Soya Chuncks Dry Curry: మీల్‌మేకర్లతో కరకరలాడే కర్రీ ఎప్పుడైనా చేశారా? ఇదిగోండి రెసిపీ ఇలా చేస్తే క్రంచీగా భలే ఉంటుంది
Soya Chuncks Dry Curry: మీల్‌మేకర్లతో గ్రేవీ కూరను మీరు చాలా సార్లు చేసుకుని ఉంటారు. కానీ కరకరలాడే, క్రంచీ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ లేకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి. మీల్‌మేకర్ డ్రై కర్రీ రెసిపీ అన్నం, చపాతీలు, పరోటాలు అన్నింటిలోకి బాగా సెట్ అవుతోంది.

ప్రోటీన్లకు మూలమైన మీల్‌మేకర్లను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. పోషకాల్లోనే కాదు రుచిలో కూడా సోయా చంక్స్ ఏం తక్కువ చేయవు. అయితే ఇప్పటి వరకూ మీరు మీల్ మేకర్లతో ఒకే రకమైన గ్రేవీ కూరతో విసిగిపోయి ఉంటే.. వీటితో కొత్త రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఇది మీ కోసమే. కరకరలాడే మీల్‌మేకర్ డ్రై కర్రీ రెసిపీని తయారు చేసి ఇంట్లో వారికి పెట్టండి. దీని రుచి పెద్దల నుండి పిల్లల వరకు అందరికీ బాగుంటుంది. ఉదయాన్నే లంచ్ బాక్సుల్లోకి చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. సాయంత్రం లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకున్న రోటీలు, చపాతీల్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది.
సోయా చంక్స్ డ్రై కర్రీ తయారీకి కావలసినవి:
- ఒక కప్పు సోయా చంక్స్
- రెండు ఉల్లిపాయలు
- రెండు టమాటాలు
- చిన్నగా తరిగిన కొత్తిమీర
- నూనె తగినంత
- అర కప్పు పెరుగు
- రుచికి తగినంత ఉప్పు
- కొత్తిమీర పొడి
- జీలకర్ర పొడి
- ఎర్ర మిర్చి పొడి
- అల్లం-వెల్లుల్లి పేస్ట్
- ఎర్ర మిర్చి చట్నీ
- ఒక టీస్పూన్ జీలకర్ర
- ఏడు నుండి ఎనిమిది కాజులు
మీల్‌మేకర్ డ్రై కర్రీ రెసిపీ తయారీ విధానం:
-మీల్‌మేకర్ డ్రై కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో నీరు పోసి వేడి చేయాలి.
నీరు కాస్త వేడిక్కిన తర్వాత దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మీల్‌మేకర్టను వేసి ఉడికించాలి.
మీల్‌మేకర్లు నీటిలొ ఉడికే లోపు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా, పొడవుగా తరగాలి.
- వేడినీటిలో ఉడికించిన మీల్‌మేకర్లను బయటకు తీసి నీటిని వడకట్టి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో నూనె పోయండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించండి.
ఉల్లిపాయలు బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేయించి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు పెరుగు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేయండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి వేసి బాగా కలపాలి.
ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత ఉడికించి వడకట్టిన మీల్‌మేకర్లు వేసి అరగంట పాటు మెరీనేట్ చేయండి.
మీల్‌మేకర్లు చక్కగా మారినేట్ అయిన తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో నూనె పోయిండి.
నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర వేసి వేయించాలి. జీలకర్ర నూనెలో చక్కగా వేగిన తర్వాత దాంట్లో మారినేట్ చేసిన మీల్‌మేకర్ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
ఇవి నూనెలో కాసేపు వేగేంతవరకూ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఉల్లిపాయలు, కాజూలు, టమాటాలు వేసి చక్కటి పేస్టులా తయారు చేయండి.
ఈ పేస్టును నూనెలో వేగుతున్న మీల్‌మేకర్ మిశ్రమంలో వేసి చక్కగా వేయించండి. అలాగే వేడి మసాలా, కొద్దిగంటే కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర వేసి గార్నీష్ చేయండి.
అంతే రుచికరమైన డ్రై కర్రీ రెడి అయినట్టే.
సంబంధిత కథనం