Diabetes Causes : స్వీట్లు తినని వారికి కూడా డయాబెటీస్ వస్తుంది! ఎందుకు, ఎలాగో తెలుసా?
Diabetes Causes: స్వీట్లు తినడం మొత్తానికే మానేశాను, ఇంట్లో చక్కెర వాడటమే లేదు, అయినా షుగర్ ఎందుకు పెరుగుతుందో అర్థం కావట్లేదు! అనుకుంటున్నారా? శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడానికి స్వీట్లు మాత్రమే కారణం అనుకుంటే మీరు పొరపడినట్లే. అస్సలు స్వీట్లు తినని వారికి కూడా డయాబెటిస్ వస్తుంది. ఎలాగో చూద్దాం
ఎవరికైనా డయాబెటీస్ వచ్చిందంటే వారు స్వీట్లు ఎక్కువ తింటారెమో, ఇంట్లో చక్కెర వాడకం అధికంగా ఉంటుందేమో అని అంతా అనుకుంటారు. తీపి వల్లే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవమేంటంటే.. డయాబెటీస్ వ్యాధి ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల రాదు. డయాబెటిస్ రావడానికి ఇంకా కొన్ని ఇతర కారణాలు ఉన్నాయి, వాటి వల్ల స్వీట్లు తినని వారికి కూడా డయాబెటిస్ రావచ్చు. కానీ అలా ఎందుకు జరుగుతుంది? అని చాలా మందికి సందేహం ఉంటుంది.
స్వీట్లు తినని వారికి కూడా డయాబెటీస్ వస్తుంది?
షుగర్ వ్యాధి శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత ద్వారా పెరుగుతుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్, ఇది గ్లూకోజ్ను కణాలకు రవాణా చేస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్న వ్యక్తుల శరీరం ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించదు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. తీపి తినడానికి ఇష్టపడని లేదా చాలా తక్కువ తీపి తినే వ్యక్తుల్లో డయబెటిస్ సంభవిస్తుందని ఇది స్పష్టం చేస్తుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలి లేనివారు, ఆహారపు నియమాలను పాటించని వారిలో కూడా డయాబెటిస్ సమస్య కనిపిస్తుంది. ప్రజలు తెలిసో తెలియకో అనేక రకాల వస్తువులను తింటారు. ఇవి రుచిలో తియ్యగా ఉండవు కాని చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటాయి. దీని వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ తో పాటు శరీరంలో షుగర్ లెవల్స్ ను పెంచే అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
బియ్యం:
భారతదేశంలో అన్నం తినే వారు ఎక్కువగా ఉంటాయి. మీరు అన్నం ప్రియులే అయితే ఉదయం, రాత్రి ఎక్కువ మొత్తంలో అన్నం తింటుంటే మీకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్ కంటెంట్, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచుతుంది.
మైదా:
చాలా మంది సాయంత్రం కాగానే రకరకాల స్నాక్స్ తింటుంటారు. ఎక్కువగా స్నాక్ ఐటమ్స్ మైదాతోనే తయారవుతాయి. మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇది శరీరంలో కేలరీల పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
నీరు:
మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరానికి తగినన్ని నీళ్లు తప్పనిసరిగా తాగాలి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. రోజంతా కనీసం మూడు నుండి నాలుగు లీటర్ల నీరు త్రాగటం మూత్రపిండాలకు అదనపు చక్కెరను తొలగించడానికి సహాయపడుతుంది.
పండ్లు:
ద్రాక్షపండు, నారింజ ,మామిడి వంటి పండ్ల రసాలలో మంచి మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ పండ్లన్నీ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. కనుక డయాబెటిస్ రాకుండా ఉండాలన్నా, వచ్చింది కంట్రోల్ లో ఉండాలన్నా వీటికి తక్కువ మొత్తంలో తినడం ఉత్తమం.
స్వీట్లు తినకున్నా డయాబెటీస్ రావడానికి మరిన్ని కారకాలు:
అధికబరువు, వ్యాయామం లేని జీవిన విధానం, కార్బోహైడ్రూట్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా డయాబెటీస్ కు కరాణాలు అవుతాయి. అలాగే వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి రావచ్చు. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే వారి పిల్లలకు అది రుగ్మతిగా వచ్చే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, పొలిసిస్ఠిక్ ఓవరీ సిండ్రోబ్ వంటి ఆరోగ్య సమస్యలు కూడా డయాబెటిస్ కు కారణం అవుతాయి. వయసు పెరిగే కొద్దీ కైడా శరీరంలో ఇన్సులిన్ స్థాయిల్లో వచ్చే హెచ్చు తగ్గులు కూడా టైప్ 2 డయాబెటిస్ కి కారణం అవుతాయి.
సంబంధిత కథనం