Bhogi Special: భోగి రోజు నువ్వులతో చేసిన రుచికరమైన స్పెషల్ స్వీట్ తినండి, ఈజీ రెసిపీతో రెడీ చేసుకోండి-enjoy a delicious sweet made with sesame on bhogi day prepare it with this easy recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bhogi Special: భోగి రోజు నువ్వులతో చేసిన రుచికరమైన స్పెషల్ స్వీట్ తినండి, ఈజీ రెసిపీతో రెడీ చేసుకోండి

Bhogi Special: భోగి రోజు నువ్వులతో చేసిన రుచికరమైన స్పెషల్ స్వీట్ తినండి, ఈజీ రెసిపీతో రెడీ చేసుకోండి

Ramya Sri Marka HT Telugu
Jan 13, 2025 06:30 AM IST

Bhogi Special: సంక్రాంతి పండుగను భోగీ పండుగతో వైభవంగా మొదలుపెట్టండి. భోగి మంటలు వేసి చేదు జ్ఞాపకాలను తుడిచేయడంతో పాటు స్వీట్ తిని మీ జీవితాల్లోకి కొత్త సంతోషాలు రావాలని కోరుకోండి. ఇంకెందుకు లేటూ.. ఈ స్పెషల్ రెసిపీతో రెడీ చేసిన నువ్వుల స్వీట్ తిని భోగిని మొదలుపెట్టేయండి.

భోగి రోజు నువ్వులతో చేసిన రుచికరమైన స్పెషల్ స్వీట్ తినండి
భోగి రోజు నువ్వులతో చేసిన రుచికరమైన స్పెషల్ స్వీట్ తినండి

సంక్రాంతి సందర్భంగా నువ్వులు, బెల్లంతో తయారుచేసిన వంటకాలు తినే సంప్రదాయం ఉంది. కానీ, దీని కోసం కేవలం నువ్వుల లడ్డూలే చేయాలా.. అవి రెండూ కలిపి మరేదైనా వెరైటీ ట్రై చేస్తే ఎలా ఉంటుంది. ఇదిగోండి ఆ కాంబినేషన్ తో తయారుచేసిన హల్వా. చూడటానికే కాదు, రుచిలోనూ అద్భుతహ అనిపించే హల్వా తిని మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిదైన భోగి పండుగను మొదలుపెట్టేయండి. నువ్వుల లడ్డూలు చేసుకునే సమయం లేదని బాధపడకుండా, నువ్వులు, బెల్లంతో కలిపి 15-20 నిమిషాల్లో తయారుచేయగల నువ్వుల పుడ్‌ను తయారు చేసుకోండి.

yearly horoscope entry point

నువ్వుల తయారీకి కావలసిన పదార్థాలు

  • అరకప్పు నువ్వులు
  • అరకప్పు దేశీ నెయ్యి
  • అరకప్పు బెల్లం
  • పావు కప్పు సేమియా
  • అర టీస్పూన్ యాలకుల పొడి

‌‌తయారు చేసే విధానం

  • ముందుగా నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉంచాలి.
  • ఆ తర్వాత నీటిని నుంచి వాటిని వడకట్టి తీసేయాలి.
  • ఒకవేళ నువ్వులను రాత్రంతా నానబెట్టడం కుదరకపోతే గోరువెచ్చని నీటిలో గంటసేపు నానబెట్టి మూతపెడితే సరిపోతుంది. కాసేపటికి బాగా ఉబ్బి మన వంటకు రెడీ అయిపోతాయి.
  • ఇప్పుడు నీటిని వడగట్టి నానబెట్టిన నువ్వులను మిక్సీ జార్ లో గ్రైండ్ చేసుకోవాలి. వాటిని నీరు లేకుండా గ్రైండ్ చేయాలని గుర్తుంచుకోండి.
  • నువ్వుల్లో ఉండే నేచురల్ ఆయిల్, వాటిని గ్రైండ్ చేయడానికి సహాయపడుతుంది.
  • ఇప్పుడు మందంగా ఉండే ఫ్రైయింగ్ పాన్ తీసుకోండి. దేశీ నెయ్యి దాని మీద పోసుకుని సేమియాను వేయిస్తూ తక్కువ మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  • సేమియా వేగిన తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకోవాలి.
  • అందులోనే ఎండు కిస్ మిస్ లు, జీడి పప్పు వేయించుకుని పక్కకుపెట్టుకోండి.
  • ఇప్పుడు అదే ఫ్రైయింగ్ పాన్ మీద రుబ్బిన నువ్వుల పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తక్కువ మంట మీద వేయించుకుంటూ బంగారు రంగులోకి వచ్చే వరకు వేయిస్తూనే ఉండాలి.
  • నువ్వులు వేయించి బంగారు రంగులోకి వచ్చాక అరకప్పు నీళ్లు పోసి కలపాలి.
  • అంతకంటే ముందు, బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తద్వారా బెల్లం సులభంగా కరిగిపోతుంది.
  • ఇప్పుడు నువ్వుల మిశ్రమంలో బెల్లం ముక్కలు వేయాలి.
  • వాటిని బాగా కలియబెడుతూ ఉడికించాలి. నీళ్లు ఆరిపోయేంత వరకూ బెల్లంను ఉడికించిన తర్వాత అందులో కాస్త యాలకుల పొడిని కలుపుకోవాలి.
  • అంతే మీ హల్వా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు గ్యాస్ మంట ఆఫ్ చేసి, వేయించి పెట్టుకున్న ఎండు కిస్ మిస్లు, జీడిపప్పు వేసుకుని గార్నిష్ చేసుకోండి.
  • అంతే ఇక బౌల్ లో వేసుకుని హల్వా సర్వ్ చేసుకోవడమే.

Whats_app_banner

సంబంధిత కథనం