Lord Rama Qualities : రాముడిలోని ఈ గుణాలు.. తమ భర్తలోనూ ఉండాలని స్త్రీ కోరుకుంటుంది-every woman wants to this type lord ayodhya rama qualities in her partner ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lord Rama Qualities : రాముడిలోని ఈ గుణాలు.. తమ భర్తలోనూ ఉండాలని స్త్రీ కోరుకుంటుంది

Lord Rama Qualities : రాముడిలోని ఈ గుణాలు.. తమ భర్తలోనూ ఉండాలని స్త్రీ కోరుకుంటుంది

Anand Sai HT Telugu
Jan 14, 2024 09:30 AM IST

Lord Rama Qualities : అయోధ్య రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ స్త్రీ రాముడిలాంటి గుణాలు ఉన్న భర్త రావాలని కోరుకుంటుంది. భర్తలో మహిళలు కోరుకునే ఆ లక్షణాలు ఏంటో చూద్దాం..

అయోధ్య రాముడు
అయోధ్య రాముడు

దేశం మెుత్తం అయోధ్య గురించి మాట్లాడుకుంటుంది. రాముడి ప్రతిష్టాపనకు సమయం దగ్గర పడుతుంది. అయోధ్యలోని గొప్ప రాజభవనంలో శ్రీరాముడిని స్వాగతించడానికి దేశం మెుత్తం ఎదురుచూస్తోంది. అయితే ప్రతీ స్త్రీ కచ్చితంగా రాముడిలాంటి భర్త రావాలని కోరుకుంటుంది. పెద్దలు కూడా రాముడిలాంటి భర్త రావాలని చెబుతుంటారు. భారతదేశంలో రాముడి ప్రస్తావన లేకుండా ఉండదు. ఆయన సుగుణాల గురించి ఎన్నో పాటలు. ప్రతీ స్త్రీ తన జీవిత భాగస్వామికి శ్రీరాముడి వంటి 5 లక్షణాలు ఉండాలని కోరుకుంటుంది. ఆ గుణాలు ఏంటో తెలుసుకుందాం..

జనవరి 22న అయోధ్యలోని తన మహా భవనంలో శ్రీరాముడు సింహాసనాన్ని అధిష్టించనున్నారు. ఆ రోజున ప్రాణప్రతిష్ట జరగనుంది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి శ్రీరాముడు ఆదర్శం. రాముడు, సీతా మాత వైవాహిక జీవితం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకరికోసం ఒకరు నిలబడిన తీరు అద్భుతం. బంధుత్వాల్లో దూరం పెరగడం, ద్వేషం పెరగడం ఈ రోజుల్లో సర్వసాధారణం. శ్రీరాముడు, తల్లి సీత వివాహిత జంటకు అనేక పాఠాలు నేర్పుతుంది. నేటికీ చాలా మంది స్త్రీలు జీవిత భాగస్వామి విషయానికి వస్తే రాముడి పేరును తీస్తారు.

శ్రీరాముడు విష్ణువు అవతారం. అయినప్పటికీ ఆయన కర్మకు అనుగుణంగా శివుడి భారీ విల్లులను విరిచి.. సీతను పెళ్లి చేసుకున్నాడు. మీరు ఎంత ఉన్నత స్థాయి వ్యక్తి అయినా భార్యకు నిరంతర మద్దతు అవసరం. భార్య నమ్మకం గెలుచుకోవడం తప్పనిసరి. ఇలా అయితేనే ఆమె హృదయం, విశ్వాసం రెండింటినీ గెలుచుకుంటారు. రాముడు హృదయాలను, నమ్మకాలను గెలుచుకున్నాడు.

శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు తనతో రావద్దని తల్లి సీతకు చెప్పాడు. కానీ సీత నిరాకరించినప్పుడు రాముడు తన భార్య సంతోషం కోసం ఆలోచించాడు. సీత త్యాగాన్ని పూర్తిగా అభినందించడానికి ప్రయత్నించాడు. ఈ గుణాన్ని ప్రతి పురుషుడు అనుసరించాలి. ఎందుకంటే ఒక స్త్రీ పుట్టింటిలోని సంతోషాన్ని, శాంతిని వదిలేసి కేవలం మీకోసం మాత్రమే వస్తుంది. మీ జీవితంలో చేరేందుకు అన్నింటిని వదిలివేస్తుంది. ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత.

ఆదర్శ పురుషుడు తన భాగస్వామిని అర్థం చేసుకుని, ఆమె కోరికలు, కలలను నెరవేర్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అజ్ఞాతవాసానికి రాముడితో పాటు వెళ్లాలనే కోరిక అయినా, బంగారు జింకను అడవిలో పొందాలనే కోరిక అయినా, శ్రీరాముడు ప్రతి క్షణం సీతను అర్థం చేసుకున్నాడు. ప్రతీ మగాడు తన భార్యను అర్థం చేసుకోవాలి.

సహనం అనేది ఏ బంధంలోనైనా చాలా ముఖ్యమైన విషయం. తొందరపాటు అనేది దయ్యంలాంటిదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. చాలా సార్లు మనం తొందరపాటుతో ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఇది మొత్తం సంబంధాన్ని పాడు చేస్తుంది. కైకేయి కోరిక మేరకు, రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రాముడి సహనం సీతను అతనితో పాటు వచ్చేలా చేసింది.

రాముడిలా మీరు మరింత ఉదారమైన, దయగల స్వభావం కలిగి ఉంటే , ఆమెను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మంచి భర్తగా ఉండగలరు. సీతను తీసుకురావడానికి మొత్తం వానర సైన్యంతో భుజం భుజం కలిపి నడిచాడు. ప్రతి స్త్రీ అలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటుంది. భార్య కోసం ఎంతటి యుద్ధమైనా చేసేందుకు భర్త సిద్ధంగా ఉండాలి. రాజు అయ్యాక కూడా రాముడిలో అహం లేదు. మీరు కూడా అహం లేకుండా బతకాలి.

Whats_app_banner