Cauliflower Stems Curry: కాలీఫ్లవర్ కాడల కూర ఎప్పుడైనా తిన్నారా? రుచి చూశారంటే వాటిని ఎప్పుడూ పడేయరు, ఇదిగో రెసిపీ
Cauliflower Stems Curry: కాలీఫ్లవర్ పువ్వును మాత్రమే కూర చేసుకుని కాండాన్ని పడేస్తున్నరా? అయితే మీరు చాలా మిస్ అవుతున్నారని తెలుసుకోండి. కాలీఫ్లవర్ కాడలతో కూడా కూర చేసుకుని తినచ్చు. ఇది చాలా రుచికరం, ఆరోగ్యకరం కూడా. ఒకసారి ఈ కూరను తిన్నారంటే ఎప్పటికీ వాటిని పడేయరు. ఇదిగో రెసిపీ ట్రై చేసి చూడండి.
కాలిఫ్లవర్ కాడలను పడేయడం అంటే వాటిలోని పోషకాలను బయట పారేయడమే అని మీకు తెలుసా? అవును కాలీఫ్లవర్ కాడలను పనికిరానివిగా భావించి ప్రజలు తరచుగా విసిరేస్తారు. కానీ ఈ కాడలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. వాటిని పారవేయడం అంటే కాలీఫ్లవర్‌లోని పోషకాలను కూడా బయట పారేయడమే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. క్యాలీఫ్లవర్ పువ్వులోనే కాదు కాడల్లోనూ సరి సమానమైన పోషకాలు ఉంటాయట.
క్యాలీఫ్లవర్ పువ్వుతోనే కాకుండా కాడలతోనూ రుచికరమైన, ఆహ్లాదకరమైన కూరను రెడీ చేసుకోవచ్చు. ఇది తినేందుకు అద్భుతంగా కనిపించడమే కాకుండా పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మధుమేహం, ఆస్తమా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలీఫ్లవర్ కాండాలతో రుచికరమైన కూరగాయలను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
కాలీఫ్లవర్ కాడలతో కూర తయారుచేసే విధానం:
- తాజా క్యాలీఫ్లవర్ కాడలు
- రెండు టమోటాలు
- నిలువుగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ
- రెండు పచ్చిమిర్చి
- రెండు టీస్పూన్ల నూనె
- రుచికి తగినంత పసుపు
- అర టీస్పూన్ ధనియాల పొడి
- కారం-అల్లం పేస్ట్
- అర టీస్పూన్ ఆవాలు
కాలీఫ్లవర్ కాండం వెజిటేబుల్ రెసిపి -
- ముందుగా క్యాలీఫ్లవర్ కాడలను వేరు చేసి వాటిని కడుగుకోవాలి.
- ఆ తర్వాత వాటిని పొడవాటి ఆకారాలుగా కట్ చేసుకోవాలి. కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు గిన్నెలో నూనె వేసి ఆవాలు వేయించాలి.
- ఆవాలు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయాలి.
- ఉల్లిపాయను తరిగి ఇతర మసాలా దినుసులు వేయాలి.
- ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి.
- అందులో కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి.
- కాసేపట్లో కాడలన్నీ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు గరం మసాలా, టొమాటో గుజ్జు వేసి రెండు మూడు నిమిషాలు పాటు అలాగే ఉంచాలి.
- ఒక నిమిషం తర్వాత ఉడికిందని నిర్ధారించుకుని మంట ఆపేయాలి.
- అంతే, రుచికరమైన క్యాలీఫ్లవర్ కాడల కూర రెడీ. దీనిని పరోటా లేదా రోటీతో కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు.
కాలీఫ్లవర్ కాడల్లో ఉండే పోషకాలు:
ఫైబర్: కాలీఫ్లవర్ కాడలు విరివిగా ఫైబర్ అందిస్తాయి, ఇది జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది.
విటమిన్ C: కాలీఫ్లవర్ కాడల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అందిస్తుంది.
విటమిన్ K: కాలీఫ్లవర్ కాడలు విటమిన్ Kని కూడా అందిస్తాయి, ఇది రక్త కణాలు, ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
పొటాషియం: కాలీఫ్లవర్ కాడల్లో పోటాషియం సమృద్ధిగా ఉంటుంది. పోటాషియం రక్తపోటు నియంత్రణలో, కండరాల చురుకుదనంలో సహాయపడుతుంది.
ఫోలేట్: కాలీఫ్లవర్ కాడలు ఫోలేట్ (B9 విటమిన్)ని అందిస్తాయి. ఇది గర్భవతులకు ముఖ్యమైన పోషక పదార్థం.
మాంగనీస్: కాలీఫ్లవర్ కాడలు మాంగానీస్ కూడా అందిస్తాయి, ఇది ఎముకల ఆరోగ్యం, మెటాబోలిజం, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాల్షియం: కాలీఫ్లవర్ కాడలు తక్కువ స్థాయిలో క్యాల్షియం కూడా కలిగి ఉంటాయి. ఇది ఎముకల శక్తి, ఆరోగ్యానికి అవసరమైన పోషకంగా పనిచేస్తుంది.
మెగ్నీషియం: కాలీఫ్లవర్ కాడలు, కండరాల, నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం కూడా అందిస్తాయి.
సంబంధిత కథనం