Egg Spinach Salad: బరువును తగ్గించే ఎగ్ పాలకూర సలాడ్, ఇలా తింటే నెల రోజుల్లోనే మీలో మార్పు కనిపిస్తుంది
Egg Spinach Salad: సలాడ్‌లు తినడం ద్వారా బరువు తగ్గొచ్చనే విషయం ఎంతో మందికి తెలుసు. కానీ ఎలా సలాడ్‌ను తయారు చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఇక్కడ మేము ఎగ్ పాలకూర సలాడ్ ఇచ్చాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కోడిగుడ్డు, పాలకూర ఈ రెండూ కూడా పోషకాహారాలే. అలాగే బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. ఇక్కడ మేము నెల రోజుల్లోనే మీ బరువును ఎంతో కొంత తగ్గించే ఆరోగ్యకరమైన సలాడ్ రెసిపీ ఇచ్చాము. దీనిలో పాలకూర, కోడిగుడ్డును వినియోగించాలి. ఇది ఆరోగ్యకరమైనది కూడా. ఇలా సలాడ్‌ను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం సమయంలో తింటే నెల రోజుల్లోనే మీ బరువులో మార్పు కనిపిస్తుంది. కనీసం రెండు నుంచి మూడు కిలోలు మీరు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇక కోడిగుడ్డు పాలకూర సలాడ్ ఎలా చేయాలో తెలుసుకోండి.
ఎగ్ పాలకూర సలాడ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
గుడ్లు - రెండు
పాలకూర తరుగు - ఒక కప్పు
కారం - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
నూనె - రెండు స్పూన్లు
మిరియాల పొడి - చిటికెడు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
బంగాళదుంప - ఒకటి
ఎగ్ పాలకూర సలాడ్ రెసిపీ
1. కోడిగుడ్డును, బంగాళదుంపలను ముందుగానే ఉడకబెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి ఆలివ్ నూనె వేయాలి.
3. నూనె వేడెక్కాక తరిగిన వెల్లుల్లిని వేయించుకోవాలి.
4. తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోసి వేసి కలుపుకోవాలి.
5. తర్వాత పాలకూర తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. అందులోనే మిరియాల పొడి, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలపాలి.
7. ఉడికించిన కోడిగుడ్లను ముక్కలుగా కోసుకొని అందులో వేసి టాస్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
8. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే టేస్టీ ఎగ్ పాలకూర సలాడ్ రెడీ అయినట్టే.
9. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తింటే సాయంత్రం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే సాయంత్రం తింటే రాత్రి భోజనం తినాల్సిన అవసరం ఉండదు.
మీరు ప్రతిరోజు ఈ సలాడ్ ను తినేందుకు ప్రయత్నించండి. అలాగే ఈ సలాడ్‌లో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పోషకాహార లోపం కూడా రాదు.
కోడిగుడ్డు, పాలకూర ఈ రెండూ కూడా పోషకాహారాలే. ఈ రెండింటితో సలాడ్ ను తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పాలకూరలో మన శరీరానికి అత్యవసరమైన ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా వాత, పిత్త దోషాలను సమతుల్యంగా ఉంచేందుకు పాలకూర ఉపయోగపడుతుంది.
టాపిక్