Energy Drinks Effects : ఎనర్జీ డ్రింక్స్ తాగితే పిల్లలలో ఆత్మహత్య ఆలోచనలు-energy drinks increase risk of suicide thoughts in childrens study finds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Energy Drinks Effects : ఎనర్జీ డ్రింక్స్ తాగితే పిల్లలలో ఆత్మహత్య ఆలోచనలు

Energy Drinks Effects : ఎనర్జీ డ్రింక్స్ తాగితే పిల్లలలో ఆత్మహత్య ఆలోచనలు

Anand Sai HT Telugu
Jan 17, 2024 12:30 PM IST

Energy Drinks Side Effects : ఎనర్జీ డ్రింక్స్ తాగడం కొందరికి చాలా అలవాటు. మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు రెగ్యూలర్‌గా తాగిపిస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఎనర్జీ డ్రింక్స్
ఎనర్జీ డ్రింక్స్ (Unsplash)

మనం చేసే చిన్న తప్పులే పిల్లల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. చూసేందుకు చిన్న విషయంగానే కనిపిస్తుంది. కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారని కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కొనిస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెంచుతాయని అంటున్నాయి.

పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రచురించిని ఓ అధ్యయనం చదివితే కచ్చితంగా ఎనర్జీ డ్రింక్ గురించి భయపడాల్సి వస్తుంది. ఇది తెలిస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వరు. ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం వల్ల పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతాయని అధ్యయనం చెబుతుంది.

ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది పిల్లల తల, కడుపు ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. ఎనర్జీ డ్రింక్స్ పిల్లల్లో అధిక మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని, తద్వారా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అధ్యయనం పేర్కొంటోంది.

ఓ అధ్యయనంలో 1.2 మిలియన్లకు పైగా పిల్లలపై పరిశోధన చేశారు. ఎనర్జీ డ్రింక్స్ పిల్లలను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై 51 అధ్యయనాలు జరిగాయి. అబ్బాయిలు ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తారు. ఈ డ్రింక్స్ తాగితే పిల్లలు అడిక్షన్ బారిన పడతారు. అధ్యయన నివేదిక ప్రకారం వారు డ్రగ్స్ తీసుకోవడం, హింస, అసురక్షిత లైంగిక కార్యకలాపాలు, చెడు మార్గాలను అనుసరించే అవకాశం పెరుగుతుందట.

డ్రింక్స్ పిల్లల చదువులను కూడా ప్రభావితం చేస్తాయి. చదువుల పట్ల శ్రద్ధ తగ్గిస్తాయి. నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఈ తరహా సమస్యలు పెరుగుతాయి. అందుకే పిల్లలకు ఏది పడితే అది తాగించకూడదు. సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆత్మహత్య ఆలోచనలు కూడా ఎక్కువగా అవుతాయి.

ఎనర్జీ డ్రింక్ పిల్లలకు తరచుగా ఇవ్వడం వల్ల పిల్లల శారీరక ఆరోగ్యం కూడా ప్రభావం పడుతుంది. ఇది వారి శారీరక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. 16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మడాన్ని యూకే స్వచ్ఛందంగా నిషేధించింది. కొన్ని దేశాలు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ నిషేధించాలని ఆలోచనలో కూడా ఉన్నాయి. భారతదేశంలో కొన్ని ఎనర్జీ డ్రింక్స్ పిల్లలకు ఇవ్వకూడదని వాటి మీద లేబుల్స్ కూడా ఉంటాయి. కానీ ఇది ఆచరణలో మాత్రం రావడంలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లలు అడిగారని కొని ఇస్తున్నారు. ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. వారికి తాగాలి అనిపిస్తే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసి ఇవ్వండి. వారి భవిష్యత్‌ను నాశనం చేయెుద్దు.

Whats_app_banner