Oversleeping Effects: అతిగా నిద్రపోవడం కూడా తప్పేనట! ఐదు రకాల వ్యాధులకు కారణమవుతుందట!
Oversleeping Effects: నిద్రసరిగ్గా లేకపోతే ఆరోగ్యానికి మంచిది కాదని, ఒత్తిడి, గుండెపోటు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని మనందరికీ తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిద్రలేకపోకవడం వల్ల మాత్రమే కాదు అతిగా నిద్రపోవడం కూడా ముప్పేనట!
కంటికి సరిపడా నిద్రపోవడం ఎంత ముఖ్యమో సమయానికి మించి నిద్రపోవడం కూడా పలు అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందట. అంటే కనీసం నిద్రించాల్సిన సమయం కంటే, అంటే 9గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారిలో ప్రమాదకరమైన సమస్యలు వస్తున్నాయని తెలిసింది. ఈ మార్పు వెంటనే కనిపించకపోయినా దీర్ఘకాలంలో పలు ప్రమాదాలకు దారి తీస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి.
మధుమేహం వచ్చే ప్రమాదం:
నిద్రా సమయం ఎక్కువ అయితే శరీరంలోని సిర్కాడియన్ రిథమ్ లో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. ఈ మార్పుల వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదముందట.
ఊబకాయానికి దారి తీసే అవకాశముంది:
మీరు ఫిట్ గా ఉన్నారని ఫీల్ అయి నిద్రపోయినా ప్రమాదమేమీలేదని నిర్లక్ష్యం వహించారో.. పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ఇది రెగ్యూలర్ జీవనశైలిపై ప్రభావం చూపిస్తుంది. నిద్రపోయే సమయం పెరగడం వల్ల హార్మోన్ల నియంత్రణపై అంతరాయం కలుగుతుంది. ఆకలి, సంతృప్తి లాంటి పనులకు బాధ్యత వహించే హార్మోన్లపై నియంత్రణ లేకపోవడంతో అతిగా తినేస్తుంటారు.
డిప్రెషన్‌కు కారణం:
అధిక నిద్ర వల్ల కలిగే లక్షణాల్లో ప్రధానమైనది డిప్రెషన్. మీరు గమనిస్తే అతిగా నిద్రపోయే వారు ఎక్కువగా డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు. అంతేకాకుండా పలు మానసిక రుగ్మతలతో బతికేస్తుంటారు. వీరిలో బద్ధకం, తక్కువ ప్రేరణ కనిపిస్తుంటాయి.
గుండె జబ్బులు వచ్చే ప్రమాదం:
అతిగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. రక్తపోటు నియంత్రణపై పట్టు కోల్పోవడంతో పాటు శరీరంలో కొవ్వు శాతాన్ని పెరిగేలా చేస్తుంది. ఫలితంగా హృదయనాళ వ్యవస్తపై అనవసరమైన ఒత్తిడి కనపడుతుంది.
నొప్పులు లేదా కంఫర్ట్ లేకపోవడం:
ఎక్కువసేపు మంచం మీదే పడుకొని ఉండటం వల్ల వెన్నునొప్పి, మెడ బిగుసుకుపోవడం వంటి కలుగుతుండొచ్చు. వీటితో పాటుగా తలనొప్పి, శారీరక అసౌకర్యానికి దారి తీస్తుంది. అతినిద్ర వల్ల కండరాలు, కీళ్లపై అధిక ఒత్తిడి కలుగుతుంది.
ఎక్కువసేపు నిద్ర కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు:
ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోయే, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. ఇది శరీరానికి బయోలాజికల్ సిస్టమ్‌ను సెట్ చేస్తుంది. తద్వారా నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఎక్కువ సేపు నిద్రపోవడం తగ్గించవచ్చు.
రోజులో ఎక్కువ కాఫీ లేదా చాయ్:
కాఫీ, చాయ్, సోడా లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి కేఫెయిన్ ఉన్న డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వలన రాత్రిపూట నిద్ర పోవడం కష్టతరమవుతుంది. కాబట్టి, ఈ పానీయాలను రాత్రి సమయానికి తగ్గించి, రోజులో మధ్యాహ్నం లేదా ఉదయం మాత్రమే తీసుకోండి.
రాత్రి సమయంలో భోజనం ఎక్కువగా చేయొద్దు:
రాత్రి సమయంలో ఎక్కువగా మాంసాహార భోజనం చేయడం నిషిద్దం. నిద్రలో గందరగోళం, ఇన్సొమ్నియా వంటి సమస్యలకు కారణమవుతుంది. రాత్రి సమయానికీ తేలికైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
రాత్రిపూట వెలుతురు తగ్గించండి:
లైట్లు, స్క్రీన్ నుంచి వచ్చే కాంతులు నిద్రకు సంబంధించిన హార్మోన్ మెలటోనిన్ ను తగ్గించవచ్చు. కాబట్టి, రాత్రిపూట కాంతిని తగ్గించి, మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను కనీసం 30 నిమిషాల ముందు ఆఫ్ చేయడం మంచిది.
శారీరక వ్యాయామం చేయండి:
రోజు కొంత వ్యాయామం చేయడం, ఉదాహరణకు సాయంత్రం వేళ జాగింగ్, వాకింగ్ లేదా యోగా ద్వారా శరీరంలో శక్తిని పెంచుకోవచ్చు. ఇది రాత్రిపూట నిద్ర వచ్చేలా చేయడానికి సహాయపడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్