుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్యకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి కారణం కేవలం ఆహారంలో మార్పులు మాత్రమే కాకుండా ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ప్రభావితం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. అటువంటి ప్రమాదాల నివారణకు గుండెకు సంబంధించిన వ్యాయామాలు తప్పనిసరి అని సూచిస్తున్నారు. అయితే, చాలా మంది జిమ్‌కో లేదా పార్క్‌కో వెళ్లే సమయం లేదని వ్యాయామం చేయడాన్ని వాయిదా వేస్తుంటారు. అటువంటి వారికి ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో ఉండే చేసుకునే వ్యాయామాలు మీ కోసం..
రోప్ జంపింగ్‌ను మీ రోజువారీ కార్యక్రమంలో చేర్చండి
రోప్ జంపింగ్ (రోప్ స్కిప్పింగ్) మీ శరీరానికి చాలా ప్రయోజనం చేకూర్చే వ్యాయామం. స్కిప్పింగ్ రోప్ తప్ప మరే ఇతర సామాగ్రి అవసరం లేకుండానే ఈ వ్యాయామం కొనసాగించవచ్చు. రోజూ పది నుండి పదిహేను నిమిషాలు రోప్ జంపింగ్ చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోప్ జంపింగ్ చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి హార్ట్ రేట్ వేగంగా పెరుగుతుందట. ఫలితంగా మీ గుండె మాత్రమే కాదు, మీ మొత్తం ఫిట్‌నెస్‌కు ఇది కంప్లీట్ ఎక్సర్‌సైజ్.
మెట్లు ఎక్కడం- దిగడం
ఎక్కువగా ఏమీ చేయాలని అనిపించకపోయినా, మీరు వ్యాయామం చేస్తున్నట్లు ఇతరులకు తెలియకూడదని అనుకున్నా ఇంటి మెట్లు ఎక్కడం-దిగడం వంటి పనులు చేస్తుండండి. ఇది చేయడానికి ఎటువంటి సాధనాలు లేదా సామాగ్రి అవసరం లేదు. రోజుకు పది నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుందట. హార్ట్ రేట్ వేగంగా పెరగడంతో పాటు సహనశక్తి పెరుగుతుంది. కాళ్ళ కండరాలు కూడా బలపడతాయి. మొత్తం ఫిట్‌నెస్‌కు కూడా ఇది సులభమైన కార్యక్రమంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.
హై నీస్ కూడా ఒక పరిపూర్ణ వ్యాయామం
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, మీరు ఇంట్లోనే హై నీస్ వ్యాయామాన్ని చేయవచ్చు. హై నీస్ అంటే నిటారుగా నిలబడి, మీ ఒక మోకాలిని మీరు ఎంత ఎత్తుకు ఎత్తగలరో అంత ఎత్తుకు ఎత్తాలి. రెండు మోకాళ్లతో ఇలా దాదాపు ఒక నిమిషం పాటు చేయండి. ఇలాంటి సెట్స్ దాదాపు ఎనిమిది నుండి పది వరకూ చేయవచ్చు. మీరు రోజుకు నాలుగు సెట్ల చొప్పున రెండు భాగాలుగా ఇలా చేయడం ద్వారా సులభంగా కొనసాగించవచ్చు.
డాన్స్ చేయండి
వ్యాయామం చేయడం కొన్నిసార్లు చాలా బోరింగ్‌గా అనిపించవచ్చు. అలాంటి సమయంలో ఏమీ చేయాలని అనిపించకపోతే, రూం డోర్ మూసుకుని ఇష్టమైన సంగీతం వినండి. దానికి తగ్గట్లుగా, మీకు వచ్చినట్లుగా, నచ్చినట్లుగా స్పెప్పులు వేస్తూ ఎంజాయ్ చేయండి. ఇలా అరగంట పాటు చేసినా కూడా మీ గుండెకు ఆరోగ్యకరమే. అంతేకాకుండా మొత్తం శరీరానికి ఫిట్‌నెస్ దక్కుతుంది. ఇది చాలదనుకుంటే, ఆన్‌లైన్ జుంబా తరగతులను కూడా చేరవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
జంపింగ్ జాక్
ప్రతి ఒక్కరూ మీ చిన్నతనంలో ఈ ఆహ్లాదకరమైన వ్యాయామాన్ని చేసే ఉంటారు. పాఠశాలలో పిటి సమయంలో చేసిన ఈ సులువైన వ్యాయామం గుండెకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. మీకు తెలుసు. ఈ వ్యాయామం కోసం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఎటువంటి సామాగ్రి అవసరం లేకుండా, కాస్త ఖాళీ ప్రదేశం ఏర్పాటు చేసుకుని అక్కడ చేతులను పైకి లేపి దూకడం ప్రారంభించండి. 30-30 సెకన్ల సెట్లు చేసి, రోజూ దాదాపు ఐదు నుండి ఏడు సెట్లు చేయడానికి ప్రయత్నించండి.
సంబంధిత కథనం